రమణాశ్రమ లేఖలు114 ఆత్మహత్య 15.5.47

రమణాశ్రమ లేఖలు114 ఆత్మహత్య 15.5.47
https://bhagavanraman.blogspot.com/2019/05/114-15547.html
       ఈ మధ్యాహ్నం తిరుచ్చినాపల్లి వైపునుండి వచ్చిన యువకుడొకడు  భగవాన్ కొక జాబు వ్రాసి చేతికిచ్చాడు. దేశంలో ఎందరో జనం అన్నంలేక మాడంతున్నారనీ, ఎంతో కల్లోలంగా ఉన్నదనీ,  వారి కష్టం చూడలేకున్నామనీ,  భగవాన్ ఏదైనా నివారణోపాయం చెప్పవలసిందనీ,  తమ వంటి పెద్దలు ఏమీ  చెప్పకుంటే ఎట్లాగనీ,  ఆ జాబులోని విషయ సారాంశం .
https://www.facebook.com/359807631501891/posts/435374587278528/?app=fbl
      భగవాన్ చదివి అతని వంక పరిశీలనగా చూస్తూ "అదా నీకు కావలసింది వారి కష్టం చూడలేక బాధపడుతున్నానంటావు. నీవిప్పుడు సుఖంగా ఉన్నవన్న  మాటేనా?" అన్నారు. "లేదు, ఏదో రకంగా చింత కలుగుతూనే ఉన్నది"  అన్నాడా యువకుడు. "ఆ, అదీ సంగతి. నీ సుఖమేదో నీకు తెలియదు. వారికొరకా చింత? లోకులందరు ఒకే విధంగా ఉండేటట్లు చేయాలంటే సాధ్యపడుతుందా?  అంతా అందలమెక్కితే మోసేదెవరన్నట్లు  అంతా రాజులే అయితే, వీడు రాజని నిర్దేశించి చెప్పేందుకే మున్నది. బీదవారుంటేనే, భాగ్యవంతులు వీరని తెలుస్తుంది. అజ్ఞానులుంటేనే జ్ఞానిని  గుర్తించగలం.  చీకటి ఉంటేనే వెలుగు తెలుస్తుంది. కష్టం ఉంటేనే సుఖం గోచరిస్తుంది. ఆకలి ఉంటేనే ఆహారానికి రుచి. అందువల్ల, తోచినంత సహాయం చేయగలమేగాని,  అందరిని ఒకే విధంగా ఉంచాలంటే ఏ నాటికీి ఏ ఒక్కరి వల్ల సాధ్యపడదు. ఎందరెందరో దేశనాయకులు పనిచేస్తున్నారు. అందులో కొందరు 'మేము తలపెట్టిన కార్యం సరిగా కాలేదు, అందుకుగాను ఉపవాసాలు చేస్తా'మంటారు. ఎందుకో! ఒకరి వెనుక ఒకరు నాయకులుగా వస్తున్నారు, పని జరుగుతూనే ఉన్నది.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
           అందరినీ నడిపే శక్తి ఒకటుందిగదా? దాని పని అది చూచు కుంటుందని భారం దానిపైన వేసి, నిశ్చింతగా ఉంటే, అదే జరిగిపోతుంది. మరికొందరు జీవహింస చేయరాదని బోధిస్తారు. వినకుంటే, 'మీరిది మాన రేని మేము ప్రాయోపవేశం చేసి, ఆత్మహత్య చేసుకుంటాం ప్రాణం విడుస్తా' మంటారు. లోకులు జీవహింస మానలేదని తనాత్మహత్యకు పాల్పడితే, అది మాత్రం జీవహింస కాదా యేమి? ఆత్మహత్య అంటే శరీరం విడుచుటని వారి ఊహ. శరీరం ఆత్మకాదే. ఆత్మ ఎప్పుడూ ఎక్కడా నిత్యమై ఉండేది. ఆ నిత్యమైన తన్ను  చూడక అనిత్యమైన దేహాదులు తానని చూచుటే ఆత్మహత్య, అంతకంటే హత్య వేరే ఏమున్నది? వివేకదృష్టి వల్ల తన్నుదాగన్నవాడు ఎన్ని కల్లోలాలు వచ్చినా చలించడు. ప్రపంచ కష్టసుఖాలన్నీ నటనమాత్రంగా భావిస్తాడు. వారి దృష్టికి ఈ లోకం నాటకశాల. ఆ రంగాలలో ఒకే మనిషి ఒకేసారి రాజువేషం, మరొకసారి మంత్రి, ఇంకొకసారి సేవకుడు, చాకలి, మంగలి ఇంకా ఎన్నెన్నో వేషాలు ధరించి ఆయా పాత్రోచితంగా నటించినా, తాను తానేగాని ఇవేవీ కాదని తెలిసి ఉన్నందున ఆయా పాత్రధారణవల్ల కలిగే న్యూనతన్యూనతలు పాటించడు. అదే విధంగా ఈ లోకమా ఈశ్వరుని నాటకశాల. అందులో నీవొక నటుడవు. నీ శక్తి ననుసరించి చేతనైనంతవరకు సహాయపడవచ్చుగాని, అంతా సమానంగా ఉండేట్టు చేయాలంటే, ఏ కాలంలోనూ ఎవరివల్లా సాధ్యంకాలేదు; కాబోదు" అన్నారు భగవాన్ .

      "ఇట్లా ఉండటంవల్ల లోకంలో శాంతి లేకుండా పోయిందే? అందుకు విచారిస్తున్నా" నన్నాడాయువకుడు. "అదుగో, మళ్ళీ మొదలు. లోకంలో శాంతి లేకుండా పోయిందే అని విచారించే బదులు మనకు శాంతి ఎట్లా కలుగుతుందా అని విచారించి తెలుసుకుంటే మంచిది. అది వదిలి లోకంలో శాంతిలేదే అని విచారిస్తే, లాభమేమున్నది?తన మనస్సు శాంతిగా ఉంటే, లోకమంతా శాంతిగానే కనబడుతుంది. మీకా శాంతి ఉన్నదా ముందు చెప్పండీ?"  అన్నారు భగవాన్. "లేదు" అన్నాడాతడు. ఆ, అదీ సమాచారం. మీకు శాంతిలేదు. ఆ శాంతి ఏ విధంగా సంపాదించాలో తెలియదు. తెలుసుకుందామన్న యోచన చేయక లోకంలో శాంతి ఏవిధంగా కలుగుజేద్దామా, అన్న యీ ప్రయత్నం ఉన్నదే, తనకు అన్నం లేదు, తన తిండి తాను సంపాదించుకునే యత్నం చేయక 'ఎవరన్నా నాకుక్షి నింపితే,  నేనెందరికైనా అన్నం సంపాదించి పెడతాన'  న్నట్లున్నది. 'నన్ను లేవదీస్తే, ఈ దొంగలెంత' అన్న కుంటివాని కథ వలె" నన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ