రమణాశ్రమ లేఖలు 104. ఆచార్యత్వం 5.4.47
రమణాశ్రమ లేఖలు 104. ఆచార్యత్వం 5.4.47
https://bhagavanraman.blogspot.com/2019/05/104-5447.html
నిన్న పురుషకారాన్ని గుఱించి ప్రశ్నించినవారే, నేటి ఉదయం భగవాన్ సోఫా దగ్గరగా కూర్చుని కొద్దిరోజుల క్రిందట తమ శరీరానికి వచ్చిన జబ్బూ, డాక్టర్లు చేసిన చికిత్సలూ, నౌకర్లు చేసిన సేవా విచారించి చెప్పి "స్వామీ, ఈ శరీరాన్ని బాగు చేసుకోలేక డాక్టర్లకూ, నౌకర్లకూ అప్పచెప్పామే, ఇదే మనకు స్వాధీనంలో లేదే, లోకానుధ్ధరిస్తామంటారు కొందరు. ఏమది?"అన్నారు.
https://www.facebook.com/359807631501891/posts/442841033198550/?app=fbl
నీకు తెలుసో, లేదో అయిదారు నెలలనుంచీ భగవాన్ తైలం రుద్దటానికైనా ఎవరినీ కాళ్ళు తాకనీయటం లేదు. అవసరమని తోచినప్పుడు తామే రుద్దుకుంటున్నారు. అందువల్ల అప్పుడేమీ బదులు చెప్పక సాయంత్రం ఆ భక్తులున్నప్పుడు తమ కాళ్ళకు తామే తైలం రుద్దుకుంటూ, చిరునవ్వుతో వారి వైపు చూచి "మనకు మనమే డాక్టర్లం, మనమే సేవకులం" అన్నారు. "మన పని మనం చేసుకునే శక్తి లేకుంటే ఏం చేస్తాం?" అన్నారా పృచ్చకులు. "తినటానికి శక్తి ఉన్నప్పుడు దీనికెందు కుండదూ?" అన్నారు భగవాన్. వారేమి చెప్పలేక తల వంచుకున్నారు. ఇంతలో పోష్టువచ్చింది. చూస్తున్నారేగానీ లోలోపల నవ్వుకుంటూనే ఉన్నారు భగవాన్. పోస్ట్ వెళ్ళిన తర్వాత చిరునవ్వుతో_
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
"పూర్వం ఒక అయ్యవారికి తామొక ఆచార్య పీఠాన్ని అలంకరించాలని ఉండేదట. శిష్యులుండాలా మరి? ఎంతో శ్రమపడ్డారు. ఎవరైనా వస్తే కాసేపట్లోనే అయ్యవారి ప్రవీణత అవగాహనమయ్యేది. వెంటనే వచ్చనదోవన వెళ్ళేవారేగానీ, ఒక్కరు నిలవ ఉండే వారు కారు. ఏం జేస్తాడు? ఒకనాడీ పెద్దమనిషి ఒక పట్నానికి వెళ్లవలసి వచ్చింది. అక్కడ తమ గొప్ప నిలుపుకోవాలి. కూడా మనిషిలేడాయే! లేనెట్లెవరికీ తెలియకూడదు. మూట నెత్తిన ఉంది. ఎవరూ చూడకుండా ఏ యింట్లోనో ముందే మూట పెట్టి, తరువాత వెళ్లినట్లు నటిద్ధామనుకున్నాడు. ఊరంతా తిరిగాడు. ( ఇంక ఉన్నాది)
T.Me/BhagavanRaman
రమణాశ్రమ లేఖలు 104. ఆచార్యత్వం (తర్వాత భాగం)
https://bhagavanraman.blogspot.com/2019/05/104-5447.html
ఏ యింట్లో కాలుపెడదామన్నా అంతా బయటే అంతా తిరుగుతున్నారు. ఏం చేస్తాడు పాపం? సాయంత్రం కావచ్చింది. అలసిపోయినాడు. కడకొక ఇంటి ముందు ఎవరూ లేరు. తలుపు తెరచే ఉన్నది. ఇంకేమని ఒక మూలన మూట పెట్టి వసారాలో కూర్చున్నాడు. కాసేపటికా యింటి యిల్లాలు బయటకు వచ్చి "ఎవరండీ మీరు?" అన్నది. "అమ్మా నేనా? ఫలానా ఊళ్ళో ఆచార్యుడిగా ఉంటుంన్నానమ్మ. ఈ పట్నంలో కొంచెం పని ఉండి వచ్చాను. మీరు మంచి గృహస్తులని విన్నాను. ఈ రాత్రికి ఇక్కడ ఉండి,పొద్దున వెళ్ళిపోదామని నా శిష్యుడిచేత ముందే మూట పంపానిక్కడ పెట్టిరమ్మని . పెట్టాడా అమ్మా?" అన్నాడు. "ఎవరూ రాలేదండి" అన్నదామె. "కాదమ్మా . ఇక్కడ పెట్టి బజారుకు వెళ్లి కొన్ని వస్తువులు తెమ్మన్నాను. ఏమూలైనా పెట్టాడేమో చూడండి అమ్మా" అన్నాడు . ఆమె అటూ, ఇటూ చూస్తే ఒక మూల ఈ మూట ఉంది."సరే"నని భర్తా, తాను అతనికి అన్నపానాదులిచ్చి, ఆదరించారు. రాత్రి పొద్దు పోయింది. "ఏమండీ తమ శిష్యుడింకా రాలేదే? మంటే, "ఆ పిల్లకాయ వెధవ బజారులో చిరుతిండి తిని, తిరుగుతున్నాడు గాబోలు. వాడికేమీ వద్దు. మీరిక పడుకోండి. వాడు వస్తే నేను తలుపు తీస్తా"నన్నాడు.
"ఆ దంపతుల కప్పటికే అయ్యవారి సంగతి అవగతమైంది. వేడుకచూద్దామని ఇంట్లోకి వెళ్లి పడుకున్నారు. ఇక, ఈ ఆచార్యులు నటన సాగించారు. వీరు పడుకున్నది ముందు గదిలో. ఇంట్లోవారికి వినపడేట్టు గడియతీశారు. "అరే ఇంతసేపేం చేేసావురా? ఇలా చేస్తే డొక్క చీలుస్తాను, వెధవ, జాగ్రత్తగా ఉండిక అని గొంతు మార్చి 'స్వామీ,స్వామీ క్షమించండీ, ఇక చేయ' నంటూ; మళ్ళీ 'మంచిది. ఇలారా, కాళ్ళు పిసుకు, ఇక్కడరా, ఇక్కడ, అబ్బ పిడికిలితో కొట్టరా!ఊ,బాగా' అంటూ, తన కాళ్ళు తానే పిసుక్కుంటూ కాసేపు నటించి, చాలు ప్రొద్దుపోయింది, పడుకో అని చెప్పి' నిద్ర పోయినాడు. ఆ దంపతులున్న చోటునుండి, ఈ గదిలోకి ఒక కంత ఉన్నది. ఆ కంతలోనుండి, వారీ వేడుకంతా చూస్తూనే ఉన్నారు. వేకువ వేళయింది. మళ్ళీ ఆరంబించారా ఆచార్యులు. 'అరేయ్ కోళ్ళు కూసినవిరా, ఫలనా వారింటికి వెళ్లి, ఫలనా పనిచేసిరారా' అని తలుపు తీసి పంపినట్లు నటించి పడుకున్నారు. ఆ దంపతులిది చూశారు. తెల్లవారింది మూటముల్లే కట్టి మూలబెట్టి, కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసేందుకై సమీపంలో ఉన్న సరస్సుకు వెళ్లాడా ఆచార్యులు. మూట తీసే దాచారీ దంపతులు. ఆచార్యులవారొచ్చి గది అంతా వెతికితే మూట కనబడలేదు. 'అమ్మా, నా మూట ఏది?' అన్నాడు. 'అయ్యా! తమ శిష్యుడు వచ్చి, తాము తెమ్మన్నారని తీసుకువెళ్లాడిప్పుడే. రాత్రి తమ కాళ్ళొత్తిన వాడేనండి. ఆ మలుపు తిరిగి ఉంటాడేమో చూడండి స్వామీ' అన్నారా దంపతులు. ఇంకేం చేస్తాడు. నోరు మూసుకుని దారి పట్టాడు. శిష్యుడు సేవచేయటం ఇదిగో ఇలాగే. నాలాగే. మనకు మనమే సేవకులం" అంటూ, తన కాళ్ళు తామే పిసుక్కుంటూ, తామే గుద్ధుకుంటూ అభినయించారు భగవాన్.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment