రమణాశ్రమ లేఖలు 68. సాధన సాక్షాత్కారం 23.6.46

రమణాశ్రమ లేఖలు 68. సాధన సాక్షాత్కారం 23.6.46
https://bhagavanraman.blogspot.com/2019/07/68-23646.html
మొన్న రాత్రి పట్నంనుంచి ఒక విద్యాధికులు వచ్చి మధ్యాహ్నం మూడుగంటలకు శ్రీవారి సన్నిధిలో ఇట్లా ప్రశ్నించారు. "భగవాన్ ఎప్పుడైనా సాధన చేసిన కాలం వున్నదా?" అని. "సాధనా? దేనికి సాధన?  ఏమున్నది సాధన చేయటానికి? ఇట్లా కూర్చోటమే సాధన. యెప్పుడూ ఇట్లాగే కూర్చుండేవాణ్ణి.  అప్పుడు కళ్ళు మూసుకునేవాణ్ని. ఇప్పుడు తెరుస్తున్నాను. అంతే భేదం. ఇప్పుడున్నది అప్పుడు ఉంది. అప్పుడున్నది  ఇప్పుడున్నది. 'నేను' తప్ప వేరొకటి ఉంటేగదా సాధన" అన్నారు భగవాన్. 
https://www.facebook.com/359807631501891/posts/477173283098658/?app=fbl
       నిత్యుడైన తన్ను  చూడక అనిత్యమగు శరీరాదులను గాంచి భ్రమించువానికి  ఆ భ్రమ వీడుటకు సాధన అవసరం గానీ తన్ను  గన్నవానికి తన కన్యమైనదేది కానరాదు. మరి సాధన దేనికొరకు. 
       https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
      "గురువు లేనిదే జ్ఞానం కలుగదని అనేక గ్రంథాల్లో చెప్పి ఉందే ఎందువల్ల" అన్నారొకరు. "అవును, మనోవ్యాపారం వల్ల శరీరాదులు తానని  భ్రమించే వారికి ఆ భ్రమ పోగొట్టే నిమిత్తం గురువు సాధన అవసరమే" నన్నారు భగవాన్. " ఉపాసనాపరులకు సాధనవల్ల ఇష్ట దేవత సాక్షాత్కారం మొదలైనవి చెపుతారే వాని భావమేమిటి" అన్నారింకొకరు. "ఎప్పుడూ ఉండేదేదో అదే సాక్షాత్కారం. ఎప్పడూ సాక్షాత్తుగానే ఉన్నాడు గదా? ఇక కారం ఏమిటి?  కారణమైనదే కారం. సత్యమైనదీ, నిత్యమైనదీ, అన్నిటికి కారణమైనదీ  యేదో అది తానేనని తెలుసుకొనుటే సాక్షాత్కారం. సాక్షాత్తయిన తాను. తననుండి పుట్టిన సంకల్పంతో రూపాన్ని కల్పించి  ధ్యానిస్తే, ఎక్కడి నుంచో దేవుడు దిగివచ్చి సాక్షాత్కారం చేస్తాడట. సాక్షాత్తుగా ఎప్పుడూ ఎక్కడా ఉండే తన్ను  విడిచేదీ, ఏదో దేవతాసాక్షాత్కారం ఎక్కడినుంచో అవుతుందని సాధన చేసేది. ఇట్టే పైనుంచి దిగి అట్టే మాయమోతాడుట దేవుడు. ఎప్పుడూ ఉండే తన్ను విడిచి ఈ క్షణిక దృశ్యాన్నికై ఎంతో ప్రయత్నం చేసేదీ, వరాలు పొందేదీ, ఇంకా ఇట్లాగే మనోవ్యాపారం పెంచుకునేది!  పలక్కుండా తానున్నట్లుంటే యే బాధా లేదు" అన్నారు భగవాన్.

         సాక్షాత్కారమంటే భావనాతీత సద్భావ సుస్థితియని భగవాన్ ఇంత స్పష్టంగా బోధిస్తున్నా, మనకు గ్రహణశక్తి లేకున్నదే అన్న విచారం కలిగింది నాకు. ఇంతలోనే "ఆ భావనాతీత సద్భానస్థితి భగవానులుకంటే సహజమైందిగానీ, మాబోంట్లకు సాధన లేనిదే సాధ్యమవుతుందా?" అన్నారొకరు. "ఔనండీ,  అవును సాధన అవసరమే. అయితే దేనికి సాధన? తాను ఎప్పుడూ, ఎక్కడా వున్నాడు. తానకై ప్రయత్నించి ఎక్కడి నుంచో తెచ్చుకోవలసిన పనిలేదు.తాను తానుగా నిలుచుటకు అడ్డువచ్చే శరీరాదుల భ్రాంతులను పోగొట్టే  నిమిత్తమే సాధన. సత్యమైన తన్ను చూడక తననే చూడబడు  అసత్యమైన శరీరాది ప్రపంచమే సత్యమని తలచటం వల్ల భ్రాంతి కలుగుతుంది. ఈ భ్రాంతి పొగొట్టే నిమిత్తమే సాధన. అంతేగాని తన్నుదాను పొందుటకు సాధనెందుకు?  తన్నుగన్నవానికి తనకన్న అన్యమేది కానరాదు" అన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ