రమణాశ్రమ లేఖలు. 85. ద్రవిడ శిశుః 30.1.47

రమణాశ్రమ లేఖలు. 85. ద్రవిడ శిశుః 30.1.47
https://bhagavanraman.blogspot.com/2019/06/85-30147.html
    'సౌందర్యలహరి' లో, "ద్రవిడ శిశుః" అని సంబంధులను గురించి శంకరులు పాడి ఉన్నారని, నిన్న భగవాన్ సెలవిచ్చారు గదా?  రాత్రి తెనుగు వ్యాఖ్యానంతో ఉన్న "సౌందర్యలహరి" తీసి, సంబంధులను గుఱించి, శంకరులు వ్రాసిన శ్లోకం చూచాను.
https://www.facebook.com/359807631501891/posts/459283574887629/?app=fbl
శ్లో౹౹ తవస్తన్యం మన్యే ధరణీ ధరకన్యే హృదయతః
పయః పారవారం పరివహతి సారస్వతమివ 
దయావత్యాదత్తం ద్రవిడ శిశు రాస్వాధ్య తవ యత్
కవీనాం ప్రౌఢానామజని కమనీయః కవయితా _ 75.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
     దీనికి, తెనుగు వ్యాఖ్యానంలో "ద్రవిడ శిశుః" అంటే శంకరులేనని వ్రాసి ఉన్నది. ఈ సంగతి మర్నాడు భగవానుతో మనవి చేశాను. "తెనుగు వ్యాఖ్యాతలు తప్పు వ్రాసి ఉంటారు. 'ద్రవిడ శిశుః" అంటే సంబంధాలులే గాని, శంకరులు కా' రని తమిళ సౌందర్యలహరిలో ఉన్న" దని అది తెప్పించి, సంబంధలకు, "ద్రవిడ శిశుః" అన్న బిరుదు వచ్చిన కారణం ఆ వ్యాఖ్యానంలో ఉన్నదంతా చదివి అర్థం ఇట్లా చెప్పారు భగవాన్. 

     " శ్రీయాళీ అనే పట్టణమందొక శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో శివపాదహృదయరను  పతికి, భగవతియారను సతికి, సంబంధులు పుట్టారు. తల్లిదండ్రులు వారికి 'అళాడయ పిళ్లైయార్' అని నామకరణం చేశారు. వారు మూడేండ్లవారై  వుండగా, తండ్రి వారి నెత్తుకుని స్నానార్థం తిరుత్తోణియప్పర్ కోవెల ప్రాకారంలో ఉన్న కొలనుకు వెళ్లి, ఒడ్డున దింపి, అఘమర్షణమంత్రం జపిస్తూ,  నీటిలో మునిగి స్నానం చేస్తుంటే, ఒడ్డున ఉన్న బిడ్డకు వారు కనిపించ లేదు పసికందు కదా? తండ్రిని గానక తపిస్తూ బిక్కమొగంతో దిక్కులు కలయచూచారు. తండ్రి జాడ తెలియలేదు. దుఃఖం వచ్చి, దేవాలయ విమానం మీద దృష్టి సారించి 'అమ్మ, అప్పా'అని బోరున ఏడ్చేసరికి వృషభవాహనారూఢలై పార్వతీ పరమేశ్వరులు వినువీధి నిలిచి వారికి దర్శనమిచ్చారు. శివుడు దేవితో శివజ్ఞాన సహితమైన చనుబాలతో బంగారు గిన్నెను  నింపి వానికిమ్మని ఆజ్ఞ యిస్తే, ఇచ్చిందామే. ఆ బాలుడు ఆ పాలుత్రాగి, చింతారహితుడుకాగా, వారు అదృశ్యులైనారు.

   ఆ జ్ఞానపయస్సు త్రాగి  తుష్టులైన సంబంధులు,  పెదవుల వెంట పాలు కారుతూ ఒడ్డున కూర్చున్నారు. తండ్రి స్నానం చేసి వచ్చి, బాలుని వాలకం చూచి "ఎవరు నీకు పాలిచ్చారు? త్రాగవచ్చునా? ఆ మనిషి ఎవరో చెప్పు, చెప్పకుంటే ఊరుకోను సుమా" అంటూ, కోలపుచ్చుకుని గద్దించారు. వారు వెంటనే, 'తోడయరు చెవియన్' అను పాట తో ప్రారంభించి పదిపాటలు పాడారు. ఆ మొదటి పాట తాత్పర్యం ఏమంటేే 'కుండలాలు  చెవివాడు వృషభవాహన మెక్కినవాడు, తెల్లని చంద్రుడు తలపై నున్నవాడు వల్లకాటి భస్మమును పూసినవాడు, నా హృదయమును హరించని దొంగ, వేదముల చేతబట్టిన బ్రహ్మ తపస్సు చేయగా అనుగ్రహార్ధమై  బ్రహ్మపురి పీఠాధిష్ఠితుడగు నా తండ్రి అదిగో, నాకు పాలిచ్చిన తల్లి అదిగో, అంటూ తాను కన్నారా చూచింది తమకు పాలిచ్చింది అయిన ఆ శివ స్వరూపాన్ని వర్ణిస్తూ దేవాలయం విమానంవైపు చూపారు. ఆ పాటల భావమరయగా, పాలిచ్చింది పార్వతీపరమేశ్వరులేనని తేలింది. జనం మూగారు.  నాడు మొదలు వారి కవితా స్రవంతి అనర్గళంగా ప్రవహించింది. అందుకే శంకరులు 'తవస్తన్యం మన్యే' అని పాడారు. 'ద్రవిడ శిశుః' అంటే సంబంధులకేనని ఈ వ్యాఖ్యాతలు నిర్ణయించారు. నాయన కూడా వారిని 'ద్రవిడ శిశుః అని' రమణగీతలో వ్రాశారు" అన్నారు భగవాన్. 
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ