రమణాశ్రమ లేఖలు 87 చైతన్య శక్తి 2.2.47
రమణాశ్రమ లేఖలు 87 చైతన్య శక్తి 2.2.47
https://bhagavanraman.blogspot.com/2019/06/87-2247.html
ఈ మధ్యాహ్నం రెండున్నరకు వెళ్లాను. అప్పటికీ ఎవరో ఇచ్చిన కాగితం చూస్తున్నారు భగవాన్. ఏం జెపుతారో అని ఎదురుచూస్తూ కూర్చున్నాను. భగవాన్ మందహాసంతో కాగితం మడుస్తూ "భగవానునకూ, మనకూ భేదం ఉందనుకుంటే ఇదంతా తోస్తుంది. లేదనుకుంటే ఏమీ తోచదు" అన్నారు చలోక్తిగ.
https://www.facebook.com/359807631501891/posts/457424621740191/?app=fbl
భగవానకూ, మనకు బేధం లేదని వాచా అనుకున్నంతనే, సరిపోతుందా? తానెవరో విచారించి తన మూలం తెలుసుకుంటే గదా, తనకూ, భగవానుకూ బేధం లేదని అనుకోవటం. భగవాన్ ఇట్లా సెలవిస్తారేమా? అని అనిపించింది. ఇట్లా మాయ గప్పుతారెందుకు స్వామీ? అని అందామనుకున్నాను ధైర్యం రాలేదు. నా యీ సంకోచం గ్రహించారో యేమో, మళ్ళీ శ్రీవారే ఇట్లా సెలవిచ్చారు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
"భగవానుకూ, మనకూ భేదం లేదని గ్రహించేందుకు, మనని కానీ ఈ అభాసగుణాలన్నీ పోగొట్టుకోవాలి ముందు. ఇవన్నీ పోతేగాని, సత్యం గోచరించదు. అన్నిటికీ మూలమైనది ఈ చైతన్యశక్తి ఉన్నది. ఆ శక్తిని పట్టుకుంటేగాని ఇవన్నీ పోవు. దాన్ని పట్టుకోవటానికి సాధనకావాలి".
ఈ మాటవినేసరికి, ధైర్యం వచ్చింది. అప్రయత్నంగా "శక్తి ఒకటి ఉన్నది గదా?" అన్నాను. "అవును, ఉన్నది. దానినే స్వస్ఫురణ అంటారు" అన్నారు భగవాన్. "భేదం లేదనుకుంటే చాలని భగవాన్ సులభంగా సెలవిస్తారేగాని, ఆ శక్తిని పట్టుకుంటేగదా, అభాస అంతా పోయేందుకు? అది చైతన్య శక్తిగానీ, స్వస్ఫురణగానీ, ఏదైతే నేమి? దాన్ని తెలుసుకోవద్దా? అదే ఎంత ప్రయత్నించినా తెలియటం లేదే?" అన్నాను.
భగవాన్ సన్నిధిలో అంతమంది ఎదుట ఇట్లా నేనెప్పుడూ అడగలేదు. ఈ దినం ప్రసంగవశాత్తు, లోపల ఉన్న ఆర్తి, తానుగా వెలికి వచ్చేసరికి, నా కళ్ళు నీళ్లతో నిండినవి. ముఖం గోడవైపుకు తిప్పుకున్నాను. భగవాన్ కళ్లున్నూ, చెమ్మగిల్లినవని ప్రక్కనున్న ఒక యిల్లాలు మెల్లగా చెప్పింది. ఎంత దయోదీనులపై, "జ్ఞాని ఎప్పుడూ ఏడ్చే వాళ్లతో ఏడుస్తాడు, నవ్వేవాళ్లతో నవ్వుతాడు, ఆడేవాళ్లతో ఆడుతాడు. పాడేవాళ్లతో, పాడుతాడు. ఏ పాటకు ఆ తాళం వేస్తాడు. ఆయనదేం పోయిందీ? వారి సన్నిధి, స్వచ్ఛమైన అద్దం వంటిది. మనం ఎట్లా ఉంటే, అట్లా ప్రతిబింబిస్తుంది. ఆయా ఫలితాలు ఆడినవారే అనుభవిస్తారు గాని అద్దాని కేమి? అధిష్టానానికేమి? వాటికొకటీ అంటదు. ఏపాట, ఏయాట శాస్త్రసమ్మతమో, లోకోపకారమో, అనుభవరూపమో ఆడేవారే చూసుకోవా" లని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు. అందుకిది దృష్టాంతంగా చూచాను.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment