రమణాశ్రమ లేఖలు 91. మాయ 9.2.47

రమణాశ్రమ లేఖలు 91. మాయ  9.2.47
https://bhagavanraman.blogspot.com/2019/06/91-9247.html
     ఈ మధ్యాహ్నం మూడు గంటలకు నిన్న ప్రశ్నించినవారే మాయన గురించి ప్రశ్నిస్తూ, "స్వామీ మనస్సుకు ఆభాసగా తోచే గుణవికారాలన్నీ మాయన్న మాటే కదా? ఆ వికారాలన్నీ తోసివేస్తే మాయ లేకుండా పోతుందా?" అన్నారు. "తాను వేరు, ఈశ్వరుడు వేరు అనే భావం ఉన్నంతకాలం, మాయ, మాయగానే తోస్తుంది. ఆ మాయను త్రోసిపుచ్చి, తానే ఈశ్వరుడని తెలుసుకున్నప్పుడు, మాయ తన కన్న భిన్నం కాదని గ్రహిస్తాడు. మాయ లేకుండా ఈశ్వరుడున్నాడు గాని, ఈశ్వరుడు లేక మాయ లేదు" అన్నారు భగవాన్. "అంటే, అప్పుడు మాయ శుద్ధమాయగా మారుతుందన్నమాట అంతేగదా?" అన్నారా పృచ్ఛకులు. "అవును, అట్లాగే చెప్పవలసి వస్తుంది. తానొకడుంటే కదా ఈశ్వరుని  తెలుసుకోవటం? మాయ లేనిది తాను లేడు. తానెవరో తెలుసుకుంటే, మాయ దోషాలు తన కంటవు. శుద్ధమాయనుకోండి, ఏమన్నా అనుకోండి, ఉన్న సమాచారమది" అన్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/454103832072270/?app=fbl
   మరొకరందుకుని "జీవుడు,మాయా దోషాలైన, కించజ్ఞాత్వాది గుణాలు కలవాడనీ, ఈశ్వరుడు సర్వజ్ఞత్వాది గుణాలతో ఉంటాడనీ, ఆ కించజ్ఞాత్వాది గుణాలు పోగొట్టుకుంటే, జీవేశ్వరైక్యం కలుగుతుందనీ అంటారే? ఆ ఈశ్వరుడు సర్వజ్ఞాత్వాది గుణాలు మాత్రం పోవద్దా? అవి మాత్రం మాయ కాదా?" అని ప్రశ్నించారు. "అదా సందేహం? ముందు ఈ కించజ్ఞాత్వాది గుణాలను పోగొట్టుకోండి ఆ తరువాత సర్వజ్ఞత్వాది గుణాల గురించి యోచిద్దాం. మీ జీవత్వాన్ని మీరు పోగొట్టుకుంటే అంతే చాలు. ఈశ్వరుని గుఱించి, మీకేల చింత? ఆయన సంగతి ఆయనే చూచుకుంటాడు. మన పాటి శక్తి సామర్థ్యాలు ఆయనకు లేవాయేమి? ఆయనకు సర్వజ్ఞత్వాది గుణాలు ఉంటే, మనకెందుకు? పోతే మనకెందుకు? మన సంగతి మనం చూచుకుంటే అదే పదివేలు" అన్నారు భగవాన్. 
           https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
       "ఈ గుణాలు పోగొట్టుకోటానికి తగిన సాధన నెఱింగించి గురువును వెదకాలి గదా ముందు"అన్నారు వారు. "ఈ గుణాలు  పోగొట్టుకోవాలన్న తీవ్రత మనకు కలిగితే,గురువు దొరకడా యేమి? పోగొట్టుకోవాలన్న జిజ్ఞాస కలగాలి ముందు. కలిగితే, గురువే వెతుక్కుంటూ మనవద్దకు వస్తాడు . కాకుంటే ఎలాగో తన వద్దకు రప్పించుకుంటాడు. ఆ గురువు మన్నెప్పుడూ ఒక కంట కనిపెట్టే ఉంటాడు. ఈశ్వరుడే గురువును మనకు చూపుతాడు. తన బిడ్డల క్షేమం  తండ్రి కంటే విచారించేవారెవరు?  ఆయన, సదా మన చుట్టూ ఆవరించే ఉన్నాడు. పక్షి రెక్కలతో గుడ్డును పొదిగి రక్షించునట్లు రక్షిస్తాడు. అయితే మనం హృదయపూర్వకంగా నమ్మాలి" అన్నారు భగవాన్.
        
      లోగడ భయస్థురాలైన శంకరమ్మ అనే భక్తురాలొకామె, ఈలాంటి మాటలన్నీ విని,"స్వామీ,  సాధనకు గురూపదేశ అవసరంగా ఉన్నట్టున్నదే?" అని సమయం చూచి చల్లగా అడిగింది. "ఓహో, అలాగా సదా ఉపదేశం జరుగుతూనే ఉన్నది. కావలసినవారు గ్రహింపవచ్చునే" అన్నారు భగవాన్. "గ్రహించేట్టు భగవాన్ అనుగ్రహించాలని ప్రార్ధిస్తున్నా"నన్నదామె."ఉన్న అనుగ్రహం ఉండనే ఉన్నది" అన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ