రమణాశ్రమ లేఖలు 64 ఆత్మ ప్రదక్షిణం 19.8. 46

రమణాశ్రమ లేఖలు 64 ఆత్మ ప్రదక్షిణం 19.8. 46
https://bhagavanraman.blogspot.com/2019/07/64-198-46.html
  గడిచిన మే నెలలో ఒకనాటి ఉదయాన, విరూపాక్ష గుహలో ఉండగా భగవానుకు  బిక్ష తెచ్చి యిస్తూ వుండే  సుందరేశయ్యర్ వచ్చి నమస్కరించి లేవగానే; "ఏమి రాత్రి గిరిప్రదక్షణం వెళ్ళారా? లేదా ?" అన్నారు భగవాన్. "లేదు" అన్నారా భక్తులు. భగవాన్ నన్నుద్దేశించి; "ఇదిగో రాత్రి ఇక్కడివారంతా వెన్నెలలో గిరి ప్రదక్షిణానికి వెడుతుంటే వీరున్నూ పోవాలని బయలుదేరారు.  కానీ చేతకాదని తోచిందట. అంతా నాతో చెప్పి వెడుతుంటే వీరు గబ గబా నన్ను చుట్టి వచ్చారు. "ఇదేమయ్యా  అంటే గిరి చుట్టివచ్చుటకు చేతకానట్లున్నది  అందువల్ల  భగవానునే చుట్టి వచ్చాను" అన్నారు. నిన్ను నీవే చుట్టకోవయ్యా ఆత్మప్రదక్షిణ మౌతుందని చెప్పాను"  అంటూ ఒకటే నవ్వు. 
https://www.facebook.com/359807631501891/posts/479570176192302/?app=fbl
    "వినాయకుడు చేసినట్లే చేసారన్నమాట!" అన్నారొక భక్తులు. "ఆ, అదే, అదే" నన్నారు భగవాన్. "ఆ కథ యేమీ?" అన్నారొక  భక్తులు. "అదా! పరమేశ్వరుడు ఒకానొక సమయంలో; తానే గొప్ప వివేకినన్న  అహంభావ మంకురించిన సుబ్రహ్మణ్యుని ప్రబోధింపదలచి చేత పండొకటి* పట్టుకొని పార్వతి సహితంగా కైలాస శిఖరం మీద సుఖాసీనుడైవున్నాడు.  అది చూచి గణపతి, సుబ్రహ్మణ్యులిద్దరు ఆ అపూర్వఫలం నాకంటే నాకని వంతులు పడి తండ్రి నడిగారు. అప్పుడు యీశ్వరు యుక్తిగా మీరిద్దరూ భూప్రదక్షిణం చేసి ఎవరు ముందొస్తేవారి కిస్తా'నన్నాడు. కుమారస్వామి వెంటనే మయూర వాహనారూఢుడై తానే ముందు రాగలనన్న గర్వంతో బయలుదేరి వినాయకుడింకా రాలేదు కదా అని వెనక చూచూకుంటూ  గబగబా వెళ్ళాడు. గణపతికి ఇంత బొజ్జ, తాను ఏం చేస్తాడు?  వాహనమా? ఎలుకాయె, ఇది పని కాదని పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై వుండగా చుట్టూ తిరిగి నమస్కరించి నేనే ముందు వచ్చాను, పండీయంన్నాడు. భూప్రదక్షిణ చేసివచ్చావా ?  అంటే లోకాలన్నీ మీలోనివే గదా! మిమ్ము ప్రదక్షిణిస్తే భూప్రదక్షణం చేసినట్లే నన్నాడు. అతని సమయజ్ఞతకు మెచ్చి పరమేశ్వరుడు పండిస్తే తింటూ కూర్చున్నాడు గణపతి. 
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
    "కుమారస్వామి తానే ముందు పోగలన్న గర్వంతో  భూప్రదక్షిణం ముగించి వచ్చేసరికి పార్వతీపరమేశ్వరుల కెదురుగా పండు తింటూ కూర్చున్నాడు గణపతి. 'ఫల మి' మ్మని పరమేశ్వరు నడిగితే 'అదిగో నీ అన్న తింటున్నా'డన్నా డీశ్వరుడు. అదేమి  న్యాయమని అప్ప నడిగితే జరిగిన సమాచారం విశదపరిచా డీశ్వరుడు. సుబ్రహ్మణ్యునకప్పుడు అవగతమై తానే గొప్ప వివేకినని వున్న అహంభావం అంతరించి నమ్రుడై వంగి పితురలకు నమస్కరించి క్షమాపణ వేడుకున్నాడు. ఇదే ఆ కథ. భావ మేమంటే సుడిగాలివలె త్రిప్పే అహంభావము నశించి ఆత్మలో లీనం కావాలన్న మాట. అదే ఆత్మప్రదక్షిణం" అన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ