రమణాశ్రమ లేఖలు 103. పురుషకారం 4.4.47

రమణాశ్రమ లేఖలు 103. పురుషకారం 4.4.47
https://bhagavanraman.blogspot.com/2019/05/103-4447.html
   చాలాకాలం నుంచి వస్తూ పోతూ ఉన్న భక్తులొకరు రెండు మూణ్ణాళ్ళక్రితం వచ్చి, వచ్చింది మొదలు హాలంతా కలయ చూడటం సాగించారు. భగవానుని ఏదో అడుగుతారు  కాబోలని చూస్తూనే ఉన్నాను. ఈ దినం మధ్యాహ్నం శ్రీవారికి సమీపంలో కూర్చుని చల్లగా "స్వామీ, ఈ హాల్లో అంతా కళ్ళు మూసుకుని ఏదో కూర్చుంటారే?  అందరికీి ఫలితం కలుగుతుందా?" అన్నారు.  "ఆహా, ఎవరెవరు ఏయే తలపులతో కూర్చుంటారో వారి వారికి ఆయా విధంగా ఫలితం కలుగుతుంది" అన్నారు భగవాన్ ఛలోక్తిగా.
https://www.facebook.com/359807631501891/posts/444077906408196/?app=fbl
       *"వాసిష్ఠంలోనూ అంతే, ఒక్కొక్కచోట,  పురుషకారమే  బలమంటారు. మరొకచోట అంతా దైవాధీనం అంటారు. ఈ  రెండింటిలో ఏది స్వతంత్రమైనదో, ఏది అస్వతంత్రమైనదో  తెలియదే?"* అన్నారా పృచ్చకులు. "అవును. పూర్వజన్మ కర్మలుగాక దైవమనేది వేరే లేదని, శాస్త్రవిహితంగా ఈ జన్మలో చేసే కర్మనే పురుషకారమంటారనీ, ఈ ప్రాక్తన అద్యతన కర్మలు రెండూ గొఱ్ఱెపోతులవలె ఒకదాని నొకటి ఢీకొని  పోరాడుతవనీ,  సారహీనమైనదేదో అది  పడిపోతుందనీ, అందుకే పురుషకారాన్ని బలపరచుకోవాలని అంటారు. అసలు కర్మకు ఆది ఏదంటే, అది ప్రశ్నించ రాదంటారు. విత్తుముందా? చెట్టుముందా? అన్నట్లది తర్కానికే గాని ఇదమిత్థమని నిర్ణయించేందుకు సాధ్యపడదు. అందుకే నీవెవరో తెలుసుకో ముందు అంటా నేను.  'నే నెవరు? ఈ సంసార దోషం నాకెలా వచ్చింది?" అని విచారిస్తే తత్వజ్ఞానం కలిగి, దోషం తొలగి  శాంతి లభిస్తుంది. లభించుటేమి? తానుగా ఉంటుంది" అన్నారు భగవాన్. 
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
{*వాసిష్టం ముముక్షువ్యవహార ప్రకరణ చతుర్దశ సర్గలో ఇదే భావంగల శ్లోకాలున్నవి. చూడు.*

'కోహం, కథ మయం దోషః  సంసారాఖ్య  ఉపాగతః|
న్యాయేనేతి పరమార్శో విచార ఇతి కథ్యతే||             50

విచారాత్  జ్ఞాయ తేతత్త్వం, తత్త్వాద్విశ్రాంతి రత్మనీ|
అతో మనసి శాంతత్వం సర్వదుఃఖ పరిక్షయః||         53}
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ