రమణాశ్రమ లేఖలు 80  విరూపాక్ష గుహవాస గాథలు 25.1.47

 రమణాశ్రమ లేఖలు 80 విరూపాక్ష గుహవాస గాథలు 25.1.47
https://bhagavanraman.blogspot.com/2019/06/80-25147.html
  భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా అక్కడి కార్యక్రమం చూస్తూ ఉండే వాసుదేవశాస్త్రిగారు మొన్న ఉదయం ఆశ్రమానికి వచ్చి భగవాన్ సన్నిధిలో కూర్చున్నారు. కుశల ప్రశ్నానంతరం తమ జయంతి జరుపుట కారంభించినది వీరేనని భగవాన్ మాతో అన్నారు. "పులి వస్తే భయపడి దాక్కున్నది వీరేనా ?" అన్నారొక భక్తులు. "అవును, వీరే. విరూపాక్షగుహలో ఉండగా, ఒక రాత్రి ప్రధమ యామంలోనే ముందు వసారాలో కూర్చున్నాం. క్రింది లోయలోకి పులి వచ్చింది. దీపం చూస్తే, ఈ పక్కకు రాదని వసారా కటకటాల కవతల లాంతరు పెట్టాం. వీరికా తగని భయం. తాము గుహలో దూరి,మమ్మల్ని గూడా రమ్మన్నారు . మేము పోలేదు . వీరు గుహలో దూరి, ఇనపకడ్డీల  తలుపు వేసి మహాయోధుడల్లే పులి గుఱించి అట్టహాసం చేస్తూ "ఇదిగో ఇలా వచ్చావంటేనా? ఏం చేస్తానో" చూడు. ఊ ఏమనుకున్నావ్. భగవానున్నారిక్కడ, జాగ్రత్త" అని గద్దించి సాగారు. ఉత్తరకుమార ప్రజ్ఞలల్లే గుహలోనే వీరి ప్రతాపం ఆ పులి కాసేపు అటూ, ఇటూ తచ్చాడి, తన త్రోవన తాను పోయింది. వెనుక వీరు సాహసించి బయటకి వచ్చారు. భలే పరాక్రమశాలి" అన్నారు భగవాన్. 
https://www.facebook.com/359807631501891/posts/464724447676875/?app=fbl
        శాస్త్రిగారందుకొని "ఇదే కాదు, మరొకసారి పగలే, గుహకు బయట ఉన్న బండ మీద స్వామీ,  నేను కూర్చున్నాం. లోయలో,ఒక పెద్దపులీ,  ఒక చిరుతపులీ తచ్చాడుతూ ఉన్నవి. స్నేహభావంతో ఉన్న వాటి చర్యలు చిరునవ్వుతో గమనిస్తున్నారు భగవాన్. నాకా, తగని భయం.  గుహకు పోదాం రమ్మంటాను. వారా చలనరహితులు. నేను మాత్రం గుహనే ఆశ్రయించాను. అవి రెండూ కాసేపు తచ్చాడి, స్వామిని చూస్తూ, ఏ భయవికారాలు లేకుండా, సాధుజంతువుల వలె, ఒకటి కొండపై భాగానికీ, ఒకటి క్రిందికీ వెళ్ళినవి. ఇక ధైర్యంగా బయటికి వచ్చి 'స్వామీ, ఆ రెండు అంత సమీపంలో తిరుగుతూ ఉంటే భయం పుట్టలేదా?" అన్నాను. శ్రీవారు చిరునవ్వుతో, 'ఎందుకురా భయం,  చూస్తూనే అనుకున్నా, ఒకటి క్రిందకూ ఒకటి పైకి పోతావని. అట్లాగే పోయినవి. మనం 'అమ్మో పులి' అని జంకితే అవిన్నీ 'అమ్మో మనిషి' అని భయపడి మ్రింగవస్తవి. మనకా భీతి లేకుంటే, వాటికి ఉండదు. సహజంగానే సంచరిస్తావన్నారు. వారెంత చెప్పినా,నాభీతి పోలే"దన్నారు.
రమణాశ్రమ లేఖలు 80 విరూపాక్ష గుహవాస గాథలు 25.1.47
https://bhagavanraman.blogspot.com/2019/06/80-25147.html
      "నాకు గుండె నిలిచిపోయినప్పుడు కౌగిలించుకుని ఏడ్చింది వీరే" నని ఆ కథ ఈ విధంగా చెప్పారు భగవాన్. "ఒకనాడు నేనూ, వాసూ, ఇతరులూ నూనే,
సీకాయ తీసుకుని స్నానార్థం విరూపాక్షగుహ నుండి పచ్చైయమ్మ  కోవెల ముందున్న కోనేటికి వెళ్లి, స్నానానంతరం కొండకు అడ్డదోవన పోతూ ఉండగా, అలసటవల్ల, తాబేలుబండవద్దకు వచ్చేసరికి చతికిలబడ్డాను. అప్పటి అనుభవమంతా నా చరిత్రలో వ్రాసే ఉన్నదిగదా?"* అన్నారు భగవాన్. శాస్త్రిగారందుకొని "అవును అంతా దూరంగా నిలచి దుఃఖిస్తుంటే నేనమాంతం కౌగిలించుకున్నాను. అప్పుడు బ్రహ్మచారినిగదా! ఆ స్వాతంత్రం నాకే. మరెవ్వరూ స్వామిని తాకేవారుకాదు. అలా పది నిమిషాలున్నారనుకుంటాను. అంతలో చైతన్యం వచ్చింది. అంతులేని సంతోషంతో గంతులేసానన్నమాట. "ఎందుకురా ఏడుపు?  పోయినాననా?   పోతే, చెప్పకుండా పోతానటరా ? "  అని ఎంతో ఓదార్చారు భగవాన్" అన్నారు.

  " హఠాత్తుగా ఎదుటనున్న  ప్రకృతి దృశ్యము అదృశ్యమై కొంత దృష్టి పథమున కడ్డుగా నొక ధవళాంబరము లాగబడినట్లుండెను. ప్రకృతి దృశ్యము అదృశ్య మగుటయు ధవళాంశుకము లాగినట్లుండుటయు క్రమక్రమముగా జరుగుచున్నందున కొంతసేపు ఆ తెర కొంత,  ప్రకృతి కొంత,  కనవచ్చుచుండెను గానీ, త్వరలోనే ప్రకృతి అంతర్హితమయ్యెను. ఈ దృశ్యమారంభము కాగానే నడుచుట మానివైచి అది తొలగగా కొంచెము నడిచితిని. రెండవ మాఱట్టిదియే మరల కానవచ్చెను. బలహీనత యెక్కువయైను. రాయి కానుకొని నిలవవలసి వచ్చెను. మూడవ మాఱిట్లే సంభవింపగా నా బండ చెంత గూర్చుంటిని.

  చుట్టునూ ఆ తెల్ల తెరయే. తల తిరుగుచుండెను. రక్త ప్రసారమును,  హృదయచలనమును నాగినవి. దేహము నల్లనైపోయెను. చావునవచ్చు నలుపే. అది యింకను ఎక్కువ కాజొచ్చెను. వాసు, నేను నిజముగా మరణించితిననియే ననుకొని యేడవ నారంభించెను.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
  నా శరీర వైవర్ణ్యము, వాసు కౌగిలింత,అతని దేహము వణుకుచుండటయూ, అందఱియేడ్పులు, వారి మాటలు స్వరమును తెలియుచుండినవి. కాలుసేతులు చల్లబడుట, హృదయచలన మాగుటయు దెలియుచుండినవి. కానీ భయము కలుగలేదు. ధ్యానధార - అహంస్పురణ - పోలేదు. శరీర స్థితికి జింతయూ  గలుగలేదు . పద్మాసనస్థుడనై యుంటిని. వెనుక ఱాయి నానుకొననుగూడా లేదు. రక్త ప్రసారము లేకున్నను ఆసనబంధము వీడలేదు. ఇట్లు పదునైదు నిమిషములు గడిచినవి. 
  
  "తటాలున శరీర మాద్యంతము శక్తి ప్రసారమయ్యెను. హృదయచలనము రక్త ప్రసరణ మతితీవ్రముగా ప్రారంభమైనవి. శరీర వైవర్ణ్యమును బోయినది ప్రతి రోమకూపమునందును విపరీతంగా చెమట క్రమ్మినది. నేనంత కన్నులు దెఱచి లేచిపోవదుము పదండి అంటిని. తర్వాత ఏ తొందరయు లేక విరూపాక్షగుహకు జేరితిమి. ఈ ఒక్కమాఱే  రక్తప్రసారము నిశ్వననము రెండునూ ఆగిపోవుట జరిగినది. కావలయునని ఈ స్థితిని నేను తెచ్చుకొనలేదు;  చనిపోయిన దేహమెట్లగునో చూతమను తలంపును లేదు. అప్పుడప్పుడు ఇట్టివి కలుగుచుండినవే. ఆ పర్యాయమది అతి తీవ్రముగా నుండెను. ఇంతియే" 
T.Me/BhagavanRaman
(దారిలో తాబేలు బండ యను గొప్ప పాషాణమున్నది. అక్కడికి వచ్చునప్పటికీ స్వామి కొక యనుభవము  కలిగెను. వారి మాటలగానే;)

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ