రమణాశ్రమ లేఖలు 101 భ్రాంతి - శాంతి 23.3.47
రమణాశ్రమ లేఖలు 101 భ్రాంతి - శాంతి 23.3.47
https://bhagavanraman.blogspot.com/2019/05/101-23347.html
నిన్న సాయంత్రం ఆంధ్రదేశం నుండి ఒక యువకుడు వచ్చాడు. ముఖం చూస్తే ఒట్టి అమాయకుడల్లే కనబడుతాడు. ఈ ఉదయం తొమ్మిదింటికి భగవానుని సమీపించి "స్వామీ, నేను పదినెలల క్రితం తమ దర్శనం చేసుకున్నాను. మళ్లీ ఇప్పుడు రావాలని బుద్ధి పుట్టింది. వెంటనే బయలుదేరి వచ్చాను. క్షణమైనా ఆగలేకపోయినాను. ఇకముందున్నూ ఇలాగే బుధ్ధిపుడితే రావచ్చునా?" అన్నాడు.
https://www.facebook.com/359807631501891/posts/445866906229296/?app=fbl
"జరిగేది జరుగుతుంది. జరుగనిది జరగదు. ఏదైనా ప్రాప్తానుసారం నడుస్తుంది. ముందుదాన్ని గురించి యోచనెందుకు?" అన్నారు భగవాన్. "ఇకముందున్నూ, ఇట్లాగే బుద్దిపుడితే, వెంటనే రావచ్చునా? అణుచుకోవాలా?" అని మళ్ళీ అడిగాడు. "భవిష్యత్తును గురించి యోచించక ఉన్నట్లుంటే, కార్యం తానే నడిచిపోతుంది" అన్నారు భగవాన్. "బుద్ధి పుట్టగానే క్షణమైనా ఆపుకోలేక పోవటం భ్రాంతేనా?" అన్నాడా యువకుడు. భగవాన్ చిరునవ్వుతో నావైపు చూచి "వీరు లోగడ ఒకసారి వచ్చారట. ఇప్పుడు రావాలని బుద్ధి పుట్టిందట. వెంటనే వచ్చారుట. మళ్లీ బుద్దపుడితే రావచ్చునా' అని నన్నడుగుతున్నా" రన్నారు.
ఆ యువకుడందుకొని "బుద్ధి పుట్టినప్పుడు క్షణమైనా ఆపుకోలేకున్నానే అది భ్రాంతేనా? అంటున్నానమ్మా?" అన్నాడు. "మహాపురుష సందర్శనానికి రావటం భ్రాంతి ఎట్లా అవుతుందండీ? పోగొట్టుకోవలసిన భ్రాంతులెన్నో ఉండగా ఇదొక్కటే భ్రాంతిగా తోచిందా తమకు?" అన్నాను. మరి మాట్లాడలేదు.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
అంతకు ముందే యాత్రార్ధులుగా వచ్చిన ఆంధ్రులు కొందరున్నారక్కడ. వారిలో ఒకరు లేచి, "స్వామీ, ఆత్మకు శాంతి ఎలా వస్తుంది?" అన్నారు. భగవాన్ నవ్వుతూ,"ఏమీ? ఆత్మకా? ఆత్మకు శాంతియేమి?" అన్నారు. "కాదు, కాదు, మనస్సుకు" అన్నారా పృచ్చుకులు. "ఓహో, మనస్సుకా? సరి, సరి, వాసనలు నశిస్తే, శాంతి కలుగుతుంది . అందుకు తానెవరో విచారించి తెలుసుకోవాలి ముందు. అది విచారింపక శాంతి కావాలి, శాంతి కావాలంటే ఎలా వస్తుంది? ఉన్నదే శాంతి. ఉన్న దాన్ని విచారించి, తెలుసుకునే యత్నాలు చేయండి" అన్నారు భగవాన్.
అందులో పండితులొకరు "స్వామీ, స్థల విశేషం వల్ల ఒక్కచోట శరీరయాత్రయే బాధాకరంగా ఉంటుందే? సాధన సాగేదెట్లా?" గన్నారు. "నీలో స్థలమున్నదిగానీ, స్థలములో నీవు లేవు అన్ని స్థలలూ నీవే అయినప్పుడు ఒక చోట బాధ యేమి? ఒకచోట లేకుండుటేమి? అన్నీ నీలోనివేగదా? అవి నిన్నెలా భాదించగలవు?" అన్నారు భగవాన్. " మరి ఒక్కొక్క స్థలంలో శాంతి ఉండదే?" అన్నారు వారు. "ఉన్నదే శాంతి. అది నీ సహజ రూపం. ఉన్న నిన్ను నీ వెరుగక, లేని మనోవికారాలు చూచి, భ్రమిస్తూ, శాంతి లేదని చింతిస్తావు. నిన్ను నీవరసితే అన్ని స్థలాలు సుఖప్రదంగానే ఉంట" వన్నారు భగవాన్ .
T.Me/BhagavanRaman
Comments
Post a Comment