రమణాశ్రమ లేఖలు 78 ఆండవనే 20.12. 46
రమణాశ్రమ లేఖలు 78 ఆండవనే 20.12. 46
https://bhagavanraman.blogspot.com/2019/06/78-2012-46.html
"ఆండవనే" అన్న నామాంతరంగల రామనాథ బ్రహ్మచారి మద్రాసులో గత రాత్రి గతించారన్న వార్త, ఈ ఉదయం తొమ్మిదింటికి తంతి ద్వారా వచ్చిందని నేను హాల్లోకి వెళ్ళబోతే చెప్పారొకరు. రామనాథులు చిన్న వయస్సులోనే శ్రీవారి శిష్యకోటిలో చేరారు. భగవాన్ విరూపాక్షగుహలో ఉన్నప్పుడే వచ్చారట. అది మొదలు ఏడాదికి ఏ పదిహేనురోజులో తప్ప భగవానుని విడిచి ఉండేవారు కారు. అలాంటి భక్తుడు, ఆజన్మ బ్రహ్మచారి వైద్యానికి మద్రాసు వెళ్ళారు. పదిహేనురోజులయిందో లేదో ఈ వార్త వచ్చింది మాధవస్వామివలెనే అయిందే! అని మనస్సుకు విచారంగా ఉన్నా, అస్థిపంజరం వలె ఉన్న ఆ శరీరం అనాయసంగా ఆస్తమించినందుకు ఆనందించవలసిందే అనుంటూ నేను హాల్లో అడుగుపెట్టగానే "మన రామనాథుడు పోయాడట" అన్నారు భగవాన్. తరువాత "మాధవస్వామి పోయా"డన్నప్పుడు "ఎక్కడికి" అని నేను అన్నప్పుడు "ఎక్కడికా? అక్కడికే, శరీరం విడిచి" అన్న, భగవాన్ సమాధానం పురస్కరించుకుని ఇప్పుడు తిరిగి ఎక్కడికి అని ప్రశ్నించక, "విన్నా" నన్నాను.
https://www.facebook.com/359807631501891/posts/466490960833557/?app=fbl
మధ్యాహ్నం మూడు గంటలకు "రమణర్ అనుభూతి" అనే తమిళ్ పద్యాలు ఉమా,అలుము అనే ఇద్దరు స్త్రీలు పాడుట కారంభించిరి. భగవాన్ ఉత్సాహంతో నన్నుద్దేశించి "ఇదిగో, ఇవి రామనాథుడు వ్రాసిన పద్యాలే. వీటి తర్వాత 'తిరుచ్చుళినాధుని కండేనే' అను పల్లవితో ఒక పాట ఉన్నది. అది వారిదే. దానికొక చిత్ర కథ ఉన్నది. ఏమంటే, నేను విరూపాక్షగుహలో ఉండగా ఒక వెన్నెల రాత్రి గిరిప్రదక్షిణానికని బయలుదేరాం. అప్పుడు చిదంబరం సుబ్రహ్మణ్య అయ్యరిక్కడే ఉన్నారు. పండు వెన్నెల, అందరికీ భలే హుషారుగా ఉన్నది.
రమణాశ్రమ లేఖలు 78 ఆండవనే (తరవాత భాగం)
https://bhagavanraman.blogspot.com/2019/06/78-2012-46.html
ఒక్కొక్కరొక్కొక్క విషయం తీసుకుని ఉపన్యసించేట్లుగా ఒక సభ ఏర్పరుచుకుందామనుకున్నారు. ఆ సభకు అధిపతిగా సుబ్రహ్మణ్య అయ్యరును ఎన్నుకున్నారు. ప్రథమోపన్యాసం రామనాథునిది. విషయం ఏమంటే, హృదయ గుహలోని పరమాత్మకు, చిదంబరంలోని నటరాజమూర్తికీ, విరూపాక్షగుహలోని శ్రీరమణులకు ఓకే సాదృశ్యం చెపుతానని ప్రారంభించారు. అధ్యక్షులు అరగంట టైమిచ్చారు. ముగ్గురికీ చెప్పే సాదృశ్యాలకు అంతులేదు. ఎన్నో ఉపమానాలు. వేళయిందంటారు అధ్యక్షులు. 'అయ్యా, ఇంకొక అరగంట' అంటారు వీరు. నడుస్తూనే ఈ సభంతా. 'ఇంకా కొంచెం,ఇంకా కొంచెం' అంటూ మూడు గంటలు ఒకే ధోరణిగా ఉపన్యసించారు. కడకు, ఆ అధ్యక్షులు అదమాయించి ఆపారు. అప్పటి వారి ఉత్సాహం చూచి తీరాలి. అదంతా వ్రాస్తే పెద్ద గ్రంథం కావచ్చు. తరువాత ఆ మూడు విషయాల సారాంశం సంగ్రహించి 'తిరుచ్చుళినాధుని కండేనే' అన్న ఆ నాలుగు చరణాల పాట వ్రాశారు. ఆ పాటలో 'ఆండవనే', 'ఆండవనే' అని వ్రాయటం వల్ల ఇక్కడ వీరంతా వారిని 'ఆండవనే' అని పిలవడం ప్రారంభించారు. ఆ పాట తెనుగున అనువదించాలని ప్రణవానందులు ప్రయత్నించారు గానీ సరిగా రాలే" దన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
"వారికి 'ఆండవనే' అన్న పేరు వచ్చిన కారణం ఇదా" అని ఆ పాట చూచాను. విద్యావిషయం మాటకేంగాని, హృదయ వికాసంతో వ్రాసినందున, మనోహరంగా ఉంది. సారాంశం దిగువన వ్రాస్తున్నాను.
"నేను *తిరుచ్చుళినాధుని చూచి, తిరిగిరాలేక అక్కడనే నిలిచిపోయినాను. అతను చిదంబరంలోనాట్యమాడేవాడును, దీనుల రక్షించే అనుగ్రహం కలవాడును. మరియు ఆ తిరుచ్చుళినాథుడే 'తిరువణ్ణామల' అనే క్షేత్రంలో అనుగ్రహరూపమైన కొండమీద విరూపాక్ష మనే గుహలో కోరిచూచిన దైవమై వెలిశాడు"
https://t.me/c/1178911790/1813
"కాయాపురి అనే పట్టణంలో, కారణములనే ప్రజలతోనూ, అహంకారమనే మంత్రితోనూ జీవుడు అన్యాయ రాజ్యం చేశాడు".
కొన్నాళ్ళకా జీవుడు ఈశ్వరానుగ్రహమనే కత్తినెత్తి అహంకారామనే మంత్రిని సమూలంగా నరికి వేశాడు"
*"అట్లా నఱికి పాఱవేసిన జీవుడు, తానుగా దహరాలయమనే గుహలో తాండవించే దైవాన్ని కూడి, ఏకమై నిలిచాడు.*
"అతడే ఈ తిరుచ్చుళినాథుడు. నేనాతని చూచి తిరిగి రాలేక అక్కడే నిలిచిపోయినాను.
T.Me/BhagavanRaman
• "తిరు" "చ్చుళి" అంటే శ్రీకారమనీ, ఓంకారమనీ అంటారు. తిరుచ్చుళియను గ్రామము భగవానుని జన్మస్థానము.
Comments
Post a Comment