రమణాశ్రమం లేఖలు 145 అరుణాచలం 20.9.47

రమణాశ్రమం లేఖలు 145  అరుణాచలం 20.9. 47 https://bhagavanraman.blogspot.com/2019/04/145-209-47.html
      నాలుగైదు రోజుల క్రితం కొందరు భక్తులు గిరిప్రదక్షిణం వెడుతూ రమ్మని పిలిస్తే , భగవాన్ సెలవు పొంది వెళ్లాను. అడి  అణ్ణామలకు చేరేసరికి వర్షం రావడం వల్ల రోడ్డుకు సమీపంగా ఉన్న ఒక చిన్నమఠంలో అంతా కూర్చున్నాం. అక్కడ ఉన్న సాధువుతో "ఈ మఠం ఎవరిది ?" అన్నాను. "మాణిక్యవాచకులది" అన్నాడతడు. "ఇక్కడ ఇది ఏ కారణం వల్ల ఏర్పడింది?" ఏవో కథలు చెప్పాడతడు. నాకు అర్థం కాలేదు .భగవాన్తో మనవి చేసి తెలుసుకోవచ్చునని  ఊకొట్టి ఊరుకొన్నాను.
https://www.facebook.com/359807631501891/posts/416010772548243/?app=fbl
      సమయం చూసి శ్రీవారనడగాలని చూస్తూంటే, నిన్న బ్రహ్మవైవర్త పురాణాంతర్గతమైన కాళేశ్వర మహత్యంలో సుందరమూర్తి కథ చదుకుంటూ కూర్చున్నారు భగవాన్. సుందరులు కాళీశ్వరాలయం ప్రవేశార్ధం వెళ్ళి గజపుష్కరిణిలో స్నానానికి మునిగి లేచేసరికి కోవెల అదృశ్యం కావడం ."ముందే నిన్ను సేవించరానందుకు ఇది ఫలమా?'అనే అర్థం గల పద్యాలు పాడగానే , కోవెల  గోచరించడం ఇత్యాది కథాభాగం  పైకి చదివి "వారికి (సుందరులకు) ముందు అంతా జలమయంగా తోచి , వెనక జ్యోతిరూపంగా కనిపించిందట " అని చెప్పారు భగవాన్.
    
            "అరుణాచలంకూడా  జ్యోతిరూపమే అని అంటారు గదా ?" అన్నారొక భక్తులు ." అవును మాంసనేత్రాలకే శిలాకా‌రంగాని , అసలు జ్యోతిరూపమే" అన్నారు భగవాన్ . అదే సమయం అని "అడి అణ్ణామలలో మణివాచకల  మఠం అని ఒకటి ఉన్నదే. అక్కడ అది ఏర్పడటానికి కారణం ఏమో ?" అన్నా నేను.అదా! వారు క్షేత్రాటన చేస్తూ , ఇక్కడికిన్నీ వచ్చారుట. అప్పుడు ఆస్థలంలో నిలబడి అరుణగిరిని చూస్తూ 1. తిరువెణ్బావ పాటలు 2 'అమ్మానే' అనే  పాటలు పాడినారినీ , అందువల్ల ఆ మఠం  ఏర్పడిందినీ అంటారు. తిరువెణ్బావై  పాటలు కొన్ని విన్నారు గదా,అవి  ఇరువది పాటలు . ఆండాళ్లు కృష్ణుని గురించి  ముప్పది పాటలు పాడింది .ఆవిధంగానే నన్ను గురించి మురగనారున్నూ చాలా  పాడారు "అన్నారు భగవాన్.
           
            "ఈ గిరికి  'అణ్ణామల' అన్న పేరు ఎందుకు వచ్చింది ?" అన్నారొకరు." బ్రహ్మ విష్ణువులకు అందని -మల( కొండ ) అణ్ణామల అంటే వాక్కుకు , మనస్సు కు అందని జ్యోతిస్వరూపం అన్నమాట. అందని మల - అణ్ణామల . అదే  ఆ పేరుకు కారణం " అన్నారు భగవాన్ . "ఈ గిరికి  ఒక ఆకారం ఉన్నది గదా? "అన్నారా భక్తులు."  బ్రహ్మ విష్ణువులకు గోచరించినప్పుడు ఒకే జ్యోతిస్తంభంగా అంతటా ఆవరించినట్లున్నది. కొండగా గోచరించడం వెనక గదా. ఇది ఈశ్వరుని స్థూల రూపం .జ్యోతిస్సే సూక్ష్మరూపం. వీటన్నిటికీ పరమైనదే యదార్థ స్వరూపం . సూక్ష్మమంటే అంతటా నిండి ఉన్న తేజస్సే అన్నారు భగవాన్. "సుందరమూర్తికి అంతేనా ?" అన్నారా భక్తులు ."అవును. ముందు జలమయమూ, వెనుక జ్యోతిగా తోచి ఆ వెనక మాంసనేత్రాలకు కోవెలగా గోచరించింది. మహాత్ములెప్పుడూ అంతర నేత్రాలతోనే చూస్తారు. అందువల్ల వారికి సర్వం  జ్యోతిర్మయముగాను, బ్రహ్మమయంగాను తోస్తుంది." అన్నారు భగవాన్. "అరుణాచలం లింగోద్భావాన్ని గురించి భగవాన్ ఒక పద్యం రాశారు కాబోలేే? "అన్నా  నేను. అవును విక్రమ సంవత్సరం శివరాత్రికి ఎవరో అడిగితే వ్రాశాను తెలుగులో కూడా వ్రాసానేమో?"   అన్నారు భగవాన్. "అవును ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం నాడు లింగోద్భవమైనదనీ, ఆలింగంలోనుండి బయల్వెడలిన శివ్వుణ్ణి విష్ణవు, దేవతలూ సేవించిన దినమే శివరాత్రియనీ అది కుంభమాసమనీ  ఆ పద్యంలో చెప్పారు .అందుకు మూలకథ ఏమిటి ? కృత్తికోత్సవ సందర్భం ఏమిటి ?"అన్నాను.
           
              అదా , బ్రహ్మ విష్ణువు బ్రహ్మ విష్ణువు 'నేను పెద్ద నేను పెద్ద ' కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంనాడు ఆ బ్రహ్మ విష్ణువుల మధ్యన జ్యోతిస్తంభం ఆవిర్భవించిందిట. అందువల్ల ఆ చిహ్నంగా ఆ నెలలో ఆ నక్షత్రంనాడు దీపోత్సవం జరుగుతున్నది . బ్రహ్మ విష్ణువూ  ఆ స్తంభానికి ఆదీ అంతం తెలుసుకోవాలని వెళ్లి వెతకి వెతకి  వేసట చెందినారా ?  గర్వవర్జతులై ఇద్దరూ ఒక చోటున చేరుకుని పరదైవాన్ని ప్రార్ధిస్తే ఆ జ్యోతిస్తంభాంతర్గతుడైన సదాశివుడు వారి దృష్టికి గోచరించి అనుగ్రహించాడనీ ,  వారు 'మాకు  సేవ్యమానుడవై ఉండాలని ' ప్రార్ధిస్తే  పర్వతాకారంగానూ ,  లింగాకారంగానూ ఉంటానని చెప్పి లింగార్చనా విధానం  బోధించి మీరందరూ లింగాకారంతో   ఉండే నన్ను అర్చిస్తే కొన్నాళ్లకు ఆ లింగంలో నా అంశం వల్ల శివమూర్తి రుద్రనామం లో వెలువడి  మీకు సహాయకారిగా ఉండగలడనీ  చెప్ప అంతర్హితుడైనాడు. ఆ వెనక ధనుర్మాసములో ఆర్ద్రా నక్షత్రంనాడు జ్యోతిర్లింగమైన  అరుణగిరి నుండి స్వయంభూలింగం ఆవిర్భవించిందని నాటినుండి ఈశ్వరాదేశానుసారం వారందరూ లింగార్చన విధిని  అనుష్ఠిస్తూ రాగా కుంభమాసంలో కృష్ణపక్షం త్రయోదశినాడు ,.అర్ధరాత్రివేళ ఆ లింగంలో నుండి శివమూర్తి ఆవిర్భవించి హరి , సరులచేత సేవించబడటంవల్ల ఆ దినమే 'శివరాత్రి' అనీ, లింగపురాణంలోనూ ,శివపురాణంలో  చెప్పి ఉన్నది. నాటి నుండే లింగార్చన విధానం ఆరంభమైనదట.  ఈ అరుణాచల  లింగోద్భవమే ప్రధమ  లింగోద్భవమని స్కాందపురాణంలో  దృఢంగా చెప్పిఉన్నది . నా పద్యానికి మూల శ్లోకం లింగ పురాణాంతర్గతమే " అని సెలవిచ్చారు భగవాన్.

                   భగవాన్  పద్యం ఇది - (లింగోద్భవం)
                  
క. తొలి యరుణాచల లింగము
కలిగెను ధనువునెల నార్ద్ర ఘనలింగమునన్|
వెలువడు శివుని హరి  సురలు
గొలిచిన దినమె  శివరాత్రి. కుంభపు నెల నౌ||

                                                          (4-2- 41)
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ