రమణాశ్రమ లేఖలు 148 ప్రతిబంధాలు 26.8.47
రమణాశ్రమ లేఖలు 148 ప్రతిబంధాలు 26.8.47
https://bhagavanraman.blogspot.com/2019/04/148-26847.html
భవాన్ భూతప్రతిబంధాన్ని గుఱించి చెప్పిందంతా వింటువున్న భక్తులొకరు నిన్న ఉదయం శ్రీవారి సమీపంలో కూర్చుని “ నిన్న భగవాన్ భూత ప్రతిబంధాన్ని గుఱించి, దాని నివృత్తిని గుఱించి దృష్టాంతపూర్వకంగా సెలవిచ్చారు. కానీ వర్తమాన భావి ప్రతిబంధాలను గురించి చెప్పలేదే?" అన్నారు. “సరిపోయింది విద్యారణ్యులవారు ఈ ప్రతిబంధత్రయాన్ని గురించీ, వాటి నివృతిని గుఱించి పంచదశిలో వివరంగా చెప్పిఉన్నారే?" అన్నారు భగవాన్. “ పంచదశి చదువలేదు భగవాన్" అని ఆ భక్తుడంటే, “అలాగా, అయితే చెప్తానుండండి" అంటు ఈ విధంగా సెలవిచ్చారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/413914306091223/?app=fbl
“ భూత ప్రతిబంధాన్ని గురించి నిన్న చెప్పాను కదా? 'వర్తమాన ప్రతిబంధం అంటే విషయాసక్తి అనీ, ప్రజ్ఞామాంద్యమనీ, కుతర్కమనీ , విపర్యయ దురాగ్రహమనీ నాల్గు విధాలుగా చెప్పబడుతుంది. అందులో విషయాసక్తి అంటే , విషయాలమీద గాఢమైన ఆసక్తి కలిగిఉండడం. ప్రజ్ఞామాంద్యం అంటే గురువులు చెప్పిన అర్ధజ్ఞానం బుద్ధికి ఎక్కకుండా వుండటం, కుతర్కం అంటే గురువులు బోధించిన అర్ధానికి విపరీతార్థం తోచడం, విపర్యయ దురాగ్రహం అంటే నేను శ్రోత్రియుణ్ణి, పండితుణ్ణి, విరక్తుణ్ణి అని దేహేంద్రియాదులందు ఆతృత్వ బుద్ధి కలగడం, వీనిని వర్తమాన ప్రతిబంధకాలంటారు. వీటికి నివృత్తి ఎలా? అంటే, శమ, దమ, ఉపరతి, తితీక్షలవల్ల విషయాసక్తియున్ను, తిరిగి తిరిగి శ్రవణంచేయడం వల్ల ప్రజ్ఞామాంద్యమున్ను, ఆ విన్నది మననం చేయటంవల్ల కుతర్కమూ, నిదిధ్యాసవల్ల విపర్యాస దురాగ్రహమూ నివృత్తి కాగలవు. పైవిధంగా ప్రతిబంధానికి నాశం కలుగుతూ ఉంటే ముముక్షులైన వారికి తానే ఆత్మస్వరూపం అనే నిశ్చయబుద్ధి కలుగుతుంది. ఇదే వర్తమాన ప్రతిబంధ లక్షణం, దాని నివృత్తికి మార్గమూను.
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
“ ఇక భావి ప్రతిబంధం ఉందే. అది పాపకర్మల వల్ల ఎప్పుడు వచ్చేది తెలియకుండానే వచ్చేటటువంటిది. ఎలా తెలుసుకోవచ్చును? అంటే, సన్నిహితమైన పాపకర్మం ముముక్షులైన వారికి ఒక విధంగా రూఢమై దయా రూపమైన ఆసక్తిని పుట్టించును. దానీని భావిప్రతిబంధమని తెలుసుకోవాలి. ముముక్షువైన వాడు ఆ ఆసక్తిని భావిప్రతిబంధమని తెలుసుకోలేక నేను ఆకర్తను అసంగుణ్ణీ కదా, ఈ ఆసక్తి నన్నేం చేస్తుంది? అని దాన్ని నిరోదించకుంటే, ఆ ప్రతిబంధం వాడికి కొన్ని జన్మలు కలిగించకుండా పోదు. భావిప్రతీబంధం జన్మలు కలిగిస్తుందని అనడానికి ప్రమాణంగా వామదేవులకు ఒకజన్మ కలిగిందనీ, భరతునకు రెండు మూడు జన్మలు కలిగినవనీ, మఱి కొందరికి అనేక జన్మలు కలిగినవని శ్రుతీ స్మృతి పురాణాదుల్లో చెప్పబడి ఉంది. అందువల్ల ముముక్షువు ఈ చెప్పబడ్డ ప్రతిబంధత్రయాన్నీ విచారించి, అవి తనను అంటకుండా ఉండేలా తొలగించుకోవాలి. అలా చేయకుంటే వాడికి నిశ్చయంగా కొన్ని జన్మలు కలగడంలో సందేహమే లేదు. ఏ ఒక్కనికీ కానీ, ఏ జన్మలో ఈ ప్రతిబంధత్రయం నశించిపోతుందో, వానికి ఆ జన్మలో ముక్తిసిద్దం అని విద్యారణ్యులవారు చెప్పారు.
వాసుదేవమననంలో కూడా ఇదంతా ఉంది. ఇంకా అందులో ఈ ప్రతిబంధాలకు అనుగుణంగా ఎన్నో కథలు చెప్పారు. భర్జువు కథ, యజ్ఞపశువు కథ చమత్కారంగా ఉంటవి. ఆసురవాసనను గూర్చి చెప్పిందీ మరీ చిత్రం. అన్నిటికీ దృష్టాంత పూర్వకంగా ఒక్కొక్క కథ చెపుతారు. అందులో మీరదీ చూడలేదా?”
"చినుప్పు డెప్పుడో చూచానుకాని, భగవానిప్పుడు సెలవిచ్చే దాకా అందులో ఇంత విషయం ఉన్నదని అనుకోలేదు. ఇక ముందు చూస్తాను భగవాన్, " అంటూ వినయంతో సెలవు పుచ్చుకున్నాడా భక్తుడు.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment