రమణాశ్రమ లేఖలు. 88 నిద్ర - యథార్ధస్థితి. 4.2.47
రమణాశ్రమ లేఖలు. 88 నిద్ర - యథార్ధస్థితి. 4.2.47
https://bhagavanraman.blogspot.com/2019/06/88-4247.html
ఈ మధ్యాహ్నం ఒకరు భగవానుకొక చీటీ ఇచ్చారు. నిద్రలో ఈ లోకం ఏమవుతుందినీ, జ్ఞానులెలా ఉంటారనీ, ఆ జాబులోని విషయం. భగవాన్ ఆశ్చర్యం నటించి "ఓహో, అదా కావలసిందిప్పుడు? నీ శరీరం ఏమవుతున్నదో నీవు ఎలాగున్నావో నీకు తెలుసునా? ఈ శరీరం ఈ స్థలంలో, ఈ చాప మీద, ఇలా ఉన్నదన్న విషయం మరిచిపోయి, ఎక్కడెక్కడో తిరిగి, ఏమేమో చేస్తావు. మెలుకువ వచ్చినప్పుడు గదా ఇక్కడున్నాని తెలియటం. అప్పుడు నీవు ఉన్నావు. ఇప్పుడూ నీవు ఉన్నావు. అప్పుడు ఈ శరీరం జడంగా పడిఉన్నది. అందువల్ల ఈ శరీరం నీవుకావు. మరి నీవు దేనిని నాశ్రయించుకొని వున్నావు? ఈ రాకపోకల కాశ్రయమైనదేదో ఒకటి ఉండాలి గదా! నేను నిద్రపోవాలని పడుకుంటే, మొదట ఏమో కలలు వచ్చినవి. వెనుక సుఖంగా నిద్రపోయినాను. ఒకటీ తెలియలేదు హాయిగా ఉన్నది. అది సుషిప్తిలో నీవున్నట్లు ఒప్పుకుంటున్నావు. కానీ ఆస్థితి నాకు తెలియ లేదంటావు.
https://www.facebook.com/359807631501891/posts/456742238475096/?app=fbl
ఏది యదార్థము అది తెలియదు. ఏది ఆగంతకమో అది తెలుస్తున్నది అంటావు. యధార్థవస్తువును తెలుసుకుంటే, ఆగంతుకాలైనా ఆ అవస్తలు రానీ, పోనీ నిన్నంటవు. నీ సంగతి నీకు తెలియదుగాని లోకం ఏమవుతుంది? జ్ఞానులెట్లా ఉంటారు? అని ప్రశ్న చేస్తావు. నీవేమౌతావో ముందు తెలుసుకుంటే, లోకం సంగతి అదే తెలుస్తుంది. జ్ఞానులంటావా యథార్థస్థితిని తెలుసుకున్నట్టివారు. ఏ యవస్థలోనైనా ఒకే విధంగా ఉంటారు. ఆహార విహారాదుల్లో ఏది చేసినా ఇతరుల కొరకేగాని, వారికొరకొకటీ చేయరు. కూలికి గుండెబాదుకొని ఏడ్చినట్లే, ఏదైనా చేస్తారు జ్ఞానులని ఎన్నోసార్లు చెప్పా" నని నవ్వారు భగవాన.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
మరొకరందుకొని "స్వామీ, యధార్థస్థితిని ఎరుగవలెనంటారే? అది తెలుసుకునేందుకు ధ్యానం చేయాలని సెలవిస్తారు గదా? ధ్యానమంటే ఏమిటసలు?" అన్నారు. ధ్యానమంటేనే బ్రహ్మము. మనఃకల్పితాలైన దోషాలు తోసివేసేందుకు ఏదో ఒక నిష్ట ఏర్పరచుకుని, ధ్యానం చేయాలంటారు. అలా చేయగా, చేయగా ఆ దోషాలు పోతవి. అవి పోయిన తరువాత ఆ ధ్యానం ధ్యానమే అవుతుంది. తపస్సంటేనూ అంతే. 'ఈ మనోవాసనలన్నీ ఎలా పోతవి?' అంటే తపస్సు చేయాలంటారు. 'తపస్సుకు ఫలం ఏమిటి?' అంటే తపస్సే ఫలితం. తప్పస్సంటే స్వరూపమన్నమాట. ఏది యదార్థమో అదే స్వరూపం. అదే ఆత్మ, అదే బ్రహ్మము, అదే అన్నీను. పరిభాషలో చేయాలని చెప్పక తప్పదు. అసలు చేసేదెవరో తెలుసుకుంటే, ఏ సందేహాలు ఉండవు" అన్నారు భగవాన్.
భగవాన్ వ్రాసిన ఉపదేశసారం ద్విపదల్లోనూ, శ్లోకాల్లోనూ కడపట ఇదే భావం చెప్పారు చూడు.
అహములే నిస్వయ మనుభూత నిష్ఠ౹౹
మహదుగ్ర తపమనే మహిరమణఋషి౹౹
శ్లో౹౹ అహ మపేతకం నిజవిభానకం ||
మహ దిదం తపో రమణ వాగియం||
T.Me/BhagavanRaman
Comments
Post a Comment