రమణాశ్రమ లేఖలు 102 అమ్మ అళగమ్మ 3.4.47

రమణాశ్రమ లేఖలు 102 అమ్మ అళగమ్మ 3.4.47
https://bhagavanraman.blogspot.com/2019/05/102-3447.html
           మొన్న భగవాన్ సన్నిధిలో పాత పాటలను గుఱించిన ప్రసంగం వచ్చి "అమ్మ దక్షిణామూర్తి స్తోత్రం ఇంకా ఏవో వేదాంతపరమైన పాటలు పాడేది. ఎంతో అర్థవంతంగా ఉండేవి. ఇప్పుడెవ్వరూ లక్ష్యం చేయరుగాని కొంచెం సంస్కరించి, ప్రకటిస్తే బాగుండు" నన్నారు భగవాన్. అది విని తెలుగులో గూడా తత్వబోధలతో నిండి ఉన్న పాతపాటల మాట జ్ఞప్తికి వచ్చి  అవి ప్రకటిస్తే స్త్రీలకు ఆధ్యాత్మికంగా ఉపయోగింపగలవనీ,  ఈ గేయపఠనంవల్ల స్త్రీలు  తరింపగలరని నిరూపిస్తూ ఒక వ్యాసం వ్రాసాను.  అందులో అమ్మ అళగమ్మకు భగవాన్ చేసిన ఉపదేశాల్లో అగ్రస్థానం వహించిన, గేయరాజమని  పేరొందిన అప్పడపు పాటను గుఱించి వివరించి, ఆ వ్యాసం గృహలక్ష్మికి పంపుదామని భగవాన్తో మనవిచేస్తే "ఏదీ, విందాం చదవ" మన్నారు. చదివితే విని, "ఈ పాట కొక పెద్దకథ ఉన్నదే!" అన్నారు. 'అదేమో సెలవిస్తారా?" అన్నాను. 
https://www.facebook.com/359807631501891/posts/444689456347041/?app=fbl
     "అమ్మ, నా వద్ద ఉండటం ప్రారంభించిన మొదటి రోజుల్లో విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు వంట ఉండేదికాదు. ఎచ్చమ్మ వాళ్ళేమైనా తెచ్చి ఇస్తే తినటం, పాత్రలు కడిగి పడుకోవటం, అంతే మామూలు. అబ్బాయికేమీ లేదే జంట అప్పడ మంటే ప్రియమే, ఆ అప్పడాలైనా  చేస్తే బాగుండునని తోచిందామెకు. చేసిన చెయ్యికదా! ఊరుకోలేకపోయింది. నాకు తెలియకుండా, *మొదలియార్ పాటీకి, ఎచ్చమ్మకూ ఇంకాఎవళ్ళకో అన్నీ సిద్ధంగా ఉంచమని ముందే చెప్పి, ఒక దినం సాయంత్రం 'ఊళ్ళోకి వెళ్లివస్తా' నని బయలుదేరింది. ఆమెనటు పోనిచ్చి, ఏం జేస్తుందో చూద్దామని బయట ఉన్న చెట్టు క్రింద కూర్చున్నాను. నేనెరుగ ననుకున్న దామె.  ఆ యిల్లూ , ఈ యిల్లూ తిరిగి పెద్ద గిన్నెలో అన్నీ పెట్టుకుని వచ్చింది. నేనేమి ఎరుగనట్లు కళ్ళుమూసుకున్నాను. గుహలో భద్రం చేసింది. చూడ వచ్చిన వారంతా వెళ్లారు. చీకటిపడ్డ తరువాత ఏదో తిని, దొంగ నిద్ర  నభినయిస్తూ పడుకొన్నాను. ఆమె సావకాశంగా గిన్నెలోనుంచి కర్రలూ , పీటలూ, పొడిపిండీ, ఉండలూ అన్నీ తీసి ప్రారంభించింది. రెండుమూడు వందలున్నవి.  ఒక్కతే  చేయలేదు. నాకన్నీ చేయటం తెలుసునాయే. 'నాయనా,కాసిని చేయరా'  అంటూ చల్లగా సాగించింది. నాకిక సమయం చిక్కింది. దీనికి సంధిస్తే, ఇంకొకటి ప్రారంభిస్తుంది. ఇప్పుడే ఖండించాలని అనుకున్నాను. "నీవన్నీ వదిలి వచ్చావుగదా? లభించింది తిని  పడిఉండక ఇవెందుకు? నేను చేయ్యను . నీవు చేసినా తినను. అన్నీ నీవే చేసుకో, నీవే తిను'.  అని నా వాదం,  ఆమె కాసేపు,  ఊరుకునేది. మళ్ళీ 'ఏంరా నాయనా, కాస్త సహాయం చేయరా'  అనేది . నేనో రానంటాను. ఆమె విడువక పిలుస్తూనే ఉన్నది. ఇది కాదని, అలాగైతే, నీవీ అప్పడాలు ఒత్తు, నేనింకొక అప్పడం చేస్తాను' అని, ఆ అప్పడపు పాట చెప్పుట కారంభించాను. ఆమె సదా పులుసు పాట, అన్నం పాట, ఇంకా ఏవో పాడుతూ ఉండేది. అన్నీ వేదాంత పరమైనవే. అప్పడం పాట లోగడ ఎవరూ రాసినట్లు లేదు. సరే, మనం చెప్పుదామని ఆ పాట పాడాను. ఆమెకు పాటలంటే ప్రాణం. పోనీ పాటైనా రానీ అనుకున్నది. ఆ పాట పూర్తి అయ్యేసరికి, ఆమె అప్పడాలైనవి.  " నే నీ అప్పడం తింటాను. నీ వవి తిను"మన్నాను. ఇది 1914 సంవత్సరంలోనో లేక 1915 జరిగిందనుకుంటాను." అన్నారు భగవాన్.

      "ఎంత కధ ఉన్నదో, ఈ వ్యాసంలో టూకీగా రాసాను. సరిపోదే " అన్నాను. "ఇదంతా దాల్లో ఎందుకూ?" అన్నారు భగవాన్. "లేఖల్లో రాస్తాను" అన్నాను. "ఆ. అలా రాస్తే రాయవచ్చును. అని మళ్ళీ ఏదో స్పురింనట్లుండి "ఇదుగో, ఈ అప్పడపు పాట రాసిన తరువాత ఒకనాడు గిరి ప్రదక్షిణానికి బయలుదేరాము అందరం.'స్వామీ! అప్పడపు పాటకు అర్ధం చెప్పండ' న్నారొకరు. 'సరే' నని ఆరంభించాను. " తాను కాని పంచకోశ క్షేత్రమందు' అని ఉన్నదనుకో. ఆ పంచకోశ క్షేత్రమునకే భగవద్గీత మొదలైన వేదాంత గ్రంధాలలో ఎన్నో ప్రమాణాలున్నవి. అవన్నీ చెప్పాను. అదే విధంగా ఒక్కొక్క పదానికి ఎన్నో ప్రమాణాలున్నవి. అవి చెప్పి తాత్పర్యం వివరిస్తూ వచ్చాను. ప్రదక్షిణం ముగిసి విరూపాక్ష గుహకు వచ్చి కూర్చున్నాం. ఇంకా చెపుతూనే ఉన్నాను. తత్వసారం అంతా ఆ ఒక్క పాట లోనే ఇమిడి ఉందన్నమాట. సరిగా వ్యాఖ్యానిస్తే అదే పెద్ద గ్రంధమౌతుంది." అన్నారు భగవాన్.
     https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
రమణాశ్రమ లేఖలు 102 అమ్మ అళగమ్మ (తరువాత భాగం)
https://bhagavanraman.blogspot.com/2019/05/102-3447.html
            ‌   అప్పడపు పాట.
                 ____________        

     అప్పడ  మొత్తి చూడు అదితిని నప్పుడే నీ ఆశ వీడు     .   (అ)
     
                    (అనుపల్లవి)
                    ఇప్పుడా మీయందున ఏమరి తిరుగక 
                     సద్భోధా నందుడౌ సద్గురు నాధుడు 
                     చెప్పక చెప్పాడు తత్వము గుసమము
                     గొప్పది లేనట్టి యొకమాట  చొప్పున  (అ )   ..                               
                          ( చరణములు)
                   
1. తానుగా నిపంచ కోశక్షే త్రమునందు 
    తానుగా పెరుగభి మానము నుములను 
    నేసత్వ  దనెడువి చారతి రుగులిలో 
    నేనుగా ననిపగల గొట్టిపిం డియుచేసి   (అ )
    
  2. సత్సంగ మనియెడు నల్లేరు రసముతో 
   శమదమ ములనుజీ  లకఱ్ఱమి  రియముతో 
   ఉపరతి యనునట్టి  యుప్పును కలుపిస
   ద్వాసన యనియెడి యింగువ నుచేర్చి ...(అ )
  
3. రాతిచి  త్తమునేను నేనని భ్రమయక 
  . లోదృష్టి రోకటి తోనుమా నకదంచి 
    శాంతమౌ  కొడుపుతో సమముగు  పీటపై 
    సంతత మలయక నంతనం బుతోడ .....(అ )
  
4. మౌనము ద్రయనెడి ముగియని పాత్రమున 
     జ్ఞానాగ్ని  చేకాగు సద్బ్రహ్మ  ఘృతమున
     నేనది  యగునని నిత్యము నుపేల్చి 
     తనుదానె భుజియింప తన్మయ మగునట్టి.   (అ)
                 
                  __  తెలుగు అనువాదం శ్రీ ప్రాణవనందులు. 
                  
 .  "అయ్యో! భగవాన్ చెప్పినప్పుడే ఎవరైనా వ్రాస్తే బాగుండేది. ఇప్పుడైనా భగవాన్నడిగి ఎవరైనా వ్రాస్తే బాగుండునే. భగవాన్ వ్యాఖ్యానించినట్లుగా మరెవరు వ్యాఖ్యానించగలరు" అన్నాను."ఊ సరిపోయింది" అన్నారు భగవాన్ నవ్వుతూ. పై అర్థం అంతా విన్న తరువాత "ఈ వ్యాసం నాకేమీ నచ్చటం లేదు. గృహలక్ష్మికి పంపను" అన్నాను. "ఏమో మీ ఇష్టం"  అని, మళ్ళీ ఇట్లా సెలవిచ్చారు భగవాన్. నేనలా వాదిస్తున్నప్పటికీ, కూరనీ, పులుసనీ మెల్లిమెల్లిగా వంట ప్రారంభించింది. తరువాత  స్కందాశ్రమానికి వచ్చామా? ఆమె ఎప్పుడూ ' అబ్బాయికి 'ఆ కూర ప్రియం, ఈ కూర ప్రియం అంటూ కొండంతా తిరిగి ఏవో తెచ్చేది. నీకు ఆ కాయలు తెస్తా, ఈ పళ్ళు తెస్తా' ననేది.  ఒద్దంటే వినేది కాదు. ఒకసారి ఇటువైపు అడవికి వస్తూంటే బట్టకు ముళ్ళు పట్టుకున్నవి.  అప్పుడే ఈ దోవ బాగు చేశారు. నన్ను విడిచి ఎక్కడికీ పోననేది. ఎక్కడికైనా పోతే, అక్కడే చచ్చిపోతానేమో అని భయం. నా చేతుల్లోనే పోవాలని పట్టుదల.* అలిమేలు కొత్తగా ఇల్లు కట్టుకుని,'ఒక్కసారి వచ్చి చూచిపోవమ్మా  ఉండవద్దులే, కాలు పెట్టిపోతే  చా' లని బ్రతిమలాడింది. పోనేలేదు. ' వస్తే అక్కడ జబ్బు చేస్తుందేమో, ఇక్కడికి తేవటానికి రైళ్ళు సరిగ్గా ఉండకపోవచ్చు, ఈ కొడుకు చేతుల్లో పోనేమో?'  అని రానన్నది. ఈ శరీరాన్ని రక్కెస పొదలో విసిరిపారేసినా సరే, నీ చేతుల్లోనే అంతమొందా'లనేది. అనేసరికి శ్రీవారి కంఠం గద్గదిక వహించింది. 
  
     నా కళ్ళు చెమ్మగిల్లి " ఎవరికైనా వైరాగ్యం అంత దృఢంగా ఉండాలన్నమాట" అన్నాను. "ఊ,ఊ" అంటూ ఊరుకున్నారు భగవాన్. " నీ చేతులతో ఈ శరీరాన్ని రక్కెసపాదలో పారవేసినా సరే" నన్నది కనుకనే ఆమె సమాధి పైన 
  రాజాధిరాజ పూజనీయమగు దేవాలయము 
  విరాజిల్లుతున్నదిప్పుడు చూచావా?.

(* అలమేలు అను నామె భగవాన్ చెల్లెలు. మానామధురై వద్దనున్న తమ ఊరిలో ఇల్లు కట్టుకొన్నారు.)
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ