రమణాశ్రమ లేఖలు 121 చాటు ఎందుకు ? 28-5-47
భగవాన్ సన్నిధిలో పళ్లూ , పిండివంటలూ తెచ్చి ఎదుట పెట్టటం , తామే విస్తట్లో వడ్డించటం , తెచ్చినప్పుడే హాల్లో అందరి ఎదుట తినమని బలవంత పరచటం సహజంగా జరుగుతుంటే , కొత్తవారయితే సరేగాని , పాతవారయితే “ ఇంకేం. నైవేద్యమయింది . కర్పూరం కూడా వెలిగిస్తారా ఏం ? ” అనీ , “ ఇది మేమే తెచ్చామని అందరికీ తెలియాలి కాబో “లని పెట్టినప్పుడు తిని , చెప్పినట్లు వింటే తప్పా స్వామిత్వం రాదా ? ” అనీ , అప్పుడప్పుడు భగవాన్ అంటూ ఉండటమే గాక , చొరవగలవాళ్ళయితే “ వచ్చినపని చూచుకోక ఇదంతా ఎందుకు? అని మందలించడం కద్దు. ఒక సంవత్సరం కావస్తుందనుకుంటాను. ఒకనాటి ఉదయం ఫలహార సమయానికి జొన్న పేలాలు తెచ్చి వంటయింటి వారికే అప్పజెప్పి ఊరుకున్నాను. అయితేనేమి, హాలుకు వెళ్ళగానే నేను అన్నిరకాల ధాన్యం తినే ఉన్నాను. ఇదంతా పెట్టుకొని , ఎందుకు శ్రమపడటం " అని మందలించారు భగవాన్.
నాటినుండి నేనేమీ చేసి ఇవ్వడం లేదు. ఈ మధ్య నీవు పంపిన అత్తిపళ్ళూ, బిళ్ళలూ అందరియెదుట ఇస్తే ఏమంటారోనని భగవాన్ సేవకులకు చాటుగా చెప్పి యిచ్చాను . వారు సమయం చూచి , భగవాన్ కిచ్చారు . అప్పుడేమీ అనలేదుకాని , నాల్గయిదు రోజుల క్రితం ఏం జరిగిందనుకున్నావ్ . మధ్యాహ్నం రెండున్నర గంటలకు వెళ్లాను . భగవాన్ దగ్గర సేవకులు తప్ప ఎవ్వరూ లేరు ఉడుతలు సోఫామీద పాకుతూ , మారాం చేస్తున్నవి . భగవాన్ డబ్బా దులుపుతూ " లేదురా , లేదు " అని , నా వైపు చూచి ' జీడిపప్పు అయిపోయింది . వేరుశనగపపు వీరికి పొసగదు , ఏం చేసేదీ?". అన్నారు . ప్రశ్నాసూచకంగా సేవకుల వైపు చూచాను .“సామాను గదిలో కూడా లేదట ” అన్నారు వారు . ఉడుతలా మారాం మానవు . నాకు ఊరుకోటానికి బుద్ధి పుట్టలేదు . తెప్పిస్తే ఏమంటారోనని భయం.
సాయంత్రం ఎవరో టవునుకు వెడుతుంటే , పదితులాల పప్పు తెమ్మని డబ్బిచ్చాను . తెచ్చిన వారప్పుడే ఇవ్వక మర్నాడు ఉదయం తొమ్మిదిగంటల కిచ్చారు . ఎదురుగా యిస్తే ఏమంటారో అని తొమ్మిదీ ముప్పావుకు భగవాన్ బయటికి వెళ్ళటం చూచి , కృష్ణస్వామికి పొట్లం ఇచ్చాను . మధ్యాహ్నం ఏం జరిగిందో తెలియదు . రెండున్నర గంటలకు వచ్చి , నాలుగు గంటల వరకూ ఉన్నాను . ఈ ప్రసక్తి రాలేదు . బ్రతికాంలే బాబూ అనుకొని , ఇంటికి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చి , హాల్లో దూరంగా కూర్చున్నాను . వేదపారాయణ ముగిసింది . కృష్ణస్వామి డబ్బాలో నేనిచ్చిన జీడిపప్పు సర్దుతున్నారు . భగవాన్ చూచి " ఆ పప్పెవరిచ్చారు ? ' అన్నారు . “ నాగమ్మ ” అన్నాడతను . “ ఎప్పుడు ? ” అన్నారు భగవాన్."తొమ్మిదీ ముప్పావుకు భగవాన్ బయటికి వెళ్ళినపుడు ” అన్నాడు కృష్ణస్వామి. ( ఇంకా ఉంది )
(తర్వాత భాగం)
"అలాగా? ఎదురుగానే ఇవ్వరాదూ ? చాటెందుకు భగవాన్ కోప్పడతారని మాత్రం భయం. ఇంకా ఈ చేష్ట విడువలేదు. ఆ సుబ్బలక్ష్మికీ ఇదే చెప్పింది కాబోలు. అమెగూడా ఇంతకు ముందే జీడిపప్పు తెచ్చి కిటికీలోనుంచే చాటుగా సత్యానందానికిచ్చి చక్కాపోయింది. పైగా ఆత్త ఈవ్వమన్నదని సాకు చెప్పింది. ఇచ్చిందంటే నేనేమీ అననని దానిమీదకు తోసివేసింది. ఇవే ఒక్కొక్కరి చేష్టలు . వచ్చినపని చూచుకోక, ఇదంతా ఎందుకో? స్విమిని మార్చావని చూస్తారు . మనమే ఏమరిపోతున్నామని తెలుసుకోవటం లేదు. ఎన్నాళ్ళయినా , ఇవి పోలేదే. ఇందుకా వచ్చింది ” అని మేఘ గంభీరధ్వనితో గర్జించారు భగవాన్.
కూర్చున్నదాన్ని కూర్చునట్లు చిత్రప్రతిమల్లె అయిపోయినాను . సుబ్బలక్ష్మికి నేను చెప్పనూ లేదు . ఆమె ఇచ్చిందో తెలియదు . కానీ , ఆ మాటల వల్ల జ్ఞప్తికి వచ్చి, గురుకటాక్షమనే సింహస్వప్నం ఇటువంటిదే కాబోలనుకున్నాను . గడియారం టంగున ఒక్కసారి కొట్టింది . ఉలిక్కిపడి చూతునుకదా , ఆరున్నర అయింది . ఆడంగులు ఉండదగిన వేళ అంతటితో సరికదా ? అందరూ చల్లగా జారుకుంటున్నారు . ఎలాగో లేచి , నమస్కరించాను . అనుగ్రహపూరితమైన ఆగ్రహాన్ని సూచించే రూక్లేక్షణాలతో పళ్ళు బిగబట్టి , నా వంక చూస్తూనే ఉన్నారు భగవాన్ . ఆ గంభీర మూర్తిని కన్నెత్తి చూడలేక సిగ్గుతో వంచిన తల ఎత్తకుండా ఇంటికి వచ్చాను . భళ్లున తెల్లవారింది . శిక్షాలక్షణమైన ఆ మందలింపుకు జీడిపప్పే కారణం కాదనీ , జ్ఞానోపార్జనకై కదా వచ్చింది . ఆ వచ్చిన పని మరచి సంచరించిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నవనీ గ్రహించి , | మనస్సులో క్షమాపణ వేడుకున్నాను .
ఉదయాత్ పూర్వమే లేచి , త్వరగా కాలకృత్యాలు ముగించుకొని , ఆశ్రమానికి వెళ్ళి , హాల్లో అడుగుపెట్టగానే , మందహాసంతో ఈ కేసు విచారణకు తెచ్చారు భగవాన్ . సుబ్బలక్ష్మమ్మకు నే చెప్పలేదనీ , భర్తగారి షష్టిపూర్తికి తెచ్చిన పప్పు. మిగిలితే ఉడుతలకి అలాగా , ఇప్పడు కథంతా వేరు విధంగా మారింది. అయితే మాత్రం చాటెందుకు? ఊ, పోనీలే, ఏదో అయింది." అంటూ ప్రసగం మార్చి, మొక్కలతో మాటలతోమాయగప్ప చూచారు. నాకు మాత్రం ఇంతవరకు మరపురాలేదు.
రేపు మిగిలితే , ఉడుతల కివ్వమని అలిమేలడ్డీ ఇచ్చిందనీ తేలింది . “ అలాగా . " కథంతా వేరువిధంగా మారింది . అయితే మాత్రం చాటేందుకు ? ఊ , పోనీ ఏదో అయింది ” అంటూ ప్రసంగం మార్చి , మాటలతో మాయగప్ప చూ భగవాన్ . నాకు మాత్రం ఇంతవరకూ మరపురాలేదు .
*"ఆశయా బధ్యతే లోకో కర్మణా బహుచింతయా*
*ఆయుఃక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత "*
అన్న పెద్దలవాక్యం విస్మరించి , కాలవేగం గమనించక , కాలయాపన చేస్తున్నదే బిడ్డ అన్న పరితాపంతో పలికిన ఆ పలుకులూ , చూచిన ఆ చూపులూ , నా హృదయఫలకంలో ముద్రవేయబడినవి . అన్నా , ఆ సంఘటన ఏమని రాయగలను , జ్ఞానదాత కదా భగవానుడు .
Comments
Post a Comment