రమణాశ్రమ లేఖలు 97. పుట్టుక 24.2.47
రమణాశ్రమ లేఖలు 97. పుట్టుక 24.2.47
https://bhagavanraman.blogspot.com/2019/06/97-24247.html
నిన్ననొక భక్తురాలు "ఏకాత్మ పంచకం" తన పుస్తకంలో రాసుకున్నానని తెచ్చి శ్రీవారికి చూపింది. ఆ పుస్తకంలో భగవాన్ జన్మదినోత్సవం చేయటానికి మొదట ప్రారంభించిన భక్తులకు తాము వ్రాసి చూపిన పద్యాలు రెండు ఉండటం చూచి, ఇలా సెలవిచ్చారు భగవాన్. "విరూపాక్షగుహలో ఉండగా 1912 సంవత్సరంలో ననుకుంటాను - నా జన్మదినం వచ్చింది. దగ్గరున్న వారంతా 'భగవాన్ జయంతి కదా, ఇక్కడే వండి భోజనం చేస్తా' మని పట్టుబట్టారు. వద్దయ్యా ఈ ఉపద్రవమంటే వింటారా? 'మేం వండుకొని తింటే స్వామికేం బాధ?' అని ఎదురు తిరిగారు. సరే మీ ఇష్టమన్నాను. అప్పుడే కొన్ని పాత్రలు కొని తెచ్చారు. ఆ సామానిప్పటికీ ఉన్నది. కొంచమని ప్రారంభించిందే ఇప్పుడింత ఉపద్రవంలోకి దిగింది. ఏదైనా దానంతటది పోవాలిగాని మనం చెపితే ఆగదు. ఎంతో దూరం చెప్పిచూచాను. వినలేదు. సరే, వంటా, భోజనాలు అయినవి. ఈశ్వరస్వామి నాతో ఉండేవారప్పుడు. వారు, 'స్వామీ, నేడు తమ పుట్టినదినం గదా! మీరు రెండు పద్యాలు వ్రాస్తే, నేనూ రెండు వ్రాస్తా' నన్నారు. అప్పుడు వ్రసా నీ వేణ్పాలు రెండూనూ. భావమేమంటే:
https://www.facebook.com/359807631501891/posts/448919195924067/?app=fbl
1. "పుట్టినదినమని పండుగ చేయుటకు సంకల్పించు మీరు మీ పుట్టుకకు స్థానమేది?" యని చూడండి. జనన మరణములకతీతమైన ఆ నిత్యజీవనమందు ఎన్నడు పదము గొందుమో అదే సత్యమగు మన జన్మదినము.
2. ఏడాదికి కొకసారి వచ్చేజన్మదినమందైనా ఈ శరీరం వచ్చిందే, ఈ సంసారంలో పడితిమే అని తపింపనగునే గాని, ఉత్సాహంతో పండుగ చేసి సంతోషించటం శవమునకు అలంకరించినట్లుంటుంది. ఆత్మనెరిగి అందులో లీనమగుటే వివేకం' ఆ పాటల యొక్క భావం ఇదే.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
"మలయాళంలో ఒక జాతికి ఒక ఆచారం ఉన్నదట. ఇంట్లో బిడ్డ పుడితే ఏడ్వటం. ఎవరైనా గతిస్తే, బాజాభజంత్రీలతో ఉత్సవం చేయటమున్నూ, వాస్తవానికి తన స్వభావమైన సుఖాన్ని వదిలి ఈ జన్మ వచ్చిందే అని దుఃఖించాలిగాని ఉత్సవ మేమిటి?" "ఈశ్వరస్వామి ఏమని వ్రాశారో?" అన్నాను. "వారా? అవతార పురుషులు అదీ, ఇదీ, అని నన్ను పొగుడుతూ వ్రాశారు. అప్పుడదొక సరదా . వారొకటీ, నేనొకటిగా ఎన్నో వ్రాసేవాళ్ళం. దాచాలన్నా శ్రద్ధ ఎవరికీ లేదు. చాలా భాగం మేమిద్దరమే ఉండేవాళ్ళం. భోజన వసతులు లేవాయే. ఎవరుంటారు? ఇప్పుడిక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నవి గనుక వచ్చి కూర్చుంటున్నారు. అక్కడేముందీ? ఎవరైనా వస్తే కాస్సేపుండి వెళ్లేవారు. అంతే" అన్నారు భగవాన్.
ఆ పుట్టిన దినపు పాటలు తెనుగులో వ్రాయండని ప్రార్థిస్తే ఈ విధముగా వ్రాసియిచ్చారు భగవాన్.
(వెణ్పా)
1. పుట్టినా డెద్దయో పూనుదురే యుత్సవము
పుట్ట మన కెద్ధియను బుద్ధిగొని - పుట్టుక
గిట్టుకలే దై వెలుగు కేవల వస్తువులో
పుట్టినదే పుట్టిదినంబు.
2. పుట్టునా డైనను పుట్టుక కేడ్వక
పుట్టినా డుత్సవము బూనుట - గిట్టిన
పీనుగు నలంకరించి పెట్టుటని తన్నెఱింగి
యే నణంగటే జ్ఞానమే.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment