రమణాశ్రమ లేఖలు 98. సెల్ఫ్ (ఆత్మ) 25-2-47
రమణాశ్రమ లేఖలు 98. సెల్ఫ్ (ఆత్మ) 25-2-47
https://bhagavanraman.blogspot.com/2019/06/98-25-2-47.html
నేటి ఉదయం అం ఒక గుజరాతీ యువతి భర్త, బిడ్డలతో బొంబాయి నుండి వచ్చింది . ముఖ విలాసం చూస్తే విద్యావతి అనిపించింది . భర్త ఖద్దరు కట్టడంవల్ల కాంగ్రెస్ అభిమానిగా తోచింది గౌరవనీయమైన కుటుంబమని నడవడికలో గోచరిస్తున్నది . స్నానపానాదులు ముగించుకుని 10 గంటలకు అంతా గునగున నడిచే బిడ్డలతో గుంపుగా వచ్చి హాల్లో కూర్చున్నారు వాలకం చూస్తే ప్రశ్నించేట్టు ఉన్నదని తోచింది . పావుగంట అయిందో లేదో, ప్రశ్నలు ప్రారంభమైనవి.
https://www.facebook.com/359807631501891/posts/448455559303764/?app=fbl
" భగవాన్ ,సెల్ఫ్ ను (తనను) పొందడం ఎలా " అన్నదామె. "ఎందుకు సెల్ఫ్ పొందడం " అన్నారు భగవాన్ . 'శాంతి కొరకు' అన్నదామె. "ఆ అదీ సమాచారం. శాంతి అనేది ఒకటి ఉన్నదన్నమాట" అన్నారు భగవాన్ . "అవును ఉంది" అన్నదామె ." సరే మంచిది దాన్ని పొందాలని తెలుస్తుంది కదా? ఎలా తెలుస్తున్నది? అది ఎప్పుడైనా నీవు అనుభవించి ఉండాలి కలకండ తీపి తెలిసి ఉంటే కదా కలకండ తినాలని బుద్ధి పుట్టడం . అందువల్ల శాంతి నీకు అనుభవమైనదే. అప్పుడప్పుడు నీవు అనుభవిస్తున్నావన్నమాట. కాకుంటే శాంతి కావాలన్న కోరిక ఎందుకు కలుగుతుంది ? ఏదో శాంతి కావాలి, శాంతి కావాలని ప్రతి జీవి కోరటం కనబడుతూనే ఉంది. అందువల్ల శాంతియే స్వరూపమని, యదార్థమనీ స్థిరపడుతున్నది. ఆ ఆత్మనే 'ఆత్మ' అను 'పరమాత్మ' అను 'సెల్ఫ్' అను, ఏమన్నా అను . అదే కావాలి మనకు ఏం? అంతేనా ? అన్నారు భగవాన్ .
"అవును . అది ఏవిధంగా గా వస్తుంది " అందామె . " ఉన్నది శాంతి , ఉన్నది ఏ విధంగా వస్తుంది అంటే ఏం చెప్పగలం ఎక్కడనుంచైనా తేవలసిందైతే కదా ఆ ప్రయత్నం . తెచ్చుకున్నది మనోవ్యాపారం. దాన్నే పోగొట్టుకోవాలి" అన్నారు భగవాన్ . "ఏ విధంగా పోగొట్టుకోవాలి " అందామే . "ఏదో ఒక నియమం ఏర్పరచుకుని సాధన చేయాలి " అన్నారు భగవాన్ . "సాధనకు ఏకాంతవాసం అవసరమా ? సర్వభోగ త్యాగమే చాలా ? అందమే . "త్యాగం అంటే అంతర త్యాగం కానీ, బాహ్య త్యాగం కా"దని రెండవ ప్రశ్నకు మాత్రమే ప్రత్యుత్తరమిచ్చి మౌనం వహించారు భగవాన్ . భోజనశాలలో గంట మ్రోగింది .
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
పెద్ద కుటుంబీకురాలైన ఆమె అడిగిన మొదటి ప్రశ్నకు భగవాన్ ఏమని ప్రత్యుత్తరం ఇస్తారు ? ఆమె విద్యా వినయ సంపన్నురాలు కూడాను . గృహస్తులగు స్త్రీపురుషులకు సాధారణంగా భగవాన్ ఇలాగే బోధిస్తూ ఉంటారు . ఆ బోధలో యదార్థమే ధ్వనిస్తుంది . అంతరత్యాగమంటే సామాన్యమా? అందువల్ల త్యాగమంటే అంతరత్యాగమే కానీ బాహ్య త్యాగం కాదని సెలవిచ్చి ఊరుకున్నారు భగవాన్ . " అంతరత్యాగమంటే ఏమి" అన్న ప్రశ్న వస్తే ప్రత్యుత్తరం వచ్చేదేమో కానీ భోజనశాలలో గంట మ్రోగటం వల్ల అంతా గప్ చుప్ గా లేచి వెళ్లారు . ఏకాంత నివాసమైన నా కుటీరానికి వచ్చి చేరాను . ఎవరికి ఏది ఉచితమో (ప్రాప్తమో)వారికది ఈశ్వరుడు నిర్ణయించే ఉంచుతాడు సుమా. 'నీవెందుకు ఒంటరిగా ఉంటా 'వని భగవాన్ ఎప్పుడైనా నన్ను అడిగారా . ఇతరులతో నైనా ప్రస్తావించారా ఏదీ లేదు . "ఎందువల్ల?" అంటే నా స్థితికి ఇది సరి అన్నమాట .
T.Me/BhagavanRaman
Comments
Post a Comment