రమణాశ్రమ లేఖలు 65 నరకుడు - దీపావళి 20.8.46

రమణాశ్రమ లేఖలు 65 నరకుడు - దీపావళి 20.8.46
https://bhagavanraman.blogspot.com/2019/07/65-20846.html
  ఈమధ్య రామచంద్ర అయ్యరు మద్రాసు నుంచి వచ్చారు. ఒకరోజున పాత నోటుబుక్ ఒకటి దగ్గర పెట్టుకుని తారీఖులు, నెంబర్లు, సరిచూస్తూ కూర్చున్నారు. హాల్లో, భగవాన్ చూచి "అదేం పుస్తకమోయ్" అన్నారు. "భగవాన్ పూర్వం వ్రాసిన పాత నోటుబుక్ ఇది. దీనిలో నెంబర్లు, తారీఖులు చూచి అచ్చు బుక్కులో చేరుస్తున్నాను" అన్నారు వారు."ఇట్లా తె" మ్మని,  అది తీసుకుని పుటలు తిప్పి చూచి, "దీనిలో దీపావళి పద్యాలున్నవి. మీరు విన్నారా అవి?" అన్నారు భగవాన్ నన్నుద్దేశించి. 
https://www.facebook.com/359807631501891/posts/478978282918158/?app=fbl
 వినలేదంటే, చదివి ఇట్లా అర్థం చెప్పారు. "*శరీరం నేననే అభిమానమున్న వాడే నరకుడు. ఆ అభిమానమే నరకము.ఆ అభిమాన మున్నవాడు  మహారాజాధిరాజైనా వాని  జీవితం నరకమే. ఆ అభిమానం నిర్మూలించి, తాను తానుగా ప్రకాశించుటే దీపావళి*. ఇదే ఆ పద్యాల భావం."  "నూల్ తీరట్టులో ఇవన్నీ ఉన్నావా?" అన్నాను నేను. (భగవాన్ అరవంలో వ్రాసిన పద్యాలు, పాటలు, వచనం అన్నీ కలిపి ఒకే పుస్తకంగా అచ్చువేశారు. దానికి 'నూల్ తిర'ట్టని పేరు) "ఇవి, చాటువులుగా అప్పుడప్పుడు చెప్పాను. ఇవన్నీ దాన్లో యెందుకు?" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
   ప్రథమ ముద్రణానంతరం పై విషయం భగవాన్ సన్నిధిలో చదివితే విని "ఈ పద్యాలెందుకు వ్రాశానో తెలుసునా?"  అన్నారు భగవాన్. "తెలియద" న్నాను. "అలాగా! ఒక దీపావళికి మురగనార్ 'దీపావళిని గురించి భగవానేదైనా వ్రాయ' లన్నారు. "మీరు వ్రాయరాదూ? నేనెందుకు వ్రాసేది?"  అన్నాను. 'భగవాన్ వ్రాస్తే, నేనూ వ్రాస్తా' నన్నారు. "సరేనని ఆ పద్యాలు వ్రాశాను.కారణం లేకుండా ఏదీ వ్రాయలేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ వున్నది" అని ఆ పద్యాలు చూపారు భగవాన్. తాత్పర్యంతో సహా దిగువున వ్రాస్తున్నాను. 

వృత్తం: నరకుడల్ నానా నరగులహు ఆళుం
నరకనె గెన్ఱు వుశా వుయ్ జ్ఞానత్తిహిరియాల్ 
నరకనై   క్కొండ్రవన్ నారణా నన్ఱే
నరక చతుర్దశి నద్దిన మామే.

*తా౹౹ *నరకమగు శరీరము నే ననువాడు నరకమునకు రాజు. నరకుడెవడని విచారించి జ్ఞానదృష్టిచే నరకుని వధించువాడే నారాయణుడు. నరక చతుర్దశియను సుదిన మదియే*.

వెణ్పా: నరక వురువా నడలై వుడల
            గిరికమహమేనవే కెట్ట - నరకనా
            మాహ వియైనాడి మాయ్ త్తుత్తానా యొళిర్ దల్
            దీపావళి యాం తెళి. 

తా: *నరకసదృశ శరీర గృహము నేనను నభిమానమే నరకుడు. ఆ అభిమానమును నిర్మూలించి తాను తానుగా ప్రకాశించుటే దీపావళి*.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ