రమణాశ్రమ లేఖలు 111. దివ్యదర్శనాలు 18.4.47

రమణాశ్రమ లేఖలు 111. దివ్యదర్శనాలు  18.4.47
https://bhagavanraman.blogspot.com/2019/05/111-18447.html
        ఈ ఉదయం ఎనిమిది గంటలకు వయోవృద్ధులొకరు భగవాన్ ఉన్న హాలులోకి వస్తూ వుంటే భగవాన్ నావైపు చూచి "ఈ వచ్చేదెవరో తెలుసునా?" అన్నారు. తెలియదన్నాను. "నా పినతల్లి కూతురు ఒకామె నాతోపాటు అమ్మ వద్ద పాలు త్రాగిందని చరిత్రలో వ్రాసి ఉన్నదే ఆమె భర్త" అన్నారు భగవాన్. (వారి పేరు మానామధుర రామస్వామి అయ్యర్)  "ఆమె పేరేమి?" అన్నాను. "మీనాక్షి" అన్నారు భగవాన్. "అప్పుడప్పుడు వీరిని చూస్తున్నానుగాని ఈ సంబంధం తెలియదు" అని సమీపస్థులగు మరొక భక్తులను చూచి "మీరెరుగుదురా?"  అన్నాను. "ఎరుగకేమి. ఆమెకు మరణ సమయంలో భగవాన్ దర్శనమిచ్చారని కూడా విన్నాను" అన్నారా భక్తులు.  ఆశ్చర్యంతో భగవాన్ వైపు చూచి "అలాగా?" అన్నాను. భగవాన్ అందుకొని "అవును. తిరువొట్రియారులో నాయనగారికి జరిగినట్లే ఆమె విషయంలో జరిగింది. నేను దగ్గరకు వెళ్లి ఆమెను తాకాను. ఆమె ఉలిక్కిపడి 'ఎవరూ తాకింది?' అన్నది. అంతే. వెంటనే మెలుకువ కలిగింది.  తరువాత విచారిస్తే అదే సమయానికి ఆమె చరమదశలో ఉన్నదని తెలిసింది" అన్నారు. 
https://www.facebook.com/359807631501891/posts/437197067096280/?app=fbl
  "అక్కడ ఆమె ఈ సంభవం ఎవరితోనైనా చెప్పిందేమో?" అన్నాను. "విచారించాముగాని ఆమె అప్పుడు చెప్పే స్థితిలో లేదట" అన్నారు భగవాన్. "నాయన గారికి దర్శనమిచ్చినట్లే ఆమెకున్నూ దర్శనమిచ్చి  అనుగ్రహించారన్న మాట.  ఏకస్తన్యపానఫలితం వృథాపోతుందా?" అన్నాను. "ఊ-అదే-అదే. అమ్మ మా యిద్దరికీ పాలిచ్చేది. నాకు అయిదేండ్లు  దాటేదాకా తాగుతూనే ఉన్నాను. మా నాయన చూస్తే 'ఎదిగిన పిల్లాడికి పాలే' మని కోపం చేసేవారు. అందువల్ల వారిని బయటికి పోనిచ్చి తాగేవాణ్ణి.  అమ్మవద్ద పాలు అంత సమృద్ధిగా ఉండేవి" అన్నారు భగవాన్. 
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
  "భగవాన్ గణపతిశాస్త్రి గారిని గూడా 'నాయనా' అంటారెందువల్ల?"  అన్నొరొక  భక్తులు. "ఎందువలనా?  అందుకొక కారణం ఉన్నది. సాధారణంగా నేను అందరినీ మర్యాదగా పిలవటం మామూలుగదా!  పైగా వారు నాకంటే వయస్సులో పెద్దవారు. గణపతిశాస్త్రిగారూ,రండీ,పోండీ అనేవాణ్ణి. వారికది పట్టరాని బాధగా ఉండేది. 'శిష్యుణ్ణిగదా? గణపతీ! రారా! పోరా అనక అదేమీ అన్యాయ' మని ఎన్నోసార్లు బ్రతిమాలారు.  నేను వినలేదు. కడకొకనాడు 'ఏమైనాసరే. ఈ మర్యాదవాచకం మానితే గాని వీల్లే' దని పట్టుబట్టి కూర్చున్నారు. వారి శిష్యులంతా వారిని 'నాయనా' అంటారుగదా. అదొక సాకుపెట్టుకుని 'ఇదిగో వీరందరితో పాటు నేనున్నూ, 'నాయనా' అంటే బిడ్డకూ అన్వయిస్తుందిగదా. శిష్యుణ్ణి బిడ్డగా భావించుట సహజమేనని వారు సమాధానానికి వచ్చారు. 'నాయన'  అంటే తండ్రిగదా, మనదేం పోయిందని నేనొప్పుకున్నాను. అయితే ఏమి. రండీ, పొండీ అనుట మానలేదు. వారికి మాత్రం ఇంత చేసీ లాభంలేకపోయిందే అన్న కించ వదలనే  లేదు." అన్నారు భగవాన్.

  "భగవాన్ దర్శనమిచ్చిన సంగతి మీనాక్షమ్మ చెప్పే స్థితిలో లేదన్నారు  సరే, నాయనగారు చెప్పేవున్నారుగదా. ఉభయులకూ ఒకే సమయంలో ఒకే అనుభవం కలిగించే దర్శనాలను గుఱించి పరిభాషలో ఏమంటారో?"  అన్నా నేను. భగవాన్ దరహాసిత వదనులై "వాటినే దివ్యదర్శనాలంటారు" అన్నారు.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ