*శ్రీ రమణాశ్రమ స్మృతులు*
*శ్రీ రమణాశ్రమ స్మృతులు*
https://bhagavanraman.blogspot.com/2019/09/blog-post.html
తొలి పలుకులు:
https://www.facebook.com/359807631501891/posts/523839071765412/?app=fbl
శ్రీభగవాన్ దీవ్య స్మృతులు ఆయా సందర్భాలలో శ్రీవారు సెలవిచ్చే అమృత వాక్కులు, ఎన్ని విన్నా తనివితీరని భక్తులెందరో ఉన్నారు. వారందరిలోనూ మా అన్నగారైన డి.యస్.శాస్త్రిగారొకరు. నాకు 1976 ఫిబ్రవరిలో కాన్సర్ కు ఆపరేషను మా అన్న కూతురు వసంత ఉపచారంతో, మా అన్నగారి సహాయంతో జరిగింది. ఆ తరువాత కోబాల్ట్ వైద్యం జరుగుతూ వున్నపుడు మాఅన్నగారు నా మంచం వద్ద కుర్చీలో కూర్చొని ఉదయం భగవధ్గీత, సాయంత్రం భాగవతమూ చదువుతూ వుండేవారు. నేనపుడు యాదృచ్చికంగా ఆయా సంధర్భాలలో భగవాన్ సెలవిచ్చిన మాటలు అనేకం చెపుతూ వుండేదాన్ని. అప్పుడు శ్రీరమణాశ్రమ లేఖలలోనూ, నా రమణాశ్రమ జీవితం లోనూ వ్రాసనవన్నీ వారే వ్రాసిపెట్టి, ఇంకా నాకు జ్ఞాపకం వచ్చినవన్నీ వ్రాయమని తొందరించారు. కాని అప్పుడందుకు ఉత్సాహం కలుగలేదు. భగవదాదేశంగా ఎపుడు ఉత్సాహం కలిగితే అప్పుడే రాస్తానని వారిని సమాధాన పరిచాను.
ఆ తరువాత 10 - 5 - 76న విశ్రాంతి నిమిత్తం మా అక్క కుమారుడు జి. ఆర్. శర్మ బెంగుళూరులో వుంటే, నన్నక్కడకు విశ్రాంతికిగాను పంపగా వెళ్లి 4-10-76 వరకూ కోడలు నిర్మల ఉపచారంతో అక్కడున్నాను. ఆ రోజుల్లోనే భగవాన్ స్మృతులన్నీ జ్ఞాపకం చేసుకొని రాయవలసిందనీ, రాస్తే వెంటనే ప్రచురించగలమనీ ఆశ్రమంనుంచి వి.గణేశన్ జాబు రాసాడు. అయినా రాయాలన్న బుద్ది పుట్టలేదు. ఆశ్రమానికి వచ్చి అక్కడ వుండగల శక్తి లభిస్తే అప్పుడు చూస్తానని బదులు రాసాను. మా అక్క కూతురు చి౹౹ సౌ౹౹ ప్రఫుల్ల, ఆమె భర్త ఎస్. ఆర్.అవధాని మావద్ద కూడా కొన్నాళ్ళుందువు కాని రమ్మని 12-10-76న నన్ను బొంబాయి తీసికొని వెళ్ళారు. నేనక్కడున్నానని తెలిసి బొంబాయి రమణకేంద్ర కార్యదర్శి పి. వి. సోమసుందరం భారతీయ విద్యాభవనంలో 20-11-76 తేదీన రమణ భక్తుల సమావేశం ఏర్పాటు చేసి నన్నక్కడికి ఆహ్వానిస్తూ భగవానుని గురించి ఏవైనా నాలుమాటలు చెప్పాలని కోరాడు. ఉపన్యాసధోరణి నా కలవడలేదంటే. ఏదైనా వ్రాసి చదవమని కోరాడు. తప్పింది కాదు. నేనేదో కొద్దిగా తెలుగులో వ్రాస్తే ఎస్. ఆర్. అవధాని ఇంగీషలోకి అనువదించాడు. ఆ విధంగా 18 - 11 - 76 ఉదయం బొంబాయి బ్యాంకుహౌస్ ఎదుటనున్న పార్కులో అశ్వత్థవృక్షం క్రింద కూర్చుని వ్రాయుటకు ప్రారంభించి క్రమంగా భగవాన్ వాక్కులు వ్రాయుటకు ఆరంభించాను. ఆశ్రమంవారి అనుమతీ, మా అన్నగారి ఆజ్ఞ అదే కదా! అందువల్ల అదంతా భగవదాదేశంగా భావించి కలం నడుపుతున్నాను. పునరుక్తులున్న మన్నింపవలేనని పాఠకులకు ప్రార్ధన.. శ్రీ రమణాశ్రమము తిరువణ్ణామలై
1-2 -1978. సూరి నాగమ్మ.
Comments
Post a Comment