రమణాశ్రమ లేఖలు 73 నే ననేది మనస్సే 28-8-46
రమణాశ్రమ లేఖలు 73 నే ననేది మనస్సే 28-8-46
https://bhagavanraman.blogspot.com/2019/07/73-28-8-46.html
ఈ ఉదయం ఆంధ్రులొకరు భగవాన్ నిలా ప్రశ్నించారు. "నేనెవరినని విచారించి తెలుసుకొనుటే ప్రధానమని అంటారే,అదెట్లా తెలుసుకోవటం? 'నే నెవరు నే నెవరు' అని జపం చేయాలా? లేక 'నేతి భావన' చేయాలా? ఆ మార్గమేదో తెలుసుకోవాలని వున్నది, స్వామీ! అన్నారు. భగవాన్ రవంత నిదానించి "ఏం తెలుసుకోవాలి? తెలుసుకునేది ఎవరు? తెలుసుకునేందుకు తానొకడుండాలి కదా! తానెవరు? తానెక్కడ నుండి వచ్చాడు? ముందు అదే తెలుసుకోవాలి. తానెక్కడ పుట్టింది తెలుసుకుంటే తనకన్నా అన్యమేదీ లేదు" అన్నారు.
https://www.facebook.com/359807631501891/posts/472323290250324/?app=fbl
"ఆ నేననేది తెలుసుకోటానికి సాధన యేదైనా వుండాలి కదా? ఏ సాధన ఉపయోగిస్తుంది?"అన్నారా పృచ్ఛకులు. "అదే, అదే చూడాలి. ఎక్కడ చూచేదీ అంటే లోపల చూడాలని చెప్పాల్సి వస్తుంది. 'నే' ననేది మనస్సే కదా దాని రూపమేమో తెలుసుకొని, ఎట్లా పుట్టింది? ఎక్కడ పుట్టింది? అని చూడా" లన్నారు భగవాన్. 'నే'ననేది ఎక్కడ పుట్టిందంటే హృదయమందనే కదా? పెద్దలంటారు. దాన్ని ఎలా చూడటం?" అని మళ్లీ ప్రశ్న.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
"అవును హృదయమందనే చెప్పాలి. ఎలా చూడటమంటే *మనస్సు పూర్తిగా అణిగిపోవాలి.* *అంతేగాని 'నేనెవరు' 'నేనెవరు' అని నోటితో జపించి నందువల్ల 'నేనిది కాదు, 'నేనది కాదు' అని వాక్కుతో నేతి భావన చేసినందువల్ల ప్రయోజనం లేదు"* అన్నారు భగవాన్.
"అదే చేతకావటం లే" దంటే, "అవునవును. అదే ఉన్న కష్టం. *మనం ఎప్పుడూ ఉంటాము. ఎక్కడా ఉంటాము. మనది కాని ఈ శరీరాదులన్నీ తెచ్చిపెట్టుకొన్నవి*. *ఇవి తెచ్చుకొనేప్పుడు ఒక కష్టం లేదు. తోసేయాలంటే తగని బాధ. ఉన్నదాన్ని చూడటానికి, లేనిదాన్ని తోసివేయటానికి కష్టపడతాం. ఎంత చిత్రమో చూడండి"* అన్నారు భగవాన్.
ఆ మధ్య నొక బెంగాలీ యువకుడు,ఇలాగే భగవంతులను ప్రశ్నలడుగుతూ ఉంటే వారెంతో దూరం బోధించారు. ఆ యువకునకు సందేహం తీరక 'ఎప్పుడూ ఎక్కడా నీవున్నా' వంటారే, ఆ 'నేను' అనేది యెక్కడుంది?" అని అడిగాడు. భగవాన్ చిరునవ్వుతో "నీవు ఎక్కడా ఉన్నావు. ఎప్పుడూ ఉన్నావు అంటే, ఆ 'నేను' అనేది ఎక్కడున్నది అని అడగటం ఎట్లా ఉందంటే, తిరువణ్ణామలలోనే ఉండి తిరువణ్ణామల ఎక్కడ? అని అడిగినట్లుంది. *నీవు అంతటా వున్నప్పుడు వెతికేదెక్కడ? శరీరం నేననేది భ్రాంతి. ఆ బ్రాంతిని పోగొడితే ఉండేది* *'నీవే' 'నీ'లోనే సమస్తం వున్నది*. *లేనిదైతే వెతకాలి గానీ ప్రత్యక్షంగా ఉండేదాన్ని ఎందుకు వెతకటం? శరీరం నేననే భ్రాంతి పోగొట్టుకోటానికి సమస్త సాధనలూ. 'నే నున్నా' నను తెలివి యేది వున్నదో అదే ఆత్మ అని గాని, పరమాత్మ అని గాని, మరి ఏమన్నాసరే. అది యెప్పుడూ ఎక్కడా వున్నది. శరీరాదులు నేనుకాదని తోసివేయాలేగాని దానికొరకు వెతకనక్కరలేదు. అది అంతటా నిండిఉన్నది"* అన్నారు. దీనికి ప్రమాణం గా ఉన్నది నలుబదిలో చెప్పిన శ్రీవారి వాక్కులే క్రింద వ్రాస్తున్నాను.
T.Me/BhagavanRaman
16. మనము లేక కాల మేది? దేశ మేది? మనము. దేహ మనినచో కాల దేశములకు లోబడ గలము. మనము దేహమా? మనమిప్పు డప్పు డెప్పుడు
నొకరము. ఇక్క డక్క డెక్కడ నేకమే. కనుక,
కాల దేశము లేని మనమే యున్నారము.
Comments
Post a Comment