రమణాశ్రమ లేఖలు 122. కృతి సమర్పణ 5-6-47
రమణాశ్రమ లేఖలు 122. కృతి సమర్పణ 5-6-47
https://bhagavanraman.blogspot.com/2019/05/122-5-6-47.html
మొన్నరాత్రి పట్నంలో మీ యింటినుంచి బయలుదేరి నిన్న ఉదయం ఏడు గంటలకు ఆశ్రమం చేరుకున్నాను . భగవత్సన్నిధి విడిచి , నాలుగురోజులే అయినప్పటికి , నాల్గు యుగాలయినట్లు ఉండుటవల్ల , స్టేషన్ నుండి ఎకాయకి ఆశ్రమానికే వెళ్ళాను . భగవాన్ ఫలహారం చేస్తున్నారు. నమస్కరించి , నిలుచుంటే “ వచ్చారా ? ఇప్పుడేనా ? ” అన్నారు . “ ఔ"నని లేఖల పుస్తకాలు పది కాపీలే వచ్చినవనీ , మిగతావి ప్రెస్ వారు ఆశ్రమానికే పంపుతామన్నారనీ , ఇచ్చిన పది తెచ్చాననీ చెప్పాను . “ సరే ” నని నిర్లక్ష్యంగా ఊరుకున్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/429981494484504/?app=fbl
స్నానపానాదులు ముగించుకొని పుస్తకాలకట్ట పట్టుకొని, ఆఫీసులోకి వెళ్ళేసరికి సర్వాధికారి నిరంజనానందస్వాములు లేరు. పోనీ, భగవానుకు చూపించే తెద్దామని హాలుకు వెళ్ళాను. ముందు భగవానునకే చూపాలన్న మురిపెం లోపల ఉంది. ఎలాగైతే నేమి, ముందు హాలుకే వెళ్ళవలసి వచ్చింది. భగవాన్ చూచీ చూడనట్లు పేపరు చదువుతున్నారు. చేతికివ్వటానికి జంకి కుర్చీపీటమీద పెట్టాను. కృతిసమర్పణ సందర్భంలో వారి వారి శక్త్యానుసారం ఫలపుష్పాది కానుక లిచ్చి , కృతిభర్త నర్పించటం సహజం. "అయితే కొండంత దేవునకు కొండంత పత్రియా? ” అన్నట్లు ఈ భగవానుల కేమిచ్చి పూజించగలం ? పోనీ
“ పత్రం , పుష్పం , ఫలం , తోయం ' అన్నట్లు ఏ ఒక్కటో లాంఛనంగా యిద్దామన్నా “ వచ్చిన పని చూచుకోక , ఇదంతా ఎందు ” కని , ఈ మధ్యనే భగవాన్ మందలించడం వల్ల , ఏమీ ఇవ్వక చేతులు జోడించాను.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
ఏం చిత్రం జరిగిందనుకున్నావు. నమస్కరించాలని వొంగేసరికి , పూలు , పళ్ళూ అగరువత్తులూ , వక్కలూ , ఆకులూ మొదలైన శోభన సామగ్రితో నింపిన పెద్ద పళ్లెం పట్టుకొని ఒక భక్తుడు బ్రాహ్మణ బృందంతో సహావచ్చి , ఈ పుస్తకాలపక్కనే ఆ పళ్ళెం పెట్టాడు . వంగినదాన్ని లేచి చూచేసరికి విభ్రాంతి కలిగింది . అంతా గుంపుగా నిలిచి " న కర్మణా న ప్రజయా ధనేన ” అంటూ వేదమంత్రం పఠించారు . అనంతరం అంతా మళ్లీ నమస్కరించి లేచాం . కృష్ణస్వామి ప్రసాదమిచ్చి , వారిని పంపాడు . భగవాన్ పేపరు అవతల ఉంచి సావధానులై “ ఈనాడు వారికి షష్టిపూర్తిట ” అన్నారు నాతో . “ అలాగా ” అన్నాను . ఎలాగైతేనేమి ? తలవని తలంపుగా జరిగిన ఈ సన్నివేశం వల్ల నేనేమీ తేలేదన్న లోపం తీరినట్లుగా నాకు సంతృప్తి కలిగింది .
పుస్తకాలు అక్కడుంచాడు కృష్ణస్వామి . నేను భగవాన్ చేతికందించాను . ఇటూ అటూ తిప్పి చూచి “ సరే . ఆఫీసులో ఇవ్వు , ముద్రవేసి రానీ చూద్దాం ” అన్నారు . ప్రెస్ వారు, ఫోటో క్రింద భగవాన్ పేరు వేయటం మరచిపోయినారని తీసి చూపించాను. "అరెరే, పొరపాటయిందే. పోనీ, నామం రూపంలో కలిసిపోయిందిలే. ఆఫీసులో ఇవ్వు ” అన్నారు భగవాన్ . చిత్తమని తీసుకున్నాను . ఆఫీసుకు వెళ్ళి , నిరంజనానందస్వాముల చేతికిచ్చి వచ్చాను . తొమ్మిది గంటలకు మౌనస్వామి రెండు పుస్తకాలు తెచ్చి భగవానుకిచ్చారు . భగవాన్ చూచి "ఒకటి నాకూ, ఒకటి నాగమ్మకూనా?" అంటూ సమీపస్థులతో "ఏమోయ్. ఇది దాని కియ్యి. అది రాసింది. వాళ్ళ అన్న అచ్చు వేయించాడు. అదే పుస్తకాలు తెచ్చి మనకిస్తే అందులో ఒకటి దానికిస్తున్నాం. బెల్లంతో పిళ్ళారిని చేసి, పూజానంతరం ఆ బెల్లమే గిల్లి నైవేద్యం పెట్టినట్లుంది. పళ్ళు తెచ్చి పెడితే, ప్రసాదం ఇవ్వటం లేదూ? అలాగే ఇదీను" అన్నారు.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment