రమణాశ్రమ లేఖలు 120 అజప తత్వం 23.5.47

రమణాశ్రమ లేఖలు 120 అజప తత్వం 23.5.47
https://bhagavanraman.blogspot.com/2019/05/120-23547.html
        ఈ ఉదయం 8గంటలకు కాషాయాంబరధారులొకరు వచ్చి "స్వామి, మనోనిగ్రహానికి అజపమంత్రం జపిస్తే మంచిదా? ఓంకారమా? ఏది ఉపయోగకారియో సెలవీయవలె" నన్నారు.  "అజపమంటే ఏమని మీ భావం? 'సోహం, సోహం' అని నోటితో జపిస్తే అజపమవుతుందా?  అజప అంటే వాక్కుతో  ఉచ్చరింపకయే తనంతట తానుగా జరిగే జపాన్ని తెలుసుకొనుట అన్నమాట. అసలు, జపతత్వం గ్రహించక  వేళ్ళు లెక్కపెడుతూనో, జపమాల తిప్పుతూనో,  నోటితో  'సోహం, సోహం' అంటూ అక్షరలక్షలు జపించుటేనని  భావిస్తారు. జపానికి ముందు 'ప్రాణాయామే వినియోగః' అని చెప్పే ఉన్నారు. ముందు ప్రాణాయామం చేసి మంత్రం జపించమని అర్థం. ప్రాణాయామమంటే నోరు మూయమనేగదా?  ప్రాణనిరోధం వల్ల, పంచభూతాలను బంధిస్తే, ఉన్న తత్వమే మిగులుతుంది. అది 'అహమహ'మని సదా తానుగ జపిస్తూ ఉంటుంది. అదే అజపం. ఆ తత్వం అవగతం చేసుకొనుట అజపంగాని, నోటితో జపించేది అజప మెట్లాగవుతుంది. ఎడతెగని ఆజ్యధారవలె తానై జపించే సత్యవస్తు సందర్శనమే, అజప, గాయత్రీ, అన్నీను. ఉపనయనకాలమందే, అంగన్యాస, కరన్యాసాది,  దిగ్బంధాలతో ప్రాణాయామం ఉపదేశించి, *అభ్యాస పరిపాకానుసారం అజప ను గ్రహింపుమన్నారు. అది విచారించక ఏమో అజపమంటారు. ఓంకారమూ అంతే. "ఓం" అనేది అంతటా నిండిన పరిపూర్ణ వస్తువేనాయే. దాన్ని వాక్కుతో ఎట్లా జపించటం?(ఓమిత్యేకాక్షరం బ్రహ్మం అద్వితీయం సనాతనం). ఈ సూత్రం గ్రహించక మూలాధారంలో గణపతికి ఇన్నివేలనీ,  తదితర చక్రములన్నిటిలోనూ బ్రహ్మకు అన్ని వేలని ఏవో లెక్కలు వేసి, పెద్దపెద్ద గ్రంథాలు వ్రాశారు. జపించే దెవరో ముందు తెలుసుకుంటే తెలుస్తుంది. జపించే వాడెవడని వెదకి పట్టబోతే, ఆ జపమే తానయి కూర్చుంటాడు."  అన్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/431579230991397/?app=fbl
      "నోటితో జపించిన దానికి ఫలితమే లేదా?" అన్నారింకొకరు.  "లేదని ఎవరన్నారు. అది చిత్తశుద్ధికి కారణమౌతుంది. చేయగా, చేయగా పరిపక్వత కలిగి ఎప్పటికైనా సరియైన దోవ తీస్తుంది. మంచిగాని, చెడ్డగాని చేసిందేదీ వృథా పోదు. కాకుంటే ఒకటికన్నా మరొకటి మేలని అధికారి ననుసరించి అంతరాలు చెప్పవలసి ఉన్నది." అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
భగవాన్ వ్రాసిన ఉపదేశసారమే ఇందుకు ప్రమాణం. అందులోని ద్విపదలున్నూ  భగవద్రచితములే గనుక ఇక్కడ వ్రాస్తున్నాను.

: ౬ :  ఉత్తమ స్తోత్రము లుచ్చము పాంశు::
చిత్తజ  పములలో జింతయు త్తమము::

: ౭: సరిదాజ్య  ధారపోల్ సరళచిం  తనము::
విరళచిం  తనకన్న వీర్యవ త్తౌను::

*ప్రాణాయామముకున్నూ ఋషి, ఛందస్సు, అంగన్యాస, కరన్యాస దిగ్భంధాదులన్నీ ఉన్నవనుటకు ప్రమాణం సంధ్యావందన భాష్యమున కననగును.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ