రమణాశ్రమ లేఖలు 110 సప్న దర్శనాలు 17.4.47

రమణాశ్రమ లేఖలు 110 సప్న దర్శనాలు 17.4.47
https://bhagavanraman.blogspot.com/2019/05/110-17447.html
      మొన్న ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటల వేళ సాధారణ  కుటుంబంలోని వాడగు ఒక వృద్ధు, కొంచెంగా ఆయుర్వేదం తెలిసినవాడు భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి, "స్వామీ! ఇది కఫానికి మంచిది సేవించండి" అంటూ ఏదో  ఔషధం ఇవ్వబోయినాడు. సేవకులు "వద్దువద్ద"ని వారించబోతే భగవాన్ వారినాపి, ఆ ఔషధం తీసుకొని తిని, సేవకులతో "ఉండడయ్యా. వారు నేను కొండమీద ఉన్నప్పటి నుండీ  అప్పుడప్పుడు ఏదైనా ఔషధం తెచ్చియిస్తూ ఉండేవారు. ఇవ్వనీయండి . వారి కేదైనా స్వప్నం వచ్చిందేమో?" అన్నారు నవ్వుతూ. ఆ వృద్ధుడు ఆనందంతో "ఇప్పుడేమి స్వప్నం రాలేదు స్వామీ!  తమకు ఈ రోజుల్లో కఫం కొంచెం జాస్తిగా వుండేదిగదా. అందువల్ల ఊరికేనే తెచ్చాను" అని చెప్పి నమస్కరించి వెళ్ళాడు.
https://www.facebook.com/359807631501891/posts/437825943700059/?app=fbl
     అతడటు పోగానే సమీపస్థలగు భక్తులొకరు "స్వప్నం యేమిటి?" అన్నారు.  "అదా, కొండమీద ఉండగా ఒక సాయంత్రం నేనెందుకో పళనిస్వామితో నిమ్మపండు ఉన్నదా?" అన్నాను. "లేదు" అన్నాడు. 'లేకుంటే పోనీలే'  అన్నాను. సరిగా ఆ రాత్రికే నేను నిమ్మపండు కావాలని అడిగినట్లు వీరికి స్వప్నం వచ్చిందట. మర్నాడు ఉదయమే నేనెక్కడికో వెళ్ళాలని బయలుదేరి బయటికి వస్తే వీరు ఎదురై 'స్వామీ! ఈ నిమ్మపండు తీసుకోం'డన్నారు.  నిన్ననే వీరితో నిమ్మ పండు వున్నదా?  అన్నాను. నీకెట్లా తెలిసిందయ్యా అంటే రాత్రి స్వప్నంలో తాము కనిపించి నిమ్మపండు కావాలంటిరే. అందుకని తెచ్చానని పండు చేతిలో పెట్టారు. అదొక సంభవం"  అన్నారు భగవాన్. "భగవాన్  వారికి స్వప్నంలో కనిపించి చెప్పింది నిజమేనా?" అన్నారా భక్తులు. భగవాన్ చిరునవ్వుతో "ఏమో ఎవరికి తెలుసును. వారన్నారంతే" అన్నారు. మరొక భక్తులందుకొని  "కే. కే. నంబియారు నోటు పుస్తకం గూడా ఈ విధంగానే వచ్చిందిగాబోలే?" అన్నారు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
   "అవునవును. అప్పుడు మాధవుడిక్కడున్నాడు. రమణగీత మలయాళంలో తాత్పర్యం వ్రాసి సరిగా కాపీ చేద్దామని పొడుగ్గా ఉండే నల్లఅట్ట నోటుబుక్కు బీరువాలో వున్నది. తీసి ఇవ్వమని వాడితో చెపుతూ వచ్చాను. వాడు ఇస్తా ఇస్తానంటూ నాలుగైదు రోజులు మరిచిపోయినాడు. ఇంతలో నంబియారిక్కడికి వస్తూ, సరిగ్గా నేను ఎటువంటి నోటు బుక్కు అడుగుతున్నానో అటువంటిదే తెచ్చి యిచ్చారు. 'ఇదేమయ్యా, సరిగ్గా నేనడుగుతున్న పుస్తకం వంటిదే తెచ్చారే? ' అంటే 'భగవాన్ నాకు స్వప్నంలో కనిపించి, ఇన్ని పేజీలూ, ఇంత వెడల్పూ, పొడుగూ గల పుస్తకం కావాలని అడిగారు . అంగడికి వెడితే సరిగ్గా అటువంటిదే దొరికింది. తెచ్చా' నన్నారు. ఇంతలో మాధవుడు వచ్చాడు. "ఏమోయ్? ఇదిగో పుస్తకం. నీవే ఇచ్చావుకదూ?" అన్నాను.వాడు ఆశ్చర్యపడి  తరువాత విషయం తెలుసుకొని ఇక్కడున్న పుస్తకం తీసి చూస్తే రెండూ ఒకే సైజుగా వున్నవి. రమణగీత, శ్లోకసహితంగా తాత్పర్యమంతా ఆ పుస్తకంలో ఇమిడి పోయింది. అది వ్రాసి ముగించగానే నంబియారు వచ్చి 'అచ్చువేయిస్తా' నని  తీసుకుని వెళ్లి 'భగవాన్ అక్షరం ప్రెస్సుకు పంపటమా?' అని వేరొక కాపీ వ్రాసి ప్రెస్సుకి పంపి ఆ పుస్తకం వారి వద్దనే దాచి పెట్టుకున్నారు. ఇప్పటికీ వారి వద్దనే ఉండాలి. అడుగో ఆ రాజగోపాలం అలాగే చేసాడొకసారి. నేనిక్కడ సిరా అయిపోవటం చూచి 'అయిపోయిందయ్యా'  అని వీరితో ఒకటి రెండుసార్లన్నాను.  మరుదినమో మూడవనాడో వీరు ఊరినుండి వస్తూ ఇంతపొడుగు సీరా సీసా తెచ్చారు. 'మేం సీరా అయిపోయిందనుకోటం  నీకెలా తెలిసిందయ్యా!  అంటే 'భగవాన్ నాకు స్వప్నంలో కనిపించి  సీరా కావాలన్నారు. తెచ్చా'నన్నాడు.  ఇలాగే ఒక్కొక్కటీను" అన్నారు భగవాన్ . 

  "అలా చెప్పారు భగవానని అంటారుకదా.  అవన్నీ నిజమేనా?" అన్నారా భక్తులు. "ఏమో నాకేం తెలుసును. వారలాగని  చెప్పారు. అంతే" నన్నారు భగవాన్. "పోనీ, భగవాన్ ఇక్కడ లేదనుకున్నా వస్తువే అక్కడ వారికి స్వప్నంలో కావాలన్నట్లు తోచటం చిత్రమేగదా?" అన్నారా భక్తులు.  "ఊ,ఊ"  అంటూ పలక్కుండా ఊరుకున్నారు భగవాన్.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ