రమణాశ్రమ లేఖలు 75 స్వర్ణోత్సవ కార్యక్రమము 9-9-46
రమణాశ్రమ లేఖలు 75 స్వర్ణోత్సవ కార్యక్రమము 9-9-46
https://www.facebook.com/359807631501891/posts/468854080597245/?app=fbl
నిన్నటి జాబులో స్వర్ణోత్సవం గురించి కొంతవరకు వివరించాను. ఈ జాబులో నాటి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడుంబావు వరకు జరిగిన కార్యక్రమము క్లుప్తంగా వ్రాస్తున్నాను.
ఉదయం ఏడుంపావుకు ఉమా, మొదలైన పుణ్యాంగనలు భజనలతో పాల కలశాలు తెచ్చి భగవానులకు, భక్తులకు సమర్పించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. పిదప భక్తులనేకులు సంస్కృతంలో, అరవం, తెనుగు, కన్నడం, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో వ్రాసిన వ్యాసాలు, పాటలు, పద్యాలు చదివారు. ఈ స్తోత్రం కొంత, కొంత వ్యవధితో మధ్యాహ్నం రెండింటివరకూ జరుగుతూనే ఉన్నది. సుమారు ఎనిమిదిన్నర మొదలు, తొమ్మిదిన్నరవరకూ బూదులూరి కృష్ణమూర్తి అయ్యర్ పాటకచేరి. తొమ్మిదీ ముప్పావు మొదలు పదింటివరకు విశ్రాంతి. పదింపావుకు మాతృభూతేశ్వరాలయంలో పూజ,కర్పూర హారతి జరిగినవి. పదుకొండు గంటలకు అరుణాచలేశ్వరాలయం నుంచి గురుకుల ప్రసాదం తెచ్చి భక్తిపూర్వక ప్రణామంతో భగవానులకు సమర్పించారు. పదకొండు మొదలు పన్నెండువరకు విశ్రాంతి.
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
యధాప్రకారం రెండింటివరకు భగవాన్ హాలులో వుండి విశ్రాంతి తీసుకుంటే మంచిదని భక్తులు కోరారు గానీ, వారొప్పుకుంటారా? భోజనమయ్యీ కాకుండానే కొలువు కూట మలంకరించారు. ఎంతెంత దూరం నుంచో ఎందరెందరో స్తుతించి సేవించాలని వస్తే, వ్యవధి చాలక వారికి ఆశాభంగ మౌతుందని; తమ శరీర కష్టాన్ని పాటించక ఆ కరుణామూర్తి అలా సేవను స్వీకరించి అనుగ్రహించారు.
https://t.me/c/1178911790/1864
రెండింటివరకూ భగవాన్ దర్శనం ఉండదని చాలామంది ఇంటికి వెళ్లారు. భోజనానంతరం ఇట్టే వచ్చి చూతునుగదా _*కోటిసూర్య ప్రకాశమానమగు తేజస్సుతో, భక్త బృందపరీవృతులై భగవాన్ పాకలో సోఫామీద కూర్చుని ఉన్నారు.*_ స్తోత్రం జరుగుతూనే ఉంది. _*ఏ చక్రవర్తినీ, ఏ దైవాన్నీ ఈ పురుషోత్తమునికి సరిపోల్చరాదు. ఏమంటే చక్రవర్తి దర్శనానికి వెడితే ఎన్నో ఆటంకాలు, ఎంతమంది సిఫార్సులు కావాలి. దేవతా దర్శనమంటావా? వైకుంఠానికి వెళ్ళినా జయ-విజయులు ద్వారం దగ్గర కాపలా వుండి వేళకాదు పొంమ్మంటారు. కైలాసానికి వెడితే ప్రమధ గణాలూ అంతే! ఇక్కడో పశుపక్ష్యాదులతో సహా ఎప్పుడూ ఎవరికీ ఏ ఆటంకమూ పెట్టగూడదని ఒకటే శాసనం. చక్రవర్తి శాసనానికైనా తిరుగుందిగానీ; దీనికి తిరుగు లేదు. ఈ దయామూర్తి కెవరు సాటి? వారికి వారే సాటి.*_ (ఇంక ఉంది)
రమణాశ్రమ లేఖలు 75 స్వర్ణోత్సవ కార్యక్రమము ( తరువాత భాగం)
https://www.facebook.com/359807631501891/posts/468854080597245/?app=fbl
రెండు గంటల నుంచీ నేల ఈనినట్లుగా జనం మూగారు. స్వచ్ఛంద సేవకులు, ఆ జనాన్ని సర్దుబాటు చేసి నిశ్శబ్దంగా కూర్చోబెడుతూ వుంటే ఆ జూబిలీ హాలు చక్రవర్తి దర్భారు మందిరంవలె ఉన్నది. రెండు గంటలకు స్వర్ణోత్సవ పుస్తకం (సావనీర్) సమర్పణ, తరువాత పూర్ణ కుంభసహితులై వచ్చిన బ్రాహ్మణోత్తముల వేదనాదంతో గూడిన ప్రణామము, హిందీ ప్రచారసభ వారి వ్యాసపఠన జరిగిన తరువాత లౌడ్ స్పీకర్ పెట్టారు. ఆర్యవైశ్య సమాజము వారి తరుపున తెనుగులోను, మునుస్వామి శెట్టి సహోదరుల తరఫున అరవంలోను సన్మానపత్రములు చదివిన తరువాత ఉపన్యాసాలు ప్రారంభించారు.
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
ఆ సభకు అధ్యక్షులు శ్రీ సి. ఎస్ కుప్పస్వామయ్యర్. వీరు మద్రాసు హైకోర్టు జడ్జి. ఇంగ్లీషులో వీరి ప్రారంభోపన్యాసం అయిన తరువాత సర్. ఎస్.రాధాకృష్ణయ్య గారి వ్యాసం. శ్రీ టి.కె. దొరస్వామి అయ్యర్ చదివారు. ఆనాడే వచ్చినది ఆ వ్యాసం పోస్టులో.
ఆ తరువాత స్వామీ రాజేశ్వరానంద, డాక్టర్ టి ఎం.పి. మహదేవన్ గారలు ఇంగ్లీషులోనూ, శ్రీ జస్టిస్ చంద్రశేఖరయ్యరు తెలుగులోనూ, యమ్.యన్. చెల్లం, ఓమందూరు రామస్వామి రెడ్డియార్ (ఎమ్.ఎల్.సి. ) ఇటీవల వీరు ప్రధమ మంత్రులయిరి - అరవంలోనూ, కే. కే. ఐరావతమయ్యర్ మలయాళంలోనూ మాట్లాడారు. ఆర్.ఎస్. వెంకటరామశాస్త్రిగారు ప్రార్ధనా శ్లోకాలు చదివి, సంస్కృతంలో ఉపన్యసించారు. కుంజుస్వామి పాటలు పాడారు. వారందరి ఉపన్యాస సారాంశం వ్రాయదగినదే గానీ నాకీ భాషలన్నీ వచ్చునా? వ్రాయడానికి. అగ్రాసనాధిపతి అంత్యోపన్యాసంతో నాలుగు ముప్పావైనది. ఈ మధ్యనే స్వర్ణోత్సవ ఫిల్మ్ తయారు చేయు నిమిత్తం ఇండియన్ ఇన్ఫర్మేషన్ బ్యూరోవారు ఫోటో తీసుకున్నారు. పావుగంట విశ్రాంతి. ఐదింటినుంచి అణ్ణామలై పిళ్ళై(కాంగ్రెస్ శాసనసభ్యుడు) పురజనుల తరుపున కృతజ్ఞతా పూర్వక అభివందనం,ముసిరి సుబ్రహ్మణ్యయ్యర్ పాట కచేరి. వేద పారాయణం ఇత్యాదులతో ఏడుంపావుకు కార్యక్రమం ముగిసింది. ఈ లోపు సాయంత్రం షుమారు ఆరుగంటలకు వేగాళ్ల మండపంలోని ఏనుగు నలంకరించి తెచ్చి భగవానులకు నమస్కారము చేయించి తీసుకొని వెళ్ళారా మావటీలు.ఆ వేగాళ్ళ మండప మందున్న పాతాళగుహవాసి అయినప్పుడే ఈశ్వరునిచే ఆత్మ సామ్రాజ్యమున కభిషిక్తుడైన యోగిరాట్చక్రవర్తి గదా రమణ భగవానుడు. ఇది స్వర్ణోత్సవ వైభవ కార్యక్రమము.
అయితే ఇందరు ఇన్ని విధాలుగా స్తుతించి సేవిస్తుంటే వారందరికీ భగవాన్ ఏమి సందేెశమిచ్చారని అడుగుతావేమో? _*"సర్వంబు గనుచును సాక్షిమాత్రముగ నిర్వికారుండయి నెగడుచున్నాడు. గుణ వికారంబుల కూడికలేని ప్రణవ స్వరూపమై బరుగుచున్నాడ"*_ ని స్వర్ణోత్సవ ద్విపదలో నేను వ్రాశాను. అదేవిధముగా _*భగవాన్ చలనరహితమైన స్థితియందుండి, సాక్షిమాత్రంగా చూస్తూ,వింటూ, మౌనంగా ఉన్నారు. అదే మనకు వారిచ్చు అమోఘమైన సందేశము.*_ *ఆ మౌనము నుండి వెడలు కృపావీక్షణములే సకల జీవుల హృదయాంతరాళము జొచ్చుకునిపోయి, శాంతి, సౌఖ్యములనిచ్చి రక్షిపగలవు. ఆ మౌనభాస్కర మహాతేజస్సే దశదిశల వ్యాపించి అజ్ఞానాంధకారమును పటాపంచలు గావింపగలదు గాని, మనోవాక్కుల కతీతమైన దానిని వాగ్విలాసముచే వెలిబుచ్చుటెట్లు?*_
T.Me/BhagavanRaman
Comments
Post a Comment