రమణాశ్రమ లేెఖలు 71 అక్షర స్వరూపం 26.8.46.
రమణాశ్రమ లేెఖలు 71 అక్షర స్వరూపం 26.8.46
https://bhagavanraman.blogspot.com/2019/07/71-26846.html
భగవానులకు కాగితాలు అందీయటానికీ, లైబ్రరీ పని చూడటానికి గత జూలై చివరలో ఏమో మళ్ళీ రాజగోపాలయ్యర్ వచ్చారు. ఆ కొత్తల్లోవారు
అడుగునపడ్డ కాగితాలన్నీ పెళ్ళగించటంలో ఒకనాటి సాయంత్రం భగవాన్ స్వదస్తూరితో ఉన్న అరవ పద్యము దానికి అనువాదంగా వ్రాసిన తెనుగు పద్యమూ ఉన్న చిన్న కాగితం దొరికింది. భగవానులకందిస్తే ఎవరు వ్రాసిందీ జ్ఞప్తి లేక నన్ను పిలిచి చూపించి ఎవరిదని అడిగారు. పరికించి చూస్తే తిరుచ్చుళి సుందర మందిరంలో గృహప్రవేశమైన తరువాత తిరుచ్చుళిని గురించి నరసింహం సెట్టిగారు వ్రాసిన అరవ పద్యము, దానికి అనువాదంగా నేను వ్రాసిన తెనుగు పద్యము ఉన్నదందులో. భగవానులకు విషయం నివేదించి ఈ పద్యం నేను వ్రాసుకొని తెస్తానంటే సరే నన్నారు.
https://www.facebook.com/359807631501891/posts/474121170070536/?app=fbl
వేదపారాయణానంతరం ఇంటికి వెడదామని బయలుదేరి నమస్కరించి లేచాను లేదో "ఏదీ కాగితం" అన్నారు భగవాన్. ఇంటికి తీసుకువెళ్లి వ్రాసుకొని ప్రొద్దున తెస్తానంటే సరేనన్నారు గాని ఇస్తానో ఇవ్వనో అని అనుమానమే వారికి. *ముత్యాల కోవల్లేవుండే ఆ అక్షరాలు చూస్తే నాకు అప్పుడప్పుడు అటువంటి కాగితాలు దగ్గర వుంచేసుకోవాలన్న కోరిక పీడిస్తూనే వుంటుంది. అటువంటి కోరికలు లేేశమైన లేకుండా తోసేయాలనే భగవాన్ ఆ కాగితం తిరిగి ఇచ్చి వేయామన్నారు*.
ఆ రాత్రి తెనుగు పద్యం వ్రాసుకుని తమిళ్ వృత్తం తెనుగక్షరంలో వేరే కాగితంమీద వ్రాసి భగవానులకు చూపిన తరువాత ఆశ్రమం నోటుబుక్కులో కాపీ చేద్దామని మర్నాడు ఉదయం ఏడున్నరకు వెళ్లి నమస్కరిస్తే, "ఏది ఆ కాగితం?" అన్నారు మళ్ళీను. "తెచ్చాను. అరవ పద్యం తెనుగక్షరంలో వ్రాశాను. సరిగా ఉందో లేదో చూస్తే కాపీ చేస్తా" నని చెప్పి ఇస్తే సరిచూచి, ఇచ్చారు భగవాన్. వారు కొండ దిగి రాకముందే సెల్ఫులో నోటుబుక్కు తీసి దగ్గరుంచుకున్నాను. అది వారు చూడలేదు. కాగితం చేత్తో పట్టుకుని సంచి తీసుకుని బయటికి వెళ్లబోతుంటే "మీరు వ్రాసుకుని ఆ కాగితం నాకిచ్చేయండి నాక్కావద్దూ?" అన్నారు భగవాన్.
"ఇన్నిసార్లలడిగేసరికి నాకు ఎక్కడ లేని ఉక్కురోషం వచ్చింది. పట్టలేక ఇట్లా అన్నాను.
రమణాశ్రమ లేెఖలు 71 అక్షర స్వరూపం (తరువాత భాగం). https://bhagavanraman.blogspot.com/2019/07/71-26846.html
"ఈ వ్రాతపనిలో నా దగ్గరకు ఎన్నో కాగితాలు వచ్చినవి. ఎప్పుడూ ఒక కాగితమైనా వుంచుకోలేదు. అన్ని యిచ్చేశాను వీరే సాక్ష్యం" అని నేననేసరికి అవునవు నన్నారు రాజగోపాలయ్యరు. నా ఉడుకు ఇంకా తీరక, "నోరుగల వాళ్ళదే రాజ్యమన్నట్లుంది యీ సమాచారం. అంతా అడుగుతున్నారు, వ్రాయించుకుంటున్నారు. ఇలాంటివి కనబడితే, అడక్కుండానూ దాచుకుంటున్నారు. అయినా ఈ అక్షర మిచ్చి నన్ను మరిపిస్తే యెట్లా? నాకేమీ వద్దు ఇది. ఇప్పుడే యిస్తాను" అనేసరికి కంఠం రుద్ధమై కళ్లు నీళ్లతో నిండినవి. నిలువ లేక బయటకు వెళ్లి ఎలాగో బుక్కులో కాపీ చేసి పుస్తకం భగవానుల కిచ్చి ప్రక్కన నిలబడ్డ గోపాలయ్యరు చేతిలో కాగితం పెట్టి కంపిత స్వరంతో "కాగితం ఇచ్చాను వీరికి" అన్నాను.
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
భగవాన్ హృదయం కరుణతో నిండిపోయి "కావాలంటే అది పెట్టుకోండి" అన్నారు మెల్లిగా! నాకేం పౌరుషం తక్కువ కనుకనా "ఎందుకూ ఈ అక్షరం చెరిగిపోతుంది. యీ కాగితం చినిగిపోతుంది" అన్నాను వణుకుతూ. యథాస్థానానికి వచ్చి కూచోబోతుంటే అతి మార్ధవ స్వరంతో "పద్యం వున్నదా?" అన్నారు భగవాన్. ఊపిరి బిగపట్టి "వుంది" అన్నాను. పైకి బింకమేగానీ లోపల ఆశ పీడిస్తూనే వున్నది. రెండుమూడేళ్ల క్రితం భగవాన్ ఏదో పద్యం వ్రాస్తే అది వారే వ్రాసి ఇవ్వాలని అందరూ వంతులు పడి వ్రాయించుకోవటం, కొంతమంది వారి అక్షరం దొరికితే చాలు చెప్పకుండా దాచుకోటం, అడిగితే ఇవ్వకపోవటం. చూచి నా ఆశ రేగకుండా ఒక పద్యం వ్రాసుకుని సమాధానపడ్డాను. ఆ పద్యం ఇది.
తే౹౹ హృదయ కమలదళంబులన్ జెదరకుండ
నక్షరస్వరూపుండవై యలరు నిన్ను
గర్మవాసనమసక చే గాంచ లేక
హస్త లిఖితాక్షరము గోర నగునె రమణ౹౹
*ఎప్పటికైనా ఈ మసక పోవునట్లు కళ్ళు తుడిస్తే చాలు అక్షర స్వరూపం చక్కగా తెలుస్తుంది. ఆ అక్షరం చెరగదు. ఆ కాగితం చినగదు. ఈ అక్షరం నోరుగల వాళ్లకే యిచ్చి నోరులేని బిడ్డకు కన్ను బాగుచేస్తే అంతే చాలు. దాని తిప్పలది పడుతుంది* "భవరోగ భిషగ్వరః" అన్న బిరుదు ఉండనే ఉన్నది గదా! సార్ధకం చేయకుండా వుంటారా యేం? చూద్దాం. అయితే ఒకటి. అందరి కన్నులకూ మందు వేస్తూనే వున్నారు. కొంచెం కొంచెంగా మసక తగ్గుతూనే వున్నది.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment