రమణాశ్రమ లేఖలు 67 అర్పణ 22.6.46

రమణాశ్రమ లేఖలు 67 అర్పణ 22.6.46
https://bhagavanraman.blogspot.com/2019/07/67-22646.html
   చాలాకాలం నుంచి వస్తూ పోతూ ఉండే భక్తులొకరు వారంరోజుల క్రితం 'తిరువాయ్మొయి'  అనే ద్రావిడ ప్రబంధం చేతపట్టుకుని భగవాన్ తో వైష్ణవ సంప్రదాయాన్ని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. వారీ మధ్య సమాశ్రయణం (చక్రాంకితాలు)పొందారట. ఆ సంగతి వారు చెప్పగా విని తమ పూర్వ చరిత్ర ఇలా సెలవిచ్చారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
    "నేను కొండ మీద ఉండగా కొందరు వైష్ణవులు వస్తూండేవారు. వైష్ణవులలో వడగలై, తెంగలై  అనే రెండు సాంప్రదాయాల వారున్నారు కదా? ే సాంప్రదాయం వారు వస్తే ఆ సాంప్రదాయానుసారం మాట్లాడేవాణ్ణి, మనదేం పోయిందని.  అది చూచి  ఈ స్వామి మన పక్షమేనని సమాశ్రయణం పొందమంటే మాత్రం ఒప్పుకోలేదు.  చక్రాంకితులుంటేగాని వైకుంఠానికి రానీయరని వారి తలపు. 'ఈ శరీరంతో వైకుంఠానికి పోయినా వారెవరన్నా వుంటే చూపండీ?' అనేవాణ్ణి. వారి సాంప్రదాయంలో సాయుజ్యం ఒప్పరు. వైకుంఠంలో శ్రీమహావిష్ణువు ఉంటాడట. ఆయన చుట్టూ ఈ ముక్త పురుషులంతా కూర్చుని సేవిస్తారట. అంతా ఎట్లా పడతారో? కాళ్లకు కాళ్లు,  చేతులకు చేతులు రాచుకుంటూ కూర్చుంటారు కాబోలు. ఏమో అది వారికే తెలియాలి. అదే కాదు ఆ సమాశ్రయణం పొందేటప్పుడు సర్వస్వం గురువుకు అర్పణ చేస్తున్నాననే మంత్రం ఉన్నదట. ఆ మంత్రం చదివి గురువుకు దక్షిణ యిస్తే సరి. అర్పణ అయిపోతుంది. తరువాత ఏమి చేసినా ఫరవాలేదు. వైకుంఠంలో సీటు రిజర్వౌతుంది. ఇంకేం కావాలి. ఇదీ  అందులో కొందరి తలపు. 
https://www.facebook.com/359807631501891/posts/477737266375593/?app=fbl
     "అర్పణ అంటే అంత తేలికగా భావించుట వట్టి భ్రమ. *అర్పణ అంటే  మనస్సణ్ణిగి ఒకే వస్తువు కావాలి. అంటే వాసనాశూన్యం కావాలన్నమాట*. అలా కావటానికి స్వప్రయత్నం, ఈశ్వరాలంబన ఉంటేగాని కుదరదు. *ఈశ్వరశక్తి తానుగా పట్టుకుని లాక్కోవాలి లోపలకు. అప్పుడుగాని సర్వస్వము అర్పించలేము*.  మనం అర్పించుటేమి?  తానే అర్పణ అవుతుంది. *ఈ పట్టు చిక్కేంతవరకు అల్లాడుతూ ప్రయత్నించవలసిందే*.  *యత్నించగా యత్నించగా ఎప్పుడోగానీ ఆ పట్టుచిక్కదు*. చిక్కితే మరి తిరుగులేదు. అంతేగాని అర్పణ అర్పణ అని నోటితో చెపితే యేం లాభం?  *దక్షిణ అర్పించుటే తప్ప మనస్సు ఏమయింది?  ఈ తిరువాయి మొళిలోనే  కొందరు భక్తులు ఆత్మానుభూతినంది అద్యైత పరంగా పాడిన పాటలున్నవి. అలా పాడినవారిలో నమ్మాళ్వారున్నూ ఒకరు. వారు అద్వైతానుభూతి నందిన తనయను గుఱించి ఒక తల్లి విష్ణు పరమైన నిందాస్తుతి చేసినట్లు పాడి వున్నారు. ఆ పాటల సారాంశం ఏమంటే!  *శివుడు నేను, విష్ణువు నేను, బ్రహ్మ నేను, ఇంద్రుడు నేను, సూర్యడు నేను, పంచభూతములూ నేను, అంతా నేను అంటుంది బిడ్డ. ఆ విష్ణువే దీని నెత్తికెక్కి ఇట్లా పలికిస్తున్నాడు. కాకుంటే దానికీ గోల లేదు. ఆ విష్ణువే దీనినీ విధంగా చేశాడు*' అనే భావం" అంటూ ఆ పాటలూ చదివించి అర్థం చెప్పారు భగవాన్.

  ఆ తరువాత విశిష్టాద్యైతాన్ని గురించి ఇలా చెప్పారు.   "కొందరు భక్తులు అద్యైతపరంగా పాడితే వ్యాఖ్యాతలు  విశిష్టాద్యైతపరంగా తిప్పి తిప్పి అర్థాలు వ్రాశారు. అంతేగాని వేరేమీ లేదు. పెద్దలందరి  అభిప్రాయం ఒక్కటే. *అసలు విశిష్టాద్యైతమంటే ఏమిటి? అన్నిటికీ విశిష్టమైనది శ్రేష్టమైనది ఏదో అదే విష్ణువు. అదే ఈశ్వరుడు, సదా శివుడు, బ్రహ్మ అన్నీను. ఉండే వస్తువు ఒక్కటే*. దానికే నామరూపాదులు కల్పించి కొందరు వైష్ణవులు, సాలోక్య, సామీప్య, సారూప్యాలే తప్ప సాయుజ్యం ఒప్పుకోరు. *అర్పణ, అర్పణ  అంటారు. "నేను" అనేది ఒకటి ఉంటే గదా అర్పించడం?  తానెవరో తెలుసుకుంటేగానీ సర్వస్వార్పణ  జరగదు*. అది  తెలుసుకుంటే ఉండేది ఒకే వస్తువు. 'నేను' అనే మనస్సు తానుగా అణుగుతుంది. అదే సరియైయన అర్పణ"  అన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ