రమణాశ్రమ లేఖలు 77 ఆత్మాకార వృత్తి 19-12-4
రమణాశ్రమ లేఖలు 77 ఆత్మాకార వృత్తి 19-12-4 https://bhagavanraman.blogspot.com/2019/06/77-19-12-4.html
మొన్న ఆంధ్రులొకరు వచ్చి, శ్రీవారికొక జాబు వ్రాసి చేతికిచ్చారు. అందులో ఉన్న ప్రశ్న - "జ్ఞానులు సుషుప్తిలో ఆత్మాకారవృత్తితో ఉంటారని కొందరు, ఉండరని కొందరు అంటారు. తమ అభిప్రాయమేమి?" అని. భగవాన్ బోధనా సూచకస్వరంతో "జాగ్రత్తలో ఆత్మాకార వృత్తితో ఉండటం తెలుసుకుంటే, సుషిప్తిని గురించి తరువాత యోచిద్దాం. జాగ్రత్తలో ఉన్నవాడు, సుషిప్తిలో మాత్రం ఎందుకుండడు.? నీ విప్పుడు ఆత్మాకారంగా వున్నావా? బ్రహ్మాకారంగా వున్నావా? ముందది చెప్పు" అన్నారు.
https://www.facebook.com/359807631501891/posts/465916020891051/?app=fbl
"నా సంగతి కాదు స్వామీ, జ్ఞాని విషయం అడుగుతున్నా" నన్నారా పృచ్చుకులు."ఒహో, సరిసరి. ఈ అడిగే నీవెట్లాగున్నావో తెలుసుకో ముందు. జ్ఞానుల సంగతి జ్ఞానులు చూచుకుంటారు. మన సంగతి మనకు తెలియదు; జ్ఞానుల గురించియోచన! వారు ఆత్మాకారంగా ఉంటే మనకెందుకు? బ్రహ్మకారంగా ఉంటే మనకెందుకు? మన మెట్లాగున్నామో తెలుసుకుంటే వారిని గూర్చి ప్రశ్నరా" దన్నారు భగవాన్. "ఈ ప్రశ్న నాది కాదు స్వామి, నా స్నేహితులొకరు వ్రాసి పంపా" రున్నారు వారు.
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
ఔనండీ, స్నేహితులే వ్రాశారు ఏం చెప్తాం. వృత్తి అనగానే రెండు కాలేదా? ఉన్న వస్తువొక్కటే. వృత్తి జ్ఞానం లేనిదే గమనాగమనాదులు జరగటం ఎలాగన్న ప్రశ్న వస్తుంది. అందువల్లనే, అఖండాకార వృత్తనీ, ఆత్మకార వృత్తనీ, బ్రహ్మాకార వృత్తనీ ఏదో చెప్పవలసి వస్తుంది. సముద్రాకార నది అన్నట్లు. నదులు అన్నీ సముద్రంలో కలిసి రూపు లేకుండా ఏకమౌతవి గదా? ఇంకా సముద్రాకార నది అంటే ఏమని అర్థం. సముద్రుడికి ఇంత లోతు, ఇంత వెడల్పు అన్న ఆకారం ఏమున్నది? అలాగే, జ్ఞానులకూ ఆత్మాకారవృత్తీ, అఖండాకారవృత్తీ ఉన్నదని చెబుతారేగాని, వాస్తవానికి అంతా ఒకే వస్తువు. అవన్నీ అడిగేవారికి సమాధానాలేకాని , జ్ఞాని దృష్టికంతా ఒకటే" అన్నారు భగవాన్.
"బ్రహ్మవిత్, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠాదులకున్నూ సాత్విక మనస్సు ఉంటుందంటారా?" అన్నారింకొకరు. 'బ్రహ్మవిద్వరిష్ఠడన్నా బ్రహ్మవిత్తన్న, బ్రహ్మైవ' అన్నా ఒకటే. బ్రహ్మైవ అంటే బ్రహ్మమే. పైన చెప్పిన ముగ్గురికీ వ్యవహారార్ధం సాత్త్విక మనస్సు ఉంటుందని చెప్పాలేగాని వాస్తవానికి లేనేలేదు. వాసనలే మనస్సు. వాసనలు లేకుంటే మనస్సు లేదు. సత్తే ఉండేది. సత్తే బ్రహ్మం. అది తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అదే ఆత్మ. అదే తాను. ఆ తానెవరో విచారించి తెలుసుకొని, దానియందు స్థిరులైన వివేకులకే బ్రహ్మవిత్, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠ ఇత్యాది పేర్లు. వారి గమనాగమనాది చర్యలు గమనించే ఆత్మకారవృత్తితోనూ, అఖండాకారవృత్తితోనూ ఉంటారని అనవలసి వస్తుం" దన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment