రమణాశ్రమ లేఖలు118 రాజేడీ-రాజ్యమేదీ? 19.5.47
రమణాశ్రమ లేఖలు118 రాజేడీ-రాజ్యమేదీ? 19.5.47
https://bhagavanraman.blogspot.com/2019/05/118-19547.html
ఈ మధ్యాహ్నం 'ప్రాచీన శంకర విజయా'న్ని గుఱించిన ప్రసంగం వచ్చి భగవాన్ ఒక భక్తునితో "ప్రస్తుతం వాడుకలో ఉన్న శంకర విజయాలన్నిటికీ విలక్షణమైనది విద్యారణ్యులదేగదా?" అన్నారు. "అవును. వారు చాలా మేధాసంపన్నులు గదా? వారి గ్రంథమే ప్రామాణ్యంగా తీసుకుంటారందరు" అన్నారా భక్తులు. భగవాన్ చిరునవ్వుతో "అవును. వారి మేధాశక్తి చాలా గొప్పది. వారు. శ్రీవిద్యోపాసకులుగదా? శ్రీచక్రాకారంగా, పట్నం నిర్మించాలని హంపీలో ప్రారంభించి విఫలమనోరథులై భవిష్యత్తున ఒక చక్రవర్తి రాగలరనీ, వారు శ్రీచక్రాకారంగా పట్నం నిర్మించ గలరని వ్రాశారు.
https://www.facebook.com/359807631501891/posts/432671100882210/?app=fbl
ఈ సంగతి కొండమీద ఉండగా నాయన (గణపతి శాస్త్రి)తో నేనంటే, వారొక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు. ఏమనంటే 'శ్రీచక్రాకృతి శోణశైలవపుషం శ్రీషోడశార్ణాత్మకం' అని అరుణాచలాష్టకం స్తోత్రంలో ఉన్నది. (శంకరాచార్య విరచితం). అదేగాక అరుణాచలపురాణంలో ఈ గిరి శ్రీచక్రాకారమని ప్రసిద్ధి. అందువల్ల వెతక్కుండానే, మనకీ శ్రీచక్రాకృతిగల స్థానం లభించింది. భగవాన్ చక్రవర్తి. గిరిచుట్టూ పది ఇళ్లు కడితే, ఇదే మహాసామ్రాజ్యం. వారు భవిష్యత్తును గుఱించి వ్రాసింది ఇదే అయిఉంటుంద' దని వ్యాఖ్యానించి 'ఇదిగో వీడు సేనాధిపతి. వాడు కోశాధ్యక్షుడు. వాడిదీ, వీడిదీ' అంటూ రాజ్యాంగమంతా ఏర్పాటు చేసేవారు. వారిక్కడుండగా అదొక వేడుకగా ఉండేది. అందరూ కూర్చుని 'ఏమోయ్, ఈ రోజున మన దర్బారుకంతా ఫలహారం ఏమిటి?' అనేది; అదనీ, ఇదనీ ప్రోగ్రాం వేసుకునేదీ; చేసేదీ, తినేదీ, అంతా రాజ్యమేలుతున్నట్లే కార్యం నడిపేవాళ్ళు, ఇదిగో, ఈ సుందరేశుడు, ఆ కళ్యాణం, అప్పడిట్లా ఉండేవాళ్లా? అరే అప్పా. ఒక్కొక్క ఆసామి బలే హుషారుగా ఉండేవాళ్ళు. యోధులమనే అనుకునేవా" ళ్ళన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
"ఇదంతా ఎప్పుడు" అన్నాడు శివానందం. "విరూపాక్షగుహలో ఉండగానే. ఒక్కొకప్పుడు కట్టబోయే పట్నానికి కాగితం మీద ప్లాను గూడా వేసేవారు నాయనా. అందులో నాకొక ప్రత్యేక స్థానం. వెనుక, అన్ని ప్లానులూ రాజ్యాంగానికి తగినట్లుగా తయారుచేసేవారు. రాజు లేడు, రాజ్యం లేదు. ప్లాను మాత్రం సిద్ధమయ్యేది. అట్లా ఎన్ని ప్లానులో. రాజేడీ, రాజ్యమేదీ?"అన్నారు భగవాన్. "రాజు లేకేమి. ఎదుటనే ఉన్నారు గదా? అయితే ఈ రాజు కౌపీనధారి. అంతేగదా? ఇప్పుడేం తప్పింది? కొండచుట్టూ ఇళ్ళు కట్టలేదా? భగవాన్ సన్నిధానం రాజాస్థానంవలే ఉండలేదా? అంతా వారన్నట్లే రాజ్యాంగం నడుస్తూనే ఉన్నది. మామూలు రాజ్యానికీ, దీనికీ కొంచెం భేదం ఉంటుంది. అంతే" నన్నారు నాయన శిష్యులైన సుబ్బారావుగారు.
"అదిసరి, మహారాజుదీ, మహాజ్ఞానిదీ ఒకటేదశ అని నాయనగూడా అంటూ ఉండేవారు. తథాగతుని గుఱించి కాలజ్ఞులు 'ఇతడు చక్రవర్తి అయిన కావాలి, లేక
జ్ఞానసంపన్నుడైన సన్యాసి అయినా కావా'లని అంటే ఎక్కడికీ పోనీయక అంతఃపురంలోనే ఉంచి భోగలంపటుని చేయాలని తండ్రి ఎంతో తంటాలు పడ్డాడు. కడకు వారేదో నెపంతో, బయటికి వెడితే, లోకంలో ఉన్న కష్టమే గోచరించింది. పాఱిపోయి సన్యసించారు. ఏదో ఒకటి" అన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment