రమణాశ్రమ లేఖలు 61. అజ్ఞాత భక్తుడు 16.8.46
రమణాశ్రమ లేఖలు 61. అజ్ఞాత భక్తుడు 16.8.46
https://bhagavanraman.blogspot.com/2019/07/61-16846.html
ఆశ్రమానికి ఈ ఉదయం వచ్చిన ఉత్తరాలలో జకోస్లోవేకియానుంచి ఒక అజ్ఞాతభక్తుడు ఇంగ్లీషులో వ్రాసిన జాబు ఉన్నది. అది చూచి వాత్సల్యపూరితులై భగవాన్ ఆ జాబు సంగతి అందరికి చెప్పి హాల్లో చదివించారు. విషయసారాంశం ఏమంటే " నా శరీరం అరుణాచలమునకు బహుదూరమందున్నా అధ్యాత్మిక దృష్టిలో భగవాన్ పాదమందే వుండివున్నది. చిన్న వెంకటరమణడు తిరువణ్ణామల వచ్చి ఈ సెప్టెంబర్ ఒకటవ తేదీకి ఏబదేండ్లు నిండగలవని భక్తితో నేను తలచెదను. భగవానుని యొక్క యథార్ధమైన జన్మదిన మదియేనని నేను ఉత్సవమొనర్చుట అనుజ్ఞ వేడుచున్నాను. భగవాన్ పాదధూళిలో అపారమైన భక్తి శ్రద్ధ వినయములతో నణిగి భగవద్వాణిని నా హృదయమున నాలింప యత్నించుచు ఈ వుత్సవము చేయగలను.
https://www.facebook.com/359807631501891/posts/481848805964439/?app=fbl
అది చదివి అందరూ ఆమోదం చూపిస్తూ వుంటే భగవాన్ మందహాస ముఖారవిందులై "ఈయన ఎవరో, అతని ఊరూ, పేరూ, మనకు తెలియదు. ఎన్నడూ ఇక్కడికి వచ్చిన వాడు కాడు. ఎట్లా తెలుసుకున్నాడో నేనిక్కడికి వచ్చి ఏబదేండ్లు నిండినవని? ఎంతో భక్తితో జాబు వ్రాశాడు. మన చరిత్ర చదివి అవగతం చేసుకున్నట్లే ఉన్నది. వ్రాత చూస్తే, సర్, ఎస్. రాధాకృష్ణన్ గారి వ్యాసమునకై భక్తులు ఎదురుచూస్తూ వుంటే ఇంత వరకు రానేలేదు. వస్తే మొదట అది వేయాలని వీరి తలంపు. ఎస్. దొరసామి నడిగితే 'బాబో నావల్లనవుతుందా, మౌనంగా వుంటా' నని వూరుకున్నాడు. డి. ఎస్. శాస్త్రీ అంతే చేశాడు. తలవని తలంపుగా ఇది వచ్చింది. చూడండి చిత్రం. ఎక్కడ జాకోస్లోవేకియా, ఎక్కడి తిరువణ్ణామల? ఎప్పుడూ చూడనివాడు ఇట్లా వ్రాశాడంటే ఏమనుకోవాలి!" అని విరమించారు.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
Anta anatanaina prana sakthi
ReplyDeleteKaligivundi aathi samanya
Vyakthi vale manaku
Bodanalu nerpina
Sahaja devudu
Mana Ramana Maharshi,
Eppudu maa hrudayalalo
Vundalani sada smarami.