రమణాశ్రమ లేఖలు 113 పాదమేది? శిరమేది? 24.4.47

రమణాశ్రమ లేఖలు 113 పాదమేది? శిరమేది? 24.4.47 https://bhagavanraman.blogspot.com/2019/05/113-24447.html
         ఈ మధ్యాహ్నం  మూడుగంటలకొక  భక్తులు భగవాన్ సోఫాకు దగ్గరగా నిలిచి "స్వామీ, నాకు ఒకే కోర్కె ఉన్నది. భగవాన్ పాదంమీద నా శిరస్సుంచి నమస్కరించాలని. భగవాన్ అనుగ్రహించాలి" అన్నారు.   "ఓహో, అదా కోర్కె, మంచిదేగాని పాదమేది? శిరమేది?" అన్నారు భగవాన్. జవాబులేదు.  రవంత నిదానించి "తానెక్కడ అణుగుతాడో అదే పాదం" అన్నారు భగవాన్. "ఆ స్థాన మెక్కడున్నది?" అన్నారా భక్తులు. "ఎక్కడున్నదా? తనలోనే ఉన్నది. నేను, నేనని విజృంభించే అహంభావమే శిరస్సు. ఆ అహంవృత్తి ఎక్కడ లయిస్తుందో, అదే గురుపాదం" అన్నారు భగవాన్. 
https://www.facebook.com/359807631501891/posts/436002020549118/?app=fbl
       "తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ క్రమానుసారం భక్తి చేయాలంటారే, తానే అణిగిపోతే భక్తితో సేవించడం ఎట్లా పొసగుతుంది?"  అన్నారు వారు. "తానణగుట అంటే యేమని అర్థం? ఆ భక్తిని చేయటం విశాలంచేయటమన్న  మాట. అన్నీ తనలోనివే గదా? అందువల్ల తన స్థానంలో,తానుంటే వీటన్నిటిని విస్తీర్ణం చేయగల శక్తి కలుగుతుంది" అన్నారు భగవాన్. "తన స్థానంలో తానణగటం  అంటే, బుద్ధిచేత అన్నమయాదికోశాలను తోసిపుచ్చి,  ఆ తరువాత బుద్ధిని గూడా తోసివేయవలెనా?"  అన్నారా భక్తులు. "బుద్ధిని విడిచి ఎక్కడికండీ పోయేది? బుద్ధి ఉన్నట్లుండుటే, తన స్థితిని తానెరుగుట. పైన వచ్చే విషయాదలన్నీ తొలగించే నిమిత్తం బుద్ధిని కఱ్ఱగా పట్టుకోవాలి. మలిన బుద్ధి, అమలిన బుద్ధి అని ఆ బుద్ధిని రెండు విధాలుగా వివరిస్తారు. అంతఃకరణ కార్యాలైన విషయాలతో గూడి ఉన్నప్పుడు 'మలినబుద్ధి'  అంటారు. దానికే మనస్సనీ, అహంకారమనీ పేర్లు. ఆ విషయాదులను తోసిపుచ్చుటకు ఊతకోలవలే ఉండే 'నే'   నను అహంస్ఫురణకే, అమలినబుద్ధి  అని పేరు. దాన్ని పట్టుకుని మిగతాదంతా తోసివేస్తే, ఉన్నది ఉన్నట్లుంటుం"దని అన్నారు భగవాన్. 
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
        "ఆ బుద్ధిని ఆత్మలో ఐక్యం చేయాలంటారుగదా?"  అని మళ్ళీ ప్రశ్న.
"ఐక్యం చేయటానికి ఎక్కడినుంచైనా వచ్చే వస్తువుకాదే?  తనలోనే ఉన్నది. ఆత్మయొక్క స్ఫురణే బుద్ధి. ఆ బుద్ధితో అచలమైన వస్తువును తెలుసుకుంటే, తానుతానుగా ఉంటాడు. ఆ బుద్ధినే కొందరు శక్తి అంటారు. కొందరు అహం
అంటారు.  ఏదో ఒక పేరు. పైన వచ్చేదంతా తరిమే నిమిత్తం దాన్ని పట్టుకోవాలి గట్టిగా"  అన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ