రమణాశ్రమ లేఖలు 62 ఏకమక్షరం 18.8.46

రమణాశ్రమ లేఖలు 62 ఏకమక్షరం 18.8.46
https://bhagavanraman.blogspot.com/2019/07/62-18846.html
    మొన్న ఒకనాటి సాయంత్రం బొంబాయి నుండి వచ్చిన కొందరు గుజరాతీయులు ఆశ్రమంలో పుస్తకాలు భగవాన్ ఫోటోలు కొని  శ్రీవారికి  చూపించి ఆ పుస్తకాల మీద పేరు వ్రాయమని కోరారు."ఏం పేరు వ్రాసేది" అన్నారు భగవాన్. "తమ పేరే" అన్నారు వారు. "నాకు పేరేమున్నది?" అన్నారు భగవాన్. "రమణమహర్షి అనేగదా తమ పే"రని వారంటే, "అది యెవరో అన్నారు.  అసలు; నాకు పేరేది? ఊరేది? ఏదైనా ఉంటేగదా వ్రాసేందుకు" అన్నారు భగవాన్ మందహాసంతో. పాపమా గుజరాతీయులు పలక్కుండా వెళ్లిపోయారు.
https://www.facebook.com/359807631501891/posts/481287276020592/?app=fbl
     1945 జనవరి లో బ్యాంకింగును గూర్చి నీవు వ్రాసిన పుస్తకం అచ్చయి  రాగానే భగవాన్ చేత "శ్రీ" అని గాని "ఓం" అని గాని ఒక్క అక్షరం వ్రాయించి పంపమని ఇక్కడికొక ప్రతి పంపితే భగవాన్ సుతారం ఒప్పుకోక పుస్తకం తిప్పి పంపివేసి;  పూర్వం సోమసుందరస్వామి అనేవారు ఇట్లాగే అడిగితే అరవంలో వ్రాసివుంచిన చిన్న గీతానికి అనువాదంగా ద్విపద ఒకటి  వ్రాసి నాకిచ్చారు. శ్రీవారి అనుమతి మీద అది నీకు పంపితే అమోఘమైన ఉపదేశంగా గ్రహించి సంతసించావుగదా!  ఆ వెనుక అదే భావం శ్రీవారిట్లా మార్చి వ్రాశారు. "ఏక మక్షరము, తా హృదయ మందెప్పుడు  ఏకమై వెలుగునే ఎటు వ్రాయగలము".  ఆ వెనుక మురగనారు 
ప్రార్ధనానుసారం దాన్నే శ్లోకంగా వ్రాశారు భగవాన్. "ఏకమక్షరం హృది నిరంతరం భాసతే  స్వయం లిఖ్యతే కథం" అని ఈ గుజరాతీయులు గోడు చూస్తే నాకది జ్ఞాపకం వచ్చింది. 

          పది నెలల క్రితం విజయనగరం నుంచి మహారాజా కళాశాలలో తెనుగు పండితులు పంతులు లక్ష్మీనారాయణశాస్త్రి అనే వారు వచ్చారిక్కడికి. వారు ఆశుకవితా నైపుణ్యముచే  భగవానులను స్తోత్రం చేసి, "ఏదైనా జ్ఞాపకార్థం ఒకటి దయచేసి శ్రీవారీ దీనుని  అనుగ్రహించాల"ని ప్రార్థించారు.  "ఏమిచ్చేది" అన్నారు భగవాన్. "ఏదైనా సరే ఉపదేశపూర్వకంగా అక్షర మొక్కటి దయచేయా" లన్నారు  వారు.  భగవాన్ చిరునవ్వుతో "అక్షరమైన దాన్ని ఎట్లా "యిచ్చేదీ?" అంటూ నావంఖ చూచారు. "ఏక మక్షరం అన్నది చెపితే సరిపోతుందేమో?" నన్నా  నేను. "ఏమమ్మా అది?" అన్నారు శాస్త్రిగారు. ముందు శ్లోకం చదివాను. "ద్విపద ఏది?" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
     ద్వి౹౹  ఏకమై వెలుగునే హృదయ మం దెప్పడు౹౹
               నేక మక్షరము  తా నెటు వ్రాయగలము ౹౹

అది చదివాను. వారు పెన్నిధి దొరికిన పేదవలే పొంగి, రెండూ  వ్రాసుకొన్నారు. భగవాన్ వీటిని రచించిన కారణం చెపితే వారు సంతసించి నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ గుజరాతీయుల సందర్భంలో "నాకు వూరేది? పేరేది?"  అని భగవాన్ అంటుంటే ఇవన్నీ జ్ఞాపకం వచ్చినవి.  ఇవేగాదు. నా చిన్నప్పుడు అమ్మ పని చేసుకుంటూ పాడే రామనామంలో ఒక చరణం కూడా జ్ఞాపకం వచ్చింది. 

    "నామరూపక్రియలు  లేని నిరామయం శ్రీ రామనామం   సోమసూర్యాగ్నులను మించిన స్వప్రకాశం రామనామం" రమణ నామం కూడా అంతే గదా!
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ