రమణాశ్రమ లేఖలు 66 విందులు వినోదాలు 21.8.46

రమణాశ్రమ లేఖలు 66 విందులు వినోదాలు 21.8.46
https://bhagavanraman.blogspot.com/2019/07/66-21846.html
  నిన్న మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా వెళ్లాను హాలుకి. మూడయింది అనుకుంటా!  భక్తుల అడుగుతుంటే తమ గిరి జీవితంలో సంగతులేవేవో చెపుతున్నారు భగవాన్. విరూపాక్షగుహలో ఉండగా తమ ఆహార నిమిత్తం, మొదట మట్టిపాత్ర,  వెనుక అల్యూమినియం పాత్ర, ఆ వెనుక ఇత్తడి, అవతల టిఫిన్ కారియర్. ఇట్లా సామాను ఒక్కొక్కటి వచ్చిందని; భక్తులు అప్పుడప్పుడు ఎంత చెప్పినా వినక చల్లగా వంట సాగించారని చెప్పి, చిరునవ్వుతో "ఒక సమయంలో రంగస్వామయ్యంగారు గంభీరం శేషయ్య,  ఒక కోమటి, ఒక రెడ్డి ఉన్నారు. విరూపాక్షగుహలో ఉండగానే, ఒకరోజు వంట చేయాలని సరదాగా ప్రారంభించారు. అందరికీ జందెం వున్నది. రెడ్డికెందుకు లేకపోవాలని వారికొక జందెం తెచ్చి వేశారు. అందరికీ అదొక వినోదంగా వున్నది.అలా వినోదంతో ఆ విందు జరిగింది"  అన్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/478320969650556/?app=fbl
       "అక్కడ ఉండగానే కదూ అమ్మ వచ్చింది" అన్నారు రాజగోపాల్ అయ్యరు.  "అవును ఆమె వచ్చి వంట చేస్తానంది. ప్రక్కనున్న చిన్న గుహలో చేసుకోమన్నాము. సరే అని ప్రారంభించి 'అరే  వెంకట్రామా నేను వండుతా గదా ఈ రోజు నీవు ఎవరి అన్నం తినకూడదు సుమా!' అన్నది.  సరేనని ఆమెనటు పోనిచ్చి యధాప్రకారం అందరి అన్నం తిన్నాను. ఇక్కడికి అక్కడికి కొంచెం దూరం కదా ! ఆమెకేం తెలుస్తుంది. ఆమె వండిన తరువాత  అదీ తిన్నాను. నిజంగా నేను వేరే యేమీ తినలేదనుకుందామె. అని చెప్పి మా బంధువులలో ఒకతాత ఉన్నారు. ఆయన అందర్నీ తిట్టేవాడు. అయితే అందరూ ఆయన తిట్లు కావాలనే ఉబలాటపడి పిలిచేవాళ్ళు. అంటే కపటం లేని మనిషి అన్నమాట. నేను విరూపాక్షగుహలో వుండగా ఒకసారి వచ్చి "ఏమిరా వెంకట్రామా! నీవేదో పెద్ద స్వామివయినావుట, నీకేమన్నా కొమ్ము మొలిచిందా?" అన్నారు తమాషాగా. ఇదంతా అమ్మ కాశీకి వెళ్ళిన సమయంలో జరిగిందే" నన్నారు భగవాన్. శ్రీవారు అభినయించి గొంతు మార్చి చెపుతూ వుంటే చూడాలా తమాషా.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5

T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ