రమణాశ్రమ లేఖలు.107 ఆశీర్వాదాలు 8.4.47

రమణాశ్రమ లేఖలు.107 ఆశీర్వాదాలు 8.4.47
https://bhagavanraman.blogspot.com/2019/05/107-8447.html
     ఈ మధ్య పెద్దన్నయ్య పిల్లలు, శాస్త్రి, మూర్తీ, భగవాన్ కొక జాబు వ్రాశారు. ఏమంటే "చిరంజీవి భగవాన్ తాతయ్యకు, నమస్కారములు. ఏది కావాలంటే అదల్లా వచ్చేటువంటి మంత్రం నీకు వచ్చునా? వస్తే వెంటనే వ్రాసి పంపు. ఇట్లు నీ మనమలు శాస్త్రి, మూర్తీ" అని వ్రాశారు.
https://www.facebook.com/359807631501891/posts/441097103372943/?app=fbl
       " చిరంజీవి తాతయ్యేమిటి? చిలిపిచేష్ట"లని నేనంటే "సత్యమే వ్రాసారమ్మా. చిరంజీవి భగవాను కాక వేరెవ్వరు? చిరకాలం జీవించే తాతకు నమస్కారం. కావాలన్నదల్లా వచ్చేట్టు ఆశీర్వదించు అన్నారు. తప్పేమీ?" అన్నారు సుందరేశయ్యర్. భగవాన్ నవ్వుతూ "నా చిన్నతనంలో మా మేనత్త కుమారుడు రామస్వామిగారికి నేనిట్లాగే  ఒక జాబు వ్రాశాను. కొన్నాళ్ళు దిండుగల్లులో వారింట్లో ఉండి చదువుకున్నా గదా!  ఒక సెలవులకు తిరుచ్చుళికి వచ్చాను.  ఆ రామస్వామిగారికి ఉత్తరం వ్రాయాలని బుద్ధి పుట్టింది. ఏం రాయాలో తెలియదు. మా నాయన వారికి వ్రాసే జాబుల్లో 'రాముకు ఆశీర్వాదములు' అని వ్రాయటం చూశాను ఇంకేం? నేనుకూడా 'బావకు ఆశీర్వాదములు' అని వ్రాయటం సాగించాను. నాకంటే వయస్సులో పెద్దగదా! నమస్కారాలని వ్రాయటం తెలియదు. అందరికీ ఒకటే ననుకున్నాను. తరువాత వారు పరిహాసం చేస్తే తెలిసిం" దన్నారు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
      "ఆ రామస్వామిగారి వద్ద భగవాన్ కెక్కువ చనువు కాబోలును?" అన్నారొక భక్తులు. "అవును తిరుచ్చుళి సుందర మందిరంలో ప్రస్తుతం నా పటం  పెట్టిన చోట ఒక పట్టెమంచం ఉండేది. దానిమీద మా నాయన పడుకునేవారు. ఆ మంచం ఎక్కేటందుకు ఆ రామస్వామిగారికీ , నాకూ తప్ప మరెవ్వరికీ స్వతంత్రం వుండేది కాదు. నాయన ఊళ్ళో లేనప్పుడు మేమిద్దరం దానిమీదే పడుకునేవాళ్ళం. తల్లిలేనివారు గనుక రామస్వామిగారికి, స్వాభావికంగా చొరవ ఎక్కువ గనుక నాకూ  తప్ప మరెవ్వరికీ ఆయన వద్ద చనువుండేది కాదు. మహాగంభీరమైన వ్యక్తి"  అన్నారు భగవాన్. 

       "ఆ రామస్వామిగారెప్పుడైనా ఇక్కడికి వచ్చారా?"  అన్నారా భక్తులు. "చాలా రోజుల క్రితం ఒక్కసారి వచ్చారు. వారికి ఊరు కదలటమంటే గండం. ఇక్కడికి వచ్చేపోయేవారంతా నన్ను గురించి చెపుతూ ఉండేవారట. చూద్దాం చూద్దామని దాటవేత వేస్తుండగానే ఇదిగో ఈ విశ్వనాథుడు పెళ్లవద్దని పరుగెత్తి వచ్చాడిక్కడికి. వీరు రామస్వామిగారి కుమారులే. పిలుచుకొని పోదామని వారి తలపు. కన్నకడుపుగదా?  రాక తప్పింది కాదు. బయలుదేరి వస్తున్నామని ఈ విశ్వనాధునికే  జాబు వచ్చింది. వీరు నాకా  సంగతి చెప్పక జాబుతెచ్చి నాకిస్తూ "దిండిగల్లు  మల (కొండ) కదిలిందట" అన్నారు చమత్కారంగా. అదేమిటో అంటూ జాబు చూస్తే సమాచారం తెలిసింది. మర్నాడే వారూ వచ్చారు. తరువాత వారే నాకు జాబులు వ్రాస్తూ,  'స్వామికి నమస్కారము" లని వ్రాస్తున్నారు. "స్వామి  ఆశీర్వదించా" లనీ వ్రాస్తారు. "వారికి అప్పట్లోనే ఆశీర్వాదా లందినవన్నమాట" అన్నాను . "ఇలా జరుగుతుందని అప్పుడెవరనుకున్నారు. ఏదో వ్రాశానంతే" అన్నారు భగవాన్.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ