రమణాశ్రమ లేఖలు 84 రమణుడెవరు? 29.1.47

రమణాశ్రమ లేఖలు 84 రమణుడెవరు? 29.1.47
https://bhagavanraman.blogspot.com/2019/06/84-29147.html
          ఈ నెల 7వ తేదీన మదరాసులో రమణ భక్తులు డాక్టర్ టి.యన్.కె. శ్రీవారి జయంతి ఉత్సవం చేశారు. ఆ సందర్భంలో ఒక పండితులు ఉపన్యసిస్తూ భట్టపాదులు తిరుచ్చుళిలో రమణులుగా జన్మించగలరనే విషయం ఏదో ప్రమాణంలో ఉన్నదన్నారట. కాని, ఆ ప్రమాణవచనాల కోసం ఆశ్రమవాసులు అన్వేషిస్తూ ఉంటే భగవాన్ స్వయంగా "స్కందుడు ముందు భట్టపాదులుగా, తరువాత సంబంధులుగా, మూడవ అవతారం రమణులుగా జన్మించినట్లు నాయన*  చెప్పినారు. సౌందర్యలహరిలో శ్రీ శంకరులన్న 'ద్రవిడ శిశు' అనే మాట సంబంధులను గురించినదే గదా.  అందువల్ల భట్టపాదులకు పూర్వమే సంబంధులు ఉండి ఉండాలి. భట్టపాదులు శంకరులు సమకాలికులనుట నిర్వివాదం. నాయన, బట్టపాదులకు తరువాత వారు సంబంధులని అన్నారు. ఒకదాని కొకటి పొంతన లేదు. పై ఉపన్యాసాలకు ఏ వచనాలు ప్రమాణాలో తేలలేదు" అన్నారు.
https://www.facebook.com/359807631501891/posts/459930664822920/?app=fbl
    అప్పుడు నేను, అందరినీ మరిపించే ఆ మాయానటనకూ,  ఆ మాటలకు ఆశ్చర్యం పొంది, "దానికింత మీమాంస ఎందుకు? భగవాన్నే అడగవచ్చనే, భగవానెవరో భగవానుకు తెలియదా? ఇప్పుడు చెప్పకపోయినా, భగవాన్ కొండ మీద ఉండగా, అమృతనాథ యతీంద్రులు 'రమణుడెవరు?' అని ప్రశ్నాసూచకంగా వ్రాసిన పాటకు బదులుగా భగవాన్ వ్రాసినదే ఉన్నది గదా?" అన్నాను. "అవు,నవు" నని చిరునవ్వుతో ఆమోదం చూపిస్తూ  భగవాన్ కొంచెం నిదానించి, "అమృతనాథులొక విచిత్రమైన వ్యక్తి. వారికి అన్ని విషయాల్లోనూ మిక్కిలి సరదా. కొండ మీద ఉండగానే అప్పుడప్పుడు వచ్చి నాతో కలిసి ఉంటూ ఉండేవారు. ఒక దినం నేనెక్కడికో వెళ్లాను. "రమణుడెవరు?" అనే ప్రశ్నార్ధకమైన ఒక పాట మలయాళంలో వ్రాసి పెట్టి నేను వచ్చేసరికి వారు బైటికి వెళ్లారు. ఏమిరా కాగితమని చూస్తే, ఇదీ  సమాచారం. నేనున్ను వారు వచ్చేసరికి దానికి బదులుగా మరొక పాట మలయాళంలో, దాని క్రిందనే వ్రాసి వుంచాను. స్వామికి మహత్తులు ఆరోపించటమంటే వారికి కెక్కువ ప్రీతి. నా చరిత్ర గూడా మలయాళంలో ఎన్నో మహిమలతో నింపి వ్రాశారు.  నాయన చదివించి విని 'చాలుచా"లని చింపివేశారు వేశారు. ఈ ప్రశ్నకూ అదే కారణం. 'హరియో' 'యతియో' 'వరరుచియో', 'ఈశ గురువో' ఏదో ఒక మహత్తు ఆరోపించాలని వారి కోరిక. నేనేమో జవాబు ఆ విధంగా వ్రాశాను. ఏం జేస్తారిక. పలక్కుండా ఊరుకున్నారు.  ఆ పద్యాల భావం తెలుగులో ఉన్నది కదూ?"  అన్నారు భగవాన్. 
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
  "ఉన్నది. భగవాన్ కేవల పరమాత్ములని నిర్ణయించుకోవటానికి ఆ భగవద్వాణి చాలదా మాకు?" అన్నాను. భగవాన్ చిరునవ్వుతో, మౌనం వహించారు.  ఆ ఆమళయాళానికి  అనువాదంగా రమణలీలలో ఉన్న వచనం వ్రాస్తున్నాను. 

అమృతనాథుల ప్రశ్న: 
   అరుణాచల గుహయందు కరుణకు నిధియను పేరుపడిన యీ రమణుడెవరు? వరరుచియా? యీశ గురువా? హరియా?  యతీంద్రుడా? గురుమహిమ నేఱుగ  గోరికగా నున్నది. 
  
భగవాన్ : 
హరి మొదలెల్ల జీవుల హృద్గుహలో  నెఱుకయై క్రీడించు పరమాత్మయే అరుణాచల రమణుడు. అతడు పరుడును.  జ్ఞాననేత్రమును దెఱచి  నిజము చూచిన అది నీకు బయలగును.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ