రమణాశ్రమ లేఖలు 70 స్వామి ఎక్కడ లేడు 25.8.46
రమణాశ్రమ లేఖలు 70 స్వామి ఎక్కడ లేడు 25.8.46
https://bhagavanraman.blogspot.com/2019/07/70-25846.html
నీవు జవాబు వ్రాసి పంపిన ఐరోపాదేశీయులు మొన్న సాయంత్రం కారులో వచ్చారిక్కడికి. ఒక అమెరికా దేశీయురాలు కూడా వచ్చింది వారితో. నిన్న ఉదయం వాళ్ళు ఊరంతా తిరిగి స్కందాశ్రమం చూచి మధ్యాహ్నానికి ఆశ్రమ చేరుకున్నారు. ఊరికి వెళ్లాలని బయలుదేరి మూడింటికి హాల్లోకి వచ్చి కూర్చున్నారు. పాపమా అమెరికా దేశపు స్త్రీ క్రింద కూర్చో లేక అవస్థ పడుతూ నా ప్రక్కనే ఎట్లాగో కూర్చుని భగవాన్ సోఫా వైపుకు కాళ్లు చాచింది.
https://www.facebook.com/359807631501891/posts/475373859945267/?app=fbl
నాకూ అమర్యాదగానే తోచినా వెళ్ళిపోయేవాళ్లు కదా అని ఊరుకున్నాను. సమీప వర్తులగు రాజగోపాలయ్యరుకి అది సహింపరానిదిగా వుండటం వల్ల "అమ్మా, కాలు ముడుచుకొండి" అని ప్రార్థనపూర్వకంగా చెప్పారు. చిరునవ్వుతోనే ముడచుకొన్నదామె. భగవాన్ చూచారు. " సరి సరి వాళ్ళు క్రింద కూర్చోవటానికే కష్టపడుతుంటే కాళ్ళు ముడుచుకోవాలా" అన్నారు నవ్వుతూ. పాపమా భక్తుడు భయపడుతూ "లేదు, లేదు. ఇక్కడి మర్యాద వాళ్లకు తెలియదని చెప్పాను అంతే" నన్నాడు. "ఓహో అట్లాగా? మర్యాద కాదా? *అయితే వాళ్ళ వైపు కాళ్లు చాచటం నాకు మర్యాద కాదు. ఆ మాట నాకున్నూ తాకి వస్తుందికదా?"* అని నవ్వుతూ మందలించి కాళ్లు ముడుచుకున్నారు భగవాన్. అందరం నవ్వామే గాని మనసులో వేదన కలిగింది. ఆ వ్యక్తులిద్దరూ అరగంట వుండి భగవాన్ సెలవు పొంది వెళ్లిపోయారు.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
భగవాన్ నిన్నంతా మర్యాద కాళ్ళు జాచుతూ 'మర్యాద కాదు గాబోలు'నంటూ మళ్ళీ ముడుచుకుంటూ అట్లాగే కాలం గడిపారు. అలా కాళ్ళు ముడుచుకుంటే పదినిమిషాలలో పట్టు పట్టేస్తాయి శ్రీవారి కాళ్ళు. అరగంట రుద్దితేగాని ఆ పట్టు సడలవు. ఇంక నొప్పి సంగతి చెప్పవలసిందే లేదు. నేటి మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్లేసరికి హాల్లో ఇద్దరు ముగ్గురుకన్న జనం లేరు. భగవాన్ కాళ్ళ జాపుకుంటూ మందహాసంతో "ఏమోనయ్యా జాపుకోవచ్చునా? మర్యాద కాదన్నారు గదా?" అంటూ వుంటే పాపం రాజగోపాలయ్యరు చిన్నబోయిన ముఖంతో మ్రానుపడి నుంచున్నారు. భగవాన్ కరుణాపూర్ణులు కదా! కాళ్ల జాపే వుంచారు. మా కళ్ళు చల్లబడ్డవి. కూర్చన్న నావంక చూచి అవ్వయార్ కథ చెప్పుట ప్రారంభించారు.
రమణాశ్రమ లేఖలు 70 స్వామి ఎక్కడ లేడు (తరువాత భాగ0)
https://bhagavanraman.blogspot.com/2019/07/70-25846.html
కైలాసం నుంచి వచ్చిన తెల్ల యేనుగు నెక్కి సుందరమూర్తి వెడుతుంటే చూచి చేరరాజు అశ్వం చెవులో పంచాక్షరీ మంత్రం వూది దానినెక్కి తాను వెళ్ళడట. కైలాసానికి వాళ్ళిద్దరూ వెళ్లారని గణపతి పూజ చేస్తున్న అవ్వయారు తాను పోవాలని తొందరపడుతుంటే ఆ గణపతి అవ్వను చూచి "అవ్వా తొందరపడకు పూజ సావకాశంగా కానీయ్యి, నేను వాళ్ళ కంటే ముందు నిన్ను కైలాసం చేరుస్తా" అన్నాడట. సరే, పూజ అయింది చేయ్యి తిప్పుతూ "అవ్వా కళ్ళు మూసుకో" అన్నాడు. అంతే! కళ్ళు తెరిస్తే కైలాసంలో పార్వతి పరమేశ్వరుల ఎదుట కూర్చుని ఉంది. సుందరమూర్తి, చేరరాజు వచ్చి చూచేసరికి ఈమె కూర్చుని ఉంది. ఎలా వచ్చిందని ఆశ్చర్యపడి విచారించి విని ఆమె భక్తికి ఆనందించారు.
"అవ్వ పాపం పెద్దదాయె! పరమేశ్వరున కెదురుగా ఇలా నాలాగే కాళ్ళు జాచి కూర్చుంది. పార్వతికేమో పట్టరాని బాధ. స్వామి కెదురుగా కాళ్ళు చాచిందే, అపరాధం కదా అన్న దిగులు. చెప్పి చూతునా అని పరమేశ్వరునితో మనవి చేసింది. "అమ్మో మాట్లాడకు నోరు తెఱవకు ఆమెనేమి అనరాదు" అన్నాడట ఈశ్వరుడు. అయితే మాత్రం అర్ధాంగి కదా! ఆ అమర్యాద ఎలా సహిస్తుంది. చెప్పమని చెలికత్తె చెవిలో వూదింది. ఆ అమ్మ అవ్వను సమీపించి "అవ్వా అవ్వా కాళ్ళు ఈశ్వరుని వైపు పెట్టకు" అన్నదట. " *అలాగా అమ్మా ఈశ్వరుడెటు లేడో చెప్పు. ఇటు తిప్పనా?" అని కాళ్ళు ఇటు తిప్పితే ఈశ్వరుడిటే తిరిగాడట. అటు తిప్పితే అటు, ఎటు తిప్పితే అటు స్వామి తిరగవలసి వచ్చింది". పార్వతిని చూచి "చూచావా! నే చెపితే విన్నావు కాదు. ఆమె నన్ను ఎలా తిప్పుతున్నదో చూడు. ఇందుకే నోరు మెదపకు అన్నాను" అని అన్నాడట ఈశ్వరుడు. "అవ్వా క్షమించ"మని ప్రార్ధించిందట పార్వతి. *ఇలాగే వుంది స్వామి వైపు కాళ్లు జాచవద్దనటం. స్వామి ఎక్కడ లేడు?*" అన్నారు భగవాన్.
"నామదేవుని కథలో కూడా ఇలాంటి సంభవం వున్నది కదూ" అన్నారు భక్తులు. "అవును అదీ యింతే! విఠలమూర్తి నాయందే ఎక్కువ మక్కువగా ఉన్నాడని నామదేవ్ గర్విస్తే జ్ఞానదేవాదు లొకసారి గోరా కుంభారుని ఇంటికి అతనిని విందుకు పిలుచుకు పోయినారు. భోజనానంతరం అంతా వరుసగా కూర్చుని ఇష్టాగోష్టిగా గోరాకుంభారునితో; "ఏమోయి నీవు కుండలు బాగా చేస్తావు కదూ? ఈ కుండలలో పక్వమైనవేవో కానివేవో నాణెం చూచి నిర్ణయించ" మని చమత్కారంగా చెప్పారు. వారు ఒక కోల పుచ్చుకుని ఒక్కొక్కరి తల మీద రెండంటిచటం మొదలు పెట్టారు.
అంతా తలవంచి నమ్రతతో వూరుకున్నారు. నామదేవుని వంతు వచ్చేసరికి "ఊ..నన్నా కొట్టవస్తావని ఎదిరించారు" "ఆ ఇది పక్వంగాని కుండ" అని కుంభారు అనేసరికి సభ్యులంతా ఫక్కున నవ్వారు. పాపం నామదేవ్ కు పట్టరాని ఉక్కురోషం వచ్చింది. వీళ్ళంతా నన్ను అవమానం చేయడానికే తీసుకువచ్చారని నిందిస్తూ విట్టల్ వద్దకు వెళ్ళి రోదించడం మొదలు పెట్టాడు. "ఏమోయి, ఏమి కథ" అని స్వామి అడిగితే జరిగిందంతా నివేదించాడు. "అయితే సరేగానీ, గోరా అట్లా కొట్టవస్తే మిగతావారంతా ఏం చేశారూ?" అన్నారు స్వామి.
నామ: వాళ్ళంతా నోరు మూసుకొని తల వొగ్గారు.
విఠ : మరి నీవో?
నామ: *వాళ్ళల్లేనా నేను? మీవద్ద నేనెంత చనువుగా ఉంటాను. నన్నా కొట్టేది?*
విఠ: *ఆ. అదే అహంకారం. వాళ్ళంతా నా యదార్థ స్వరూపం తెలుసుకుని స్వస్థచిత్తులై మౌనంగా ఉన్నారు. నీవో అట్లా కాదు.*
నామ: మీరు నాతో ఇంత చనువుగా ఉంటారే, ఇంకేమి యదార్థం తెలుసుకోవాలి.?
విఠ: అది కాదోయ్, యదార్థం తెలుసుకోవాలంటే పెద్దలను సేవించాలి. నాదేముందీ! నీ వాడితే నేను ఆడాను. నీవు నవ్వితే నేనూ నవ్వాను. నీవు యెగిరితే నేను యెగిరాను. యధార్థం తెలుసుకుంటే ఈ యెగురుళ్ళుండవు.
నామ: పెద్దలన్నారే, మీ కంటే పెద్దలెవరన్నారు?
విఠ: ఎవరా? ఇక్కడికి సమీపంలో ఉన్న అడవిలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఒక సాధువుంటారు. వారిని సేవించి యథార్థం తెలుసుకో. "నామదేవుడా అడవిలో వున్న గుడికి వెళ్లి చూడగా ఒక మోటుమనిషి పడుకొని ఉన్నాడు. వీడెక్కడి సాధువు అని దగ్గరకు వెళ్ళి చూస్తే లింగం మీద కాళ్ళు. కంపించి "అయ్యా! దేవుడి నెత్తిన కాళ్ళేమిటి?" అన్నాడు ఆత్రంతో. "ఓహో! నామా; విఠల్ పంపాడా?" అన్నాడా మనిషి. తన సంగతి ఎట్లా తెలిసిందా అని వెఱగుపడి "అయ్యా మీరు సాధువులు గదా! లింగం మీద కాళ్ళేమిటి?" అన్నాడు మళ్ళీ. "అలాగా నాయనా! నాకు తెలియదే; కాలు ఎత్తలేకుండా వున్నాను కాస్త అవతల పెట్టవయ్యా అంటే సరేనని అటు పెడితే అటులింగం, ఇటు పెడితే ఇటు లింగం తన పైన పెట్టుకుంటే తానూ లింగం (అంటే ఆయన పాదస్పర్శవల్లనే జ్ఞానోదయమైన దన్నమాట). విభ్రాంతితో నిలిచాడు నామదేవుడు. 'ఆ తెలిసిందా ఇప్పుడు' అన్నాడు సాధువు. 'తెలిసింది స్వామి!' అంటూ జ్ఞానేశ్వరుల శిష్యుడైనా ఆ విఠోబా కేశవుకు నమస్కరించి ఇంటికివెళ్లి గదిలో కూర్చుని ధ్యానమగ్నుడై విఠోభావద్దకు వెళ్ళటం మానాడు నామదేవ్.
"కొన్నాళ్లకు విఠల్ పరిగెత్తుకొని వచ్చి 'నామా, నామా నీవు రావటం లేదేమి అంటూ డగ్గుత్తికతో అడిగాడట. 'ప్రభు నీవు లేని చోటు ఏది? నిన్ను సదా ఇక్కడే చూస్తున్నాను. నీవే నేను, నేనే నీవుగా వున్నాను. అందువల్ల రాలేదని' అన్నాడట నామ. ' ఆ, సరి, మంచిది ' అని స్వామి అంతర్ధానమయ్యారు" అని చెప్పి కథ ముగింపుతో కాళ్ళు ముడుపు విప్పారు భగవాన్.
T.Me/BhagavanRaman
Iron Band T-Shirt.com
ReplyDeleteIron band titanium network surf freely T-Shirt.com. titanium mokume gane #TitaniumArt | #TitaniumArts.com. #TitaniumArt mens titanium necklace | titanium scissors #TitaniumArtTanks.com. titanium trim as seen on tv
ev941 solovair zapatos,solovairsouthafrica,moonbootsuisse,osiris south africa,alo yoga hungary,russell and bromley boots,alo yoga pants sale,autryshoes,dope kurtka narciarska fj968
ReplyDelete