రమణాశ్రమ లేఖలు 100 అపరిహారం 12.3.47

రమణాశ్రమ లేఖలు 100 అపరిహారం 12.3.47
https://bhagavanraman.blogspot.com/2019/05/100-12347.html
     ఈ మధ్య "ఏకాత్మపంచకం', పుట్టిన దినపు పాటలు, భగవాన్ వ్రాశారు గదా?  అవి సిరా ఊరే చిత్తు కాగితాల మీద వ్రాస్తుంటే చూచి, ముత్యాలకోవల్లే ఉండే, ఆ దేవతా లిపికి ఈ చిత్తుకాగితాలేమా అన్న దుగ్ధతో "ఏదైనా పుస్తకంలో వ్రాస్తే బాగుండునే" అన్నాను. "చాలు, చాలు పుస్తకంలో వ్రాస్తే స్వామి వ్రాసిందల్లే ఉందే, అని ఎవరో ఒకరు తీసుకుపోతారు. ఇక్కడ ఒక్కటీ ఉండదు. స్వామి అందరికీ  ఉమ్మడి (పొదుపు)  గదా?"అని నిరాకరించారు భగవాన్. 
  https://www.facebook.com/359807631501891/posts/446428496173137/?app=fbl
     ఈ  ఉదయాన పుట్టిన దినపు పద్యాలలో కొంచెం సవరణ చేయటంవల్ల, ఆ సవరణ వ్రాసి, నా పుస్తకంలో అతికించే నిమిత్తం, చిన్న కాగితం కావలసి, హాల్లో వెతికితే లేకపోయింది. ఇంటికి వచ్చేదాకా నిలకడలేక ఆఫీసులో అడిగి తెచ్చుకుంటానని, జంకుగొంకు లేకుండా భగవాన్తో చెప్పి, వెడితే చక్కని కాగితాలు చూపించారక్కడ. నేనొకటి తీసుకుని "భగవాన్ వ్రాసుకొనుటకివి బాగున్నవే?" అన్నాను. "అయితే తీసుకొని పొ" మ్మని నాలుగు కాగితాలిచ్చారు. అవి తెచ్చి భగవాన్ కు చూపి "ఏమైనా వ్రాస్తే, ఈ కాగితాల మీద వ్రాయుట మంచిది గదా? అవి ఒక పుస్తకంలో అంటించి ఉంచుతామే. ఈ షెల్ఫ్ లో పెడుదునా ఇవి?"  అన్నాను. "ఎక్కడివవి? ఆఫీసులో నుంచి తెచ్చారా?" అన్నారు భగవాన్. "అవు"నన్నాను.  "సరిపోయింది. నా కెందుకివి? మీకు కావాలంటే ఉంచుకోండి. నేను, న్యూస్ పేపర్లో కాగితాలు చింపి దాచుకుని వ్రాసుకుంటాను. ఇవన్నీ నాకెందుకు?" అన్నారు భగవాన్. మరి మాట్లాడలేక అక్కడే బీరువాలో పెట్టి ఉంచాను. 
    https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
    తొమ్మిది దాటింది. పోష్టువచ్చి వెళ్ళిన తరువాత న్యూస్ పేపరు చదివేందుకు తీసుకొన్నారు భగవాన్. నాల్గువేళ్ళ వెడల్పున అచ్చులేని ఖాళీ పేపరు కంటపడ్డది. అది మడిచి చింపుతూ, నావైపు చూచి నవ్వితే, ఎందుకో గ్రహించలేక పోయినాను. సాంతం చింపి, చక్కగా మడిచి షెల్ఫ్ లో పెట్టబోతూ "ఇదిగో, ఈ కాగితాలు నా వ్రాతకుపయోగించుకుంటాను. లేకుంటే మనకెట్లావస్తవి? వీటి నిమిత్తం ఎక్కడికి పోయేది? మనం రాసే రాతకిది చాలదాఏమి?" అన్నారు నవ్వుతూ. "ఇదంతా మాకు పాఠమన్నమాట. భగవాన్ సదా అన్ని విషయాల్లోనూ పాఠం చెపుతూనే ఉన్నారుగానీ మేము నేర్చుకోటం లేదు". అన్నాను. భగవాన్ నవ్వి ఊరుకున్నారు. 
        
    పుస్తకాలు పోస్టు ద్వారా ఎవరైనాపంపుతారనుకో. అవి, పైన కట్టిన పేపరతో సహా తెస్తారు కొందరు. భగవాన్ ఆ పై పేపరు చక్కగా మడిచి దగ్గరున్న వారితో "ఏమోయ్, ఇవి దాచిపెట్టు. ఏదైనా పుస్తకానికి అట్ట వేసుకుందాం. మనక్కావాలంటే, ఎలా వస్తవి వచ్చిందల్లా లాభం' అంటూ ఉంటారు. నిత్యం ఆఫీసు నుంచి జాబులు తెస్తారా, అందులో మీ వంటి ఉద్యోగస్తులంతా పేపర్ మడచి ప్రక్కన వ్రాసి మిగతాది నిర్లక్ష్యంగా వదిలివేస్తారు. భగవాన్ అవన్నీ  చింపి దాస్తారు. పిన్నులు గుచ్చుతారనుకో. చదివే పని తీరగానే ఆ పిన్నులు తీసి, దాచమని సేవకులకిచ్చి "ఇవి మనకు కావలసినప్పుడు ఉపయోగిస్తవి. వా రిక పారవేసేవేగా! మనం ఉపయోగించుకుందాం. కొత్తవి మనకెలా వస్తవి?  కొనాలి. డబ్బేదీ మనకు?" అంటారు.     (ఇంకా ఉంది)
       
    కొండమీద ఉండగా శ్రీవారే టెంకాయచిప్పలతో గరిటెలు, చెంచాలు, గిన్నెలు ఎన్నో తయారు చేసే వారట. ఈ మధ్య గూడా అప్పుడప్పుడు టెంకాయ చిప్పలతోనే గిన్నెలు, చెంచాలు తయారు చేసి, చక్కగా మెరుగుపెట్టి దంతపు సామానల్లేచేసి, దగ్గరున్న వారితో "ఇదిగో,ఇవి జాగ్రత్తగా దాచండి. మన కెప్పుడైనా కావాలంటే ఉపయోగిస్తవి.  వెండి, బంగారం మనకెట్లా వస్తుంది. ఇవే వెండి గెన్నెలు, బంగారు చెంచాలూను. చెయ్యి కాలదు. చిలుమూరదు. సుఖంగా ఉంటుంది. అని అంటూ ఉండుటేగాక, తామేదైనా ఫలహారం  చేసేప్పుడూ, ఆశ్రమంలో మలయాళపు గంజి కాచినప్పుడు అవే  ఉపయోగిస్తారు భగవాన్.
       
   బత్తాయిపండ్లూ, కమలాఫలాలు మొదలైనవి వస్తే, వాటి తోళ్ళు పాఱవేయ నీయక, పచ్చళ్లుగానూ ఊరగాయలుగానూ, పులుసుముక్కలుగానూ ఇంకా ఎన్నోవిధాల ఉపయోగపడునట్లు చేస్తారు భగవాన్. అదేగాక  భోజన సమయంలో విస్తరిలో అణుమాత్రమైనను ఏ పదార్థమున్నూ పరిహరించరు. ఉపయోగకరమగు పదార్థము లేవిన్నీ పరిహరించుట తగదని ఆచరణ రూపంగా బోధిస్తూ ఉంటారు. 
     
     రోజా పుష్పాలు ఎవరైనా తెచ్చియిస్తారనుకో . భగవాన్ అవి కళ్ళకద్దుకుని గడియారం మీద పెట్టి ఉంచి వాడి రాలిన రేకులన్నీ తింటూ ప్రక్కనున్న వారికిన్నీ  యిస్తారు. ఒకసారి ఎవరో రోజా పూలదండ ఒకటి తెస్తే అమ్మ కోవెలలో అలంకరించి నిర్మాల్యం అన్ని పువ్వులతో పాటు గంపలో పడవేశారా అర్చకులు. భగవాన్ బయటకి వెళ్లివస్తూ అది చూచి వారిపై కోపించుకొని ఆ రేకులన్నీ ఏరి తెచ్చి పాయసంలో వేయించేసరికి ఘుమఘఘుమ లాడుతూ ఎంతో రుచిగా ఉన్నది. కొండకు వెడుతూ ఉంటారా, వచ్చే పోయే దారిలో ఉపయోగకరమగు ఆకులేమైనా కనిపిస్తే సేవలతోపాటు తామున్నూ కోసి తెచ్చి, పక్వంచేసే విధానం చెప్పి ఎంతో రుచిగా తయారు చేయిస్తారు భగవాన్.  ఖరీదుగల వాటి కంటే కానీ ఖర్చు లేకుండా అందరికీ లభించే పదార్ధాలే వారికి ప్రీతి . ఇవన్నీ సాధారణ విషయాలవలే తోస్తవే గాని సరిగా విచారిస్తే అన్నీ  మనకు పాఠాలే.  స్వల్ప ఆదాయంతో జీవితం గడపవచ్చునని  బోధిస్తున్నారన్నమాట.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ