రమణాశ్రమ లేఖలు 146 మాణిక్యావాచకాలు.  21.9.47

రమణాశ్రమ లేఖలు 146 మాణిక్యావాచకాలు.  21.9.47
https://bhagavanraman.blogspot.com/2019/04/146-21947.html
     భగవాన్, అడి అణ్ణామలలో, మాణిక్యవాచకుల మఠం ఏర్పడుటకు గల కారణం సూచించినప్పటినుండి వారి జన్మ కథ వినాలన్న ఉబలాటం కలిగింది. ఈ ఉదయం భగవాన్ ముఖంలో ప్రసన్నత చూచుకొని "మణివాచకుల  తిరువాచకం పాడుతుంటే నటరాజమూర్తి రాసాడంటారు నిజమేనా? అసలు వారి జన్మభూమి ఎక్కడ? ” అన్నాను. “నిజమే. ఈ కథంతా హాలాస్య మహత్యం లో ఉంటుందే " అన్నారు భగవాన్. " హాలాస్య మహాత్మ్యం తెలుగు ఇక్కడ లేదు కదా? " అన్నాను. “ అది సరి. అయితే సంగ్రహంగా చెప్తాను ” అని ఈ విదంగా సెలవిచ్చారు భగవాన్.
   https://www.facebook.com/359807631501891/posts/414964515986202/?app=fbl
      “ మణివాచకులు పాండ్యదేశంలో వాదవూరనే ( వాదపురి ) గ్రామంలో పుట్టారు ఆ కారణంగా వారిని అంతా వాదవూరర్ అనేవారు. వారికి చిన్నతనంలోనే విద్యాభ్యాసమయింది. అన్ని గ్రంథాలూ చదివి, సారగ్రాహియై శివభక్తిలోనూ, జీవకారుణ్యంలోనూ ప్రసిద్ది చెందారు. పాండ్యరాజు అది విని, వారిని రప్పించి ప్రధాన మంత్రిగా చేసుకొని ' తెన్ అవన్ పిరమరాయన్ ' (అంటే , దాక్షిణాత్య బ్రహ్మరాయుడు) అనే బిరుదు వారికిచ్చాడు. వారు నీతి నిపుణతలతో మంత్రిత్వం చేస్తూ, ఐహిక సుఖములను ఆశించక దైవసన్నిధియందే చిత్తం హత్తించి, జ్ఞానసిద్ధికి శ్రీగురుని అనుగ్రహం కావాలన్న విషయం గ్రహించి,అందుకుగాను అన్వేషణ చేస్తూ ఉన్నారు.
     
      ఇంతలో పాండ్యరాజు మంచిగుఱ్ఱాలు కొనితెమ్మని ఈ మంత్రిని ఆజ్ఞాపించాడు. వీరు కూడా శ్రీగురుని అన్వేషించదలచారు కనుక, ఇదే సందని కావలసినంత బంగారం మూట కట్టుకొని పరివారసహితంగా బయలుదేరారు. వీరి దృష్టి గురు అన్వేషణలోనే మగ్నం కావడంవల్ల దోవలో ఉన్న దేవాలయాలు చూచుకుంటూ “ తిరుప్పెఱుందురై"' అనే ఊరు చేరారు. వారి పక్వచిత్తాన్ని పరిశీలించిన పరమేశ్వరుడు బడిపంతులు వేషంతో  ఒక్క సంవత్సరంగా అక్కడి దేవాలయానికి ప్రక్కనే ఉన్న వీధి అరుగులమీద బీదపిల్లలకు చదువు చెపుతూ. రోజుకొక ఇల్లుగా ఆ పిల్లల ఇళ్లల్లో చిఱ్ఱాకు, గల్గేరూ గిల్లి వండిన శాకపాకాలతో అన్నం తింటూ, వీరి రాకకు ఎదురుచూస్తూ ఉన్నాడు. వీరక్కడకు చేరేసరికి, యీశ్వరుడు సిద్ధపురుషాకారంతో బహుసంఖ్యగల సన్యాసులతో పరివేష్టింపబడి, ఆలయ ప్రాకారంలో అక్కడి స్థలవృక్షమైన కురంద వృక్షం క్రింద కూర్చున్నాడు. వాదవూరరు  ఆలయంలో ప్రవేశించి, స్వామిని దర్శించి, ప్రదక్షిణగా వస్తూ ఈ సిద్దపురుషుణ్ణి చూచారు. వెంటనే హృదయం పొంగింది. కళ్ళవెంట నీరు కారింది చేతులు శిరస్సుపై కెగిరి నమస్కరించినవి. అప్రయత్నంగానే కాళ్లు శ్రీవారివైపుకు లాగినవి. మొదలు నరికిన వృక్షంలా ఆ గురుపాదాలపైన వాలి నమస్కరించి‌, లేచి ఈ దీనుణ్ణి కూడా దాసునిగా చేసుకోవలసిందని ప్రార్ధించారు. వారిని అనుగ్రహించడానికే వచ్చిన ఈశ్వరుడు తత్ క్షణం దృష్టి వల్లనే జ్ఞానోపదేశం చేసాడు.

  "ఆ ఉపదేశం మణివాచకుల హృదయంలో నాటుకొని అతిశయమైన ఆనందం కలిగింది. ముకుళిత హస్తములతో, ఆనంద బాష్పములతో శ్రీగురుని ప్రదక్షిణించి, నమస్కరించి దుస్తులూ వస్తువులూ ఊడదీసి గురు సన్నిధిలో ఉంచి. లంగోటాకౌపీనంతో నిలిచారు. వెంటనే గురువును వినుతించాలన్న ఇచ్చ కలిగింది. ఆ గురుకటాక్షం వల్లనే మాణిక్యాలవంటి వాక్యాలతో భక్తి భరితమైన పద్యాలు కొన్ని పాడారు. పాటకు పరవశుడయ్యే యీశ్వరుడు సంతోషించి ' మాణిక్యవాచకా ' అని సంబోధించి ఇక్కడ తిరుప్పణి ( శ్రీకార్యం అంటే ఆలయకార్యం ) చేస్తూ ఉండవలసిందని ఆజ్ఞాపించి అదృశ్యుడైనాడు. వెంటనే ఆయన చుట్టూవున్న శిష్యసమూహం కూడా అదృశ్యమైంది. అది చూచి తనను అగ్రహించింది సాక్షాదీశ్వరుడేనని మణివాచకులు గ్రహించి, దుర్భరమైన దుఃఖంతో క్రిందపడి దొర్లుతూ 'నన్నేలిన దైవమా, నన్నెందుకు విడిచి వెళ్ళావు?' అంటూ విలపించసాగారు. ఆ గ్రామస్థులందరికీ వింత కలిగి, అంతవరకూ బడిపంతులుగా ఉన్న వ్యక్తిని వెదకితే కనుపించలేదు. ' ఓహో ! ఇదంతా ఈశ్వరలీలయే కాబోలని అంతా అనుకున్నారు, మణివాచకులు కొంతసేపటికి తెప్పరిల్లి ఈశ్వరాదేశానుసారం వర్తించాలని, వెంటవచ్చిన పరివారాన్ని మధురకు పంపి, తెచ్చిన బంగారం ఆలయ కార్యానికి వెచ్చిస్తూ అక్కడే ఉండిపోయారు .

     పై సమాచారం ప్రభువు విని తత్ క్షణం మధురకు రమ్మని మణివాచకులకు  పత్రం పంపాడు. గుఱ్ఱాలు కొనకుండా రాజదర్శనానికి ఎలా,వెడతారు? కొందామంటే కాసేదీ? ఏమి చేయడానికీ తోచక, శివసన్నిధిలో మొఱపెట్టుకున్నారు. శివుడు ఆ రాత్రి వారికి స్వప్నంలో తోచి, వెలలేని మాణిక్ష్యం ఒకటి యిచ్చి ' ఇది ప్రభువుకు ఇవ్వు. గుఱ్ఱాలు శ్రావణంలో మూలానక్షత్రం నాడు  రాగలవని చెప్పు ' అని సెలవిచ్చాడు. ఉలిక్కిపడి లేచి చూస్తే, స్వామి లేడు మాణిక్యం చేతులోనే ఉన్నది. మణివాచకులు ఆశ్చర్యానందపరవశులై తత్ క్షణం దుస్తులు తొడుక్కొని మధురకు వెళ్ళారు. మాణిక్యం మహారాజుకిచ్చి గుఱ్ఱాలు రాగల ముహూర్తం ముచ్చటించి, అవి ఎప్పుడు వస్తవా అని ఎదురుచూస్తూ మంత్రిపదాన్ని ఆశించక, శరీరం మధురలోను మనస్సు తీరుప్పెరుందరైలోను ఉంచుకొని కాలం గడుపుతూ వచ్చారు. పాండ్యుడు గూఢచారుల ద్వారా తిరుప్పెందురైలో గుఱ్ఱాలు లేవనీ, మణివాచకులు ధనమంతా ఆలయ కేంకార్యానికి వెచ్చించారనీ తెలుసుకొన్నాడు. వెంటనే వారిని చెఱసాలలో బందింది కష్టపెట్టాడు .

   (  ఇంకా ఉన్నది )

T.Me/BhagavanRaman

రమణాశ్రమ లేఖలు 146 మాణిక్యావాచకాలు.  21.9.47
https://bhagavanraman.blogspot.com/2019/04/146-21947.html
 
    ( తరువాత భాగము )
       ఇంతలో ముందు చెప్పినట్లే మూలానక్షత్రంనాడు ఈశ్వరుడు క్రూర మృగాలను గుఱ్ఱాలుగా మార్చి అశ్వరక్షక వేషంతో తానే తెచ్చాడు. రాజు ఆశ్చర్యమగ్నుడై అశ్వాలన్నీ ఒప్పించుకొని, అశ్వపాలకుల సలహా ననుసరించి తదితర అశ్వాలున్న శాలలోనే కట్టివేయించి, ఆ వేషధారిని సత్కరించి పంపి, వెంటనే మణివాచకులను చెఱనుండి విడిపించి, క్షమాపణ చెప్పుకున్నాడు. ఆ రాత్రికే గుఱ్ఱాలన్నీ క్రూరమృగాలుగా మారి శాలలో ఉన్న గుఱ్ఱాలన్నింటినీ మింగి నగరమంతా గగ్గోలు చేసి పారిపోయాయి. రాజు అతిశయించిన కోపంతో | మణివాచకులను మాయావిగా భావించి, మళ్ళీ ఖైదుచేసి, అనేక విధాల అలజడి కలిగించాడు. వెంటనే ఈశ్వరాదేశానుసారం వెఘానదిలో నీరు పొంగి మదు నగరమంతా ఆక్రమించసాగింది. రాజు భయపడి ఊళ్ళో వాళ్ళందరిని రప్పించి. వైఘకు కట్టపోయండని కట్టడిచేస్తూ, ఇంటికొక్కరి చొప్పున రావాలనీ ఒక్కొక్కరు ఇంతంత దూరం పోయాలని అలా చేయకుంటే దండన విధింపబడుతుందని కఠినంగా శాసించాడు.
https://www.facebook.com/359807631501891/posts/414964515986202/?app=fbl
    ఆ వూళ్ళో "పిట్టువాణి అమ్మైయార్" అనే ఒక అవ్వ ఉంది. ఆమెఏ రోజుకా రోజు ఆవిరి కుడుములమ్మి , జీవనం గడుపుతూ ఉన్న శివభక్తి పరాయణురాలగు సాదుజీవి. ఆమె ఇంటి వంతుకు పంపటానికి మనిషి లేడు. కూలిచ్చి ఎవరినైనా పంపుదమంట్టే చేతులో పైసా లేదు. “ ఏం చేతురా ఈశ్వరా ' అని విచారిస్తూ కూలబడ్డది. అది చూచి కరుణాళుడైన ఈశ్వరుడు కూలివాని వేషంతో పాఱా భుజాన పెట్టుకొని వచ్చి 'అవ్వా అవ్వా' అని పిలిచాడు. 'ఎవరు నాయనా అన్నదా అవ్వ. 'కూలీ కావాలా? ' అన్నాడు. కావాలిగానీ, చేతిలో చిల్లిగవ్వయినా లేదు నాయనా  అన్నదామె. 'డబ్బు వద్దు, ఏమీ వద్దుకానీ, నా కడుపు మాడుతోంది. నీవు చేసే కుడుముల్లో తుంపులుంటే ఇవ్వు. అవి తిని నీ ఇంటివంతు కట్ట పోస్తానవ్వా  అన్నాడా కూలి. ఆమె సరేనని కుడుములు పోయడానికి ఆరంభిస్తే అన్నీ తుంపులే అవుతూ వచ్చినవి. ' అయ్యో , అన్నీ తుంపులే ' అని గిన్నె చూస్తే పిండి తరగలేదు. ఆమె ఆశ్చర్యంతో ఆ తుంపులన్నీ కూలీకిస్తే తిన్నన్నీ తిని, మిగిలినవి మూటకట్టుకొని కట్ట పోస్తానని వెళ్ళాడు. వెళ్ళినవాడక్కడ పనిచేయక పాఱా తలక్రింద పెట్టుకొని పాడుతూ పడుకొని తానేకాక ఇతర కూలీలనూ చెడగొట్టుట ఆరంభించాడు.
      https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
     " కట్ట ఎంతవరకయిందో చూచుకొంటూ రాజు వస్తే       ఆ అమ్మైయారు వంతు అలాగే ఉంది. అదేమని విచారిస్తే అక్కడి రాజభటులు ఆ కూలివాని చేష్టలన్నీ చెప్పారు. రాజు మండిపడి కూలివాడైన పరమేశ్వరుణ్ణి పిలిచి ' కట్టపోయకుండా మొద్దల్లె పడుకొని పాడతావా ' అని చేతిబెత్తంతో వీపుమీద బాదాడు. ఆ దెబ్బ కొట్టిన రాజుమీదనే కాక సమస్త జీవుల మీద పడ్డది. రాజు వెంటనే తనచేత కొట్టబడ్డవాడు పరమేశ్వరుడేనని తెలుసుకొని భయభ్రాంతుడై నిలిచాడు. పరమేశ్వరుడు అదృశ్యుడై ' ఓ రాజా ! మణిక్యవాచకుడు నా ప్రియభక్తుడు. అతని మహిమ విస్తరించడానికే ఇదంతా కల్పితమయింది. అతణ్ణే శరణు చెందు అన్న అశరీరవాక్కు వినపడ్డది. ఆ వాక్కు వినగానే రాజు మణిక్యవాచకుల వద్దకు వెళ్ళాలని బయలుదేరి, మార్గంలోనే వున్న పిట్టువాణిని  ముందు చూద్దామని ఆమె ఇంటిముందు ఆగాడు. అప్పటికే విమానలో కైలాసానికి పోతోందామె. రాజు ఆశ్చర్యంతో ఆమెకు నమస్కరించి, మణివాచకుల సన్నిధికి వెళ్ళి పాదాలమీద పడ్డాడు.
 
    వారెంతో ఆదరంతో లేవదీసి కుసలమడిగి మన్నిస్తే రాజు ' నా అపరాధాలన్నీ క్షమించి ఈ రాజ్యం పరిపాలించమని, ప్రార్ధించాడు. మణివాచకులు రాజును అనుగ్రహదృష్టితో చూస్తూ అప్పా నేను ఈశ్వర దాసత్వం అంగీకరించినందువల్ల రాజ్యాంగతంత్రంలో ప్రవేశింపలేను. అన్యథా భావించకు. సుఖంగా ప్రజలను పాలించు. నీకిక ఏ  కొఱత ఉండదు ' అనీ లాలించి చెప్పి , తాము పరివ్రాజక వేషంతో బయలుదేరి అనేక పుణ్యస్థలాలు సందర్శిస్తూ ఆయా దేవతలను గుఱించి పధ్యపదికాలు పాడడం ప్రారంభించారు. ఆ కథలు ఎన్నో ఉన్నవి. ”
   
  “ తిరువాచకం రాసిందెప్పుడు ? ” అన్నాను. “ ఊ , వారెక్కడ రాసారు. వారిది  అతీతస్దితి. పాడుకుంటూ పోవడమే వారి పని ” అన్నారు భగవాన్ "అయితే, తిరువాచకం ఏవిధంగా ఏర్పడ్డది? " అన్నాను. “అదా, వారు క్షేత్రాటనం చేస్తూ పోయి పోయి, కడపట చిదంబరం చేరుకొని నటరాజ ఆనంద తాండవదర్శనంచేస్తూ మానవుల మనస్సు ద్రవించేలా పాటలు పాడుతూ అక్కడే నిలిచిపోయారు.
 
     అప్పుడు శ్రీనటరాజమూర్తి మణివాచకుల మహిమ జనులకు తెలియ జేయాలనీ, తిరువాచకమనే ఉత్తమ గ్రంథం లోకానికి అనుగ్రహించాలనీ తలపెట్టి ఒకరాత్రి బ్రాహ్మణరూపంతో మణివాచకుల మఠానికి వెళ్ళాడు. ఆదరపూర్వకంగా వారాదరించి “ వచ్చిన కార్యమేమీ ? ' అని అడిగితే ఆ వేషధారి దైవం నవ్వుతూ చాలా స్వతంత్రంగా ' ఏమయ్యా , నీవు ఆశువుగా కవిత్వం చెపుతూ ఎక్కడెక్కడో ఏవేవో పాడావటే. ఇక్కడ కూడా పాడుతున్నావట. నేను వినవచ్చునా ? ఎన్నాళ్ళనుండో రావాలనీ, వినాలనీ అనుకుంటున్నాను. ఏమాత్రం తీరిక లేకపోయింది. పగలు వచ్చేందుకు వీలుపడక రాత్రివేళ వచ్చాను. నిద్రాభంగం కాదు కదా ? ఏమంటావు ? పాడగలవా ? అన్నీ జ్ఞాపకమున్నవా ?  అన్నాడు. నిద్రకేమితొందరలేదు. జ్ఞాపక మున్నంతవరకూ పాడతాను, వినండి అని మణివాచకులు తన్మయులై పాడుతూ ఉంటే, ఆ విప్రవేషధారి తాళపత్రాల మీద రాస్తూ కూర్చున్నాడు. తన్మయంతో పాడుతున్న మాణిక్య వాచకులకు ఆ విషయం తెలియనే తెలియదు అలాగే పాడుతూ పాడుతూ స్వస్దితిలో లీనమై వారు మౌనం వహించడం  ఆ విప్రుడు అదృశ్యం కావడం జరిగింది.
    
    తెల్లవారగనే శ్రీ నటరాజమూర్తికి ప్రాతఃకాల పూజారులు నడిపే నిమిత్తం దీక్షితులు వచ్చి తలుపులు తీయగానే నటరాజసన్నిధిలో గడపమీద ఒక తాళపత్ర గ్రంథం కనిపించింది. తీసిచూస్తే  'తిరువాచకం ' అని రాసి ఉండడమేకాక, మణివాచకులు చెప్పగా తాను రాసినట్లు “ తిరుచ్చిట్రంబలం ' ( శ్రీచిదంబరం ) అనే నటరాజమూర్తి ముద్రగూడా దానిమీద ఉంది. ఆశ్చర్యంతో ఆ దీక్షితులంతా గుంపుకూడుకొని ఈ వింత సమాచారం ఏమిటో ఆ మణివాచకులనే అడిగి తెలుసుకొందామని వారివద్దకు వచ్చి తిరువాచకం, నటరాజమూర్తి సంతకం చూపి ' అయ్యా ! దీని తాత్పర్యం ఏమిటి ? అని అడిగారు.

     మణివాచకులు మారుమాట చెప్పక, వారందరినీ తనతో రమ్మని, శ్రీనటరాజ సన్నిధికి వెళ్ళి ఆ మూర్తికి ఎదురుగా నిల్చి, “అయ్యా! ఇదిగో ఇక్కడ అనుగ్రహించి ఉన్న ఈ నటరాజమూర్తియే దీనికి తాత్పర్యం, ఇతడే దీనికి అర్థం ” అని చూపి చెప్పి, తత్ క్షణం జ్యోతిరూపంతో ఆ నటరాజమూర్తిలో ప్రవేశించి లీనమై పోయారు " అంటూ భగవాన్ గద్దదకంఠులై మాట పెగలక మౌనం వహించారు.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ