రమణాశ్రమ లేఖలు 93. గురు సన్నిధిలో సాధన 12.2.47

రమణాశ్రమ లేఖలు  93. గురు సన్నిధిలో  సాధన 12.2.47
https://bhagavanraman.blogspot.com/2019/06/93-12247.html
   ఈ మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్లాను. భగవాన్ సావధానులై కూర్చున్నారు .  కొందరు భక్తులేదో అడగటం భగవాన్ సమాధాన మీయటం జరుగుతున్నది . ఒకరు "స్వామీ, భగవాన్ సన్నిధిలో జపతపాదులు చేసినవారికి మంచి ఫలితం కలుగుతుందంటారు సరే, దురభ్యాసాలతో ఉన్నవారి మాటేమిటి?" అని అడిగారు. "సత్కార్యాచరణకు ఫలితం ఉన్నప్పుడు, దుష్కాకార్యాచరణకు ఫలితం ఎందుకు లేదు?  కాశీలో గోదానం చేస్తే ఎంత పుణ్యమో గోహత్య కంత పాపం చెప్పలేదా యేమి?  పవిత్ర స్థలాల్లో  గోరంత పుణ్యం చేస్తే, కొండంత  అవుతున్నప్పుడు, పాపం మాత్రం ఎందుకు కాదు? నేను చేస్తున్నాననే భావం ఉన్నంతకాలం దేనికది అనుభవించవలసిందే" నన్నారు భగవాన్. 
https://www.facebook.com/359807631501891/posts/452839302198723/?app=fbl
   "దురభ్యాసాలు, పోగొట్టుకోవాలనే ఉంటుంది. వాసనలు బలీయంగా ఉంటవి. అప్పుడేం జేయాలి?" అని మళ్ళీ ప్రశ్న. "వాటిని పోగొట్టుకునే  నిమిత్తమే పురుష ప్రయత్నం చేయాలి. సత్సాంగత్యం, సద్గోష్టి, సత్కార్యచరణ  ఇత్యాదులు అలవరచుకొని, ఆ వాసనలు పోగొట్టుకోవాలి. సాధన చేయగా చేయగా కాల పరిపక్వం వల్ల దైవమనుకూలించి,  వాసనలణగి ప్రయత్నం ఫలిస్తుంది. దాన్నే పురుషకారమంటారు. సాధన చేయకుండా దైవమనుకూలించాలంటే ఎలా?" అన్నారు భగవాన్. 
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
      మరొకరందుకొని  "స్వామీ,  లోకమంతా ఈశ్వర చిద్విలాసమే, అంతా బ్రహ్మమయమేనని అంటారు కదా? దుర్గణాలు దురభ్యాసాలు  పోగొట్టుకోవాలనటం ఎందుకు?" అన్నారు.  "ఎందుకా? చెబుతా విను, శరీరం ఉన్నది. దానికెక్కడో పుండు పుడుతుందనుకో అది శరీరంలో ఒక భాగమే గదా  అని ఊరుకుంటే బాధ కలిగిస్తుంది. సాధారణ చికిత్సకు పోదనుకో, డాక్టర్ వచ్చి, కత్తితో ఆ భాగం కోసి, చెడురక్తం తీసేవేసి. మంచి రక్తానికి రక్షణగా కట్టు కట్టటం లేదా? అలాగే ఇదీను. ఆ వ్రణం కోయకుండా  వదిలితే లోపలంతా కుళ్ళతుంది. కోసిన తరవాత కట్టు కట్టకుంటే చీము పడుతుంది. మానవుని నడవడికలోనూ అంతే. తోసివేయకుంటే అధఃపతితుడౌతాడు.  ఏ వ్యాధికి ఆ చికత్స చేయాలి" అన్నారు భగవాన్. 
           
    "అది తోసివేయటానికి సాధన చేయాలని సెలవిస్తారు. మనస్సు జడమైనందున ఏమి చేయలేదు. చైతన్యం అచలం కదా? తానేమీ చేయదు. మరి సాధన చేయడం ఎలా?" అన్నారు వారు. "ఓహో, ఇప్పుడు నీవెలా మాట్లాడుతున్నావు?"  అన్నారు భగవాన్.
        
  " అది తెలియకనే తమరిని ప్రార్థిస్తున్నాను. స్వామీ!" అన్నారు వారు. "మంచిదే వినండి. అచలమైన చైతన్యము యొక్క సానిధ్యబలం వల్ల జడమైన మనస్సు సర్వం నిర్వహిస్తుంది .  అయితే, ఆ చైతన్య సహాయం లేనిది జడమైన తానేమి చేయలేదు. చైతన్యమో,  అచలమైనది కనుక ఈ మనస్సు లేనిది ఏమి చేయదు. అవినాభావ సంబంధమన్న మాట. అందువల్లనే, పెద్దలందరూ అనేక రీతుల చర్చించి మనస్సు* 'చిజ్జడాత్మకం'  అన్నారు. చిత్తు, జడముల కూడికయే కార్యకారి అని చెప్పాలి" అన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman
   ఈ చిజ్జడ గ్రంధిని గూర్చి భగవాన్ ఉన్నది నలుబదిలో ఎంత చక్కగా వ్రాశారో చూడు.
   
   24. జడ శరీరము నేను అనదు. సత్తైన  చిత్తు జనించదు.
          నడు మన దేహ పరి మాణము గనేనొకటి పుట్టును.
         ఇది చిజ్జడ గ్రంధి, బంధము, జీవుడు, సూక్ష్మశరీరము,
అహం కారము, సంసారము, మనస్సు  మొదలుగ  దెలియుము.

(* 20 చిచ్చైతకలనా బంధస్తన్ముక్తి ర్ముక్తి రుచ్యతే. మహావాక్య రత్నమాల.)

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ