రమణాశ్రమ లేఖలు 143 అమ్మ ప్రసాదం 14.9.47
రమణాశ్రమ లేఖలు 143 అమ్మ ప్రసాదం 14.9.47
https://bhagavanraman.blogspot.com/2019/04/143-14947.html
ఆశ్రమం లోనే పుట్టి పెరిగిన ఒక ఆంబోతును గత నెలలో నిరంజనానందం స్వామి మధుర మీనాక్షి దేవాలయానికి కానుకగా గత నెలలో పంపారు . అక్కడివారు దానికి బసవడని పేరు పెట్టి లక్షణంగా అలంకరించి ఇక్కడ నుండి తీసుకుని వెళ్లిన సాంబశివయ్యరు తో సహా ఫోటో తీయించి , ఆ ఫోటో, పూర్వకాలపు పట్టంచు శాలువా, విభూతి , కుంకుమ ఇత్యాది ప్రసాదాలు ఇచ్చి పంపగా వచ్చాడా అయ్యర్.
https://www.facebook.com/359807631501891/posts/417244379091549/?app=fbl
ఆగస్టు 15వ తేదీ స్వతంత్రదినం నాటి నుండి జనం జాస్తిగా ఉండటంవల్ల , పగలంతా జూబ్లీ హాలులోనే వుంటుంన్నారు భగవాన్ . ఈ ఉదయం నేను వెళ్లేసరికి భగవాన్ సావధానంగా కూర్చుని ఉన్నారు. పెద్ద పళ్ళెంలో శాలువా, విభూతీ, కుంకుమ మొదలైనవి పెట్టుకుని సాంబశివయ్యరు సన్నిధికి వచ్చారు .వారి వెనుకనే వచ్చిన బ్రాహ్మణులంతా "నకర్మణా నప్రజయా ధనేన " అంటూ మంత్రం చదివారు .అంతా నమస్కరించి లేచారు. భగవాన్ నావైపు చూచి "మన పసరాన్ని మీనాక్షి దేవాలయానికి పంపారు. తెలిసునా?" అన్నారు . తెలుసును అది వెళ్ళేనాడు పసుపు కుంకుమ ఇత్యాదులతో అలంకరించబడి ఉంటే 'ఏమిటి కారణం?' అని పశువుల కాపరిని అడిగి తెలుసుకున్నాను" అన్నాను.
https://chat.whatsapp.com/9E23uVu3DXLCfddwkl8vCp
భగవాన్ వారు తెచ్చిన పళ్ళెం ఆదరంతో పట్టుకుని విభూతీ, కుంకుమ, నుదట ధరిస్తూ 'ఇదిగో, ఇది మీనాక్షి ప్రసాదం' అన్నారు . అప్పటికే కంఠం గద్గదమైనది . ఇంతలో సాంబశివయ్యరు ఆ శాలవా భగవాన్ పాదాలమీద కప్పాడు. భగవాన్ కంపిత శరీరంతో దాన్ని తొలగిస్తే , పరిచారకుడది ఎత్తి కుడివైపున సోఫామీద కప్పాడు. భగవాన్ చేతితో ఆశలవా సవరిస్తూ మావైపు చూచి "తల్లి మీనాక్షి పంపిందిది , అమ్మ ప్రసాదం " అంటూ మాట పెగలక మౌనం దాల్చారు . కళ్ళు ఆనంద భాష్పములతో ఆవరింపబడి అనిమేషత్వం చెందివి. శరీరం అచలమయింది. ఆ దృశ్యం చూచి ప్రకృతియే నిశ్శబ్ధత చెందినట్లనిపించింది. అప్పుడు అందరి కన్నులు చెమ్మగిల్లినవి.
భగవాన్ తిరుచ్చుళిలో బాలుడై ఉండగా ఇంట్లో ఎవరో తమపై కోపించుకుంటే దేవాలయానికి వెళ్ళి సహాయాంబ చాటున కూర్చొని దుఃఖించారుట. ఆ యమ్మ వారిని ఏ విధంగా ఊరడించిందో ఏ ఆశ చూపిందో వారికే తెలియాలి . మూడేళ్లకు ముందు ఒకసారి డాక్టర్లు దంపుడు బియ్యం వండి పెడితే భగవాన్ శరీరానికి మంచిది అని అంటే ఆశ్రమవాసులు అంతా చేస్తామని శ్రీవారితో మనవి చేశారు ."అందరికీ అదే చేయగలరటయ్యా?" అని భగవాన్ అడిగితే "అది అసాధ్యం భగవాన్ వరకు తయారు చేయగలం స్వీకరించాలి " అని భక్తులు ప్రార్థించారు. భగవాన్ సుతారము సమ్మతించ లేదు. కడకు "అమ్మ కోవెలల్లో నివేదనకు విడిగా వండుతాము కదా . అది దంపుడు బియ్యంతో చేస్తాము అని స్వీకరించవలసిం" దాని ప్రార్థించారు . "అయితే ,సరి అది అమ్మ ప్రసాదంగా తింటాను " అని ఒప్పకొన్నారు భగవాన్. నాటినుండి అదే విధంగా చేస్తూ , ప్రసాదంగా పంక్తిలో అందరికీ కొంచెంగా వడిస్తూ వున్నారు .
గత వేసంగిలో రామస్వామి అయ్యరు కొడుకు పెళ్లి అయ్యింది. ఆ సందర్భంలో వారిక్కడ బిక్ష చేశారు. ఆనాడు అందరి ఆకుల్లో తెల్లని అన్నం , భగవాన్ ఆకులు ఎర్రధవుళుగా వున్న ఈ అన్నం చూచి "అయ్యో భగవాన్ ఆకులో ఆ అన్నం పెట్టారేమిటి ?"అన్నారయ్యర్. భగవాన్ మందహాసంతో " అమ్మ ప్రసాదం అండి ఇది దీనికేమి ? అమ్మ గుళ్ళో నైవేద్యానికని వండారు" అని పై సమాచారమంతా చెప్పి, మళ్ళీ "అమ్మ ప్రసాదమండీ యిది .అమ్మ ప్రసాదం గనుకనే సరేనని సమ్మతించాను " అని సెలవిచ్చారు.
"దేవాలయాలేమి , దేముళ్ళేమి , ప్రసాదాలేమి? అవన్నీ వదిలి వేశాము" అనేవారికి , ఇవన్నీ బోధలే కదా!
T.Me/BhagavanRaman
Comments
Post a Comment