రమణాశ్రమ లేఖలు 105. నిద్రాహార విహార నియతి 6.4.47
రమణాశ్రమ లేఖలు 105. నిద్రాహార విహార నియతి 6.4.47
https://bhagavanraman.blogspot.com/2019/05/105-6447.html
నిన్న మధ్యాహ్నం ఒక భక్తులు భగవానుని సమీపించి, "స్వామీ, తానెవరో తన ఆత్మను విచారించి తెలుసుకునేందుకు ధ్యానం చేయాలికదా? ధ్యానానికి కూర్చుంటే నిద్రవస్తుందే? అది రాకుండా ఉండే ఉపాయం ఏమిటి?" అన్నారు. " ప్రస్తుతం నీవు జాగ్రత్తలో జాగ్రత్తగా ఉండటం నేర్చుకో. తరువాత నిద్ర సంగతి చూద్దాం. జాగ్రత్తలో ఎన్నో కలలు కంటాం అవి లేకుండా జాగ్రత్త కలగాలి ముందు. ఈ చూచేదంతా స్వప్నమే. ఈ స్వప్న ప్రపంచంలో నుండి మేలుకోవా" లన్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/442270196588967/?app=fbl
"ఆ జాగ్రత్త కలగటానికి సాధన కావాలి గదా? ఏదో ఒక నియతి యేర్పరుచుకొని సాధన చేద్దామంటే, ఈ నిద్ర వస్తుందే? ఏ విధంగా దీన్ని పోగొట్టుకోవాలో భగవాన్ దయతో సెలవియ్యాల" న్నారా పృచ్చకులు. "ఆవరణ విక్షేపాదుల్లో మొదటి ఆవరణమే నిద్ర. సాధ్యమైనంతవరకు అది రాకుండా చూచుకోవాలి. ఏ కారణం వల్ల వస్తున్నదీ? అని విచారించి ఆహార, విహారాదులను స్వచ్ఛంగా, మితంగా ఉండేటట్లు నడుపుకొని, నిద్ర రాకుండా చూచుకోవాలిగాని, వచ్చిన తరువాత ఆపాలంటే లాభం లేదు. పుష్టిగా తింటే, సుష్టుగా, నిద్ర రాదా మరి? ధ్యానానికి కూర్చుంటే తల ఊగుతుంది. కొందరు, వెంట్రుకలు వెనక వైపు మేకుకు కట్టుకుంటారట. తల ఊగినప్పుడు మెలుకువ రావటం తప్ప దాని వల్ల ధ్యానానికేం ప్రయోజనం? చిన్నప్పటి నా నిద్ర చరిత్ర ప్రసిద్ధమైనదేగదా. స్కూల్లో పాఠాలు చెపుతుంటే, కునికిపాట్లు వస్తవని, వెనుక గోడకు మేకొకటి కొట్టి, తాడుకట్టి, జుట్టుకు ముడిపెట్టేవాణ్ణి. తల ఊగితే తాడు బిగిసి మెలుకువ వచ్చేది. అట్లా కట్టుకోకుంటే, పంతులు చెవులు మెలిపి ఊపి లేపేవారు." అని నవ్వనారంభించారు భగవాన్.
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
"భగవానిదంతా కల్పించి చెప్పలేదుగదా?" అన్నారు మురుగనార్. "లేదు, లేదు. వాస్తవమే. పాఠం వినకుంటే పంతులు దండిస్తారని అట్లా చేసేవాణ్ని. అప్పటి స్థితి అది. ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో కళ్ళు మూసుకొని ఒకే ధ్యానంలో ఉంటే, రాత్రేదో, పగలేదో తెలిసేది కాదు. ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూస్తే, అప్పుడే ప్రొద్దుకూకిందా? తెల్లవారిందా? అనిపించేది. ఆహారం లేదు. నిద్ర లేదు. విహారం ఉంటే ఆహారం కావాలి. ఆహారం ఉంటే నిద్ర వస్తుంది. విహారం లేకుంటే ఆహారం వద్దు. ఆహారం లేకుంటే నిద్ర రాదు. ప్రాణాధారంగా ఏ స్వల్పాహారమో కుక్షిలో పడితే చాలు. నాకంతే అయ్యేది. కళ్ళు తెరిచినప్పుడెవరో ఒకరు ద్రవరూపంగా ఏదో ఒకటి ఒక గ్లాసు ఆహారమిచ్చేవారు. అంతే.
అయితే ఒకటి. ఓకే నిర్వికల్ప నిష్ఠలో ఉన్నప్పుడే తప్ప మనస్సు, శరీరం, వ్యవహారార్ధం ఉపయోగించినప్పుడు ఆహార నిద్రలు విసర్జించుటకు వీలవుతుందా? అలా చేస్తే, శరీరం తూలుతుంది. అందువల్ల మిత సాత్వికాహారం విహార నియతి ఆత్మోన్నతికి అత్యంత ఆవశ్యకమని చెప్పవలసి ఉన్నది. ఉత్తములు తాము చేసే నిష్కమ్య సత్కార్యాచరణకు నిద్ర వల్ల కాలం వృధా పోరాదని, చాలాభాగం నిద్రను దూరం చేస్తారు. పదింటికి పడుకొని, రెండింటికి లేవటం మంచిదన్నారు కొందరు. అలాగైతే, నిద్రకు నాలుగు గంటలు చాలు అన్నమాట. నాలుగు చాలదు ఆరు గంటలు కావాలన్నారు కొందరు. అంటే, ఆహార నిద్రలు అసలు మానటం మంచిది కాదు. అతిగానూ ఉండకూడ దన్నా రన్నమాట. నిజమే. ఏదైనా పూర్తిగా అరికట్టాలంటే మనస్సు దానిమీదకే పోతూ ఉంటుంది. అందువల్ల సాధకుడైన వాడు అన్నిటికీ మితంగా సమయమివ్వాలి" అన్నారు భగవాన్. భగవద్గీతలో చూడు.
శ్లో. నాత్య శ్నతస్తు యోగో2స్తి, నచైకాంత మనశ్నతః|
నచాతి స్వప్న శీలస్య జాగ్రతో నైవచార్జనా.|| అ6,. శ్లో. 16
శ్లో. యుక్తాహార విహారస్య, యుక్త చేష్టస్య కర్మసు,|
యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా.|| అ 6. శ్లో. 17
T.Me/BhagavanRaman
Comments
Post a Comment