రమణాశ్రమ లేఖలు 142 నిరాడంబరత 13. 9.47

రమణాశ్రమ లేఖలు 142 నిరాడంబరత 13. 9.47
https://bhagavanraman.blogspot.com/2019/04/142-13-947.html
    ఈ మధ్య అరవిందబోస్ బెంగుళూరు నుండి వెలగలవి కొన్ని పెన్సిళ్లు తెచ్చాడు. అవి శ్రీవారికి సమర్పించే నమస్కరించి , కుశల ప్రశ్నానంతరం "మహాప్రస్థానం " అనే పేరుతో ఇక్కడ కట్టబడ్డ తన బంగళాకు వెళ్ళాడు.
https://www.facebook.com/359807631501891/posts/417848135697840/?app=fbl
                   అతను వెళ్ళిన వెనుక భగవాన్ ఆ పెన్సిళ్ళు అటూ ఇటూ తిప్పీ , వ్రాసీ చూస్తూ వాటి మంచినంతా  వర్ణించి, కృష్ణాస్వామి చేతికి కృష్ణస్వామి చేతికి ఇస్తూ "ఇవి భద్రంగా దాచి  వుంచవయ్యా . జాగ్రత్త , మన సొంత పెన్సిల్  ఎక్కడో ఉండాలి అది చూచి తెచ్చి ఇవ్వు " అన్నారు. కృష్ణస్వామి అవి తీసుకుని భగవాన్ పక్కనే సోఫాకు ప్రక్కనే  టేబుల్ మీద ఉన్న సన్నది కొయ్యపెట్టి తెరిచి , అటు ఇటు వెతికి ఇంకొకటి మంచి పెన్సెలే తీసి ఇచ్చాడు.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
                    భగవాన్ అది  తిప్పి తిప్పి చూచి "ఇదెందుకయ్యోయ్. ఇది దేవరాజ మొదలియారుది . అసలు మన సొంత పెన్సిల్  ఉండాలి గదా , అది ఇచ్చి, ఇది గూడా భద్రంగా దాచిపెట్టు" అన్నారు .కృష్ణస్వామి అక్కడ ఎంత వెతికినా కనిపించలేదు . 'హాల్లో ఉన్నదేమో వెతకండి "అన్నారు భగవాన్ . ఒకరు వెళ్లి చూసివచ్చి "కనిపించ లేదు " అన్నారు . "అయ్యయ్యో అది మన సొంత పెన్సిలయ్యా . ఎక్కడ పోయిందో సరిగా చూడండి" అన్నారు భగవాన్ .  దేవరాజ మొదలయారు అక్కడే ఉండి "అదేమీ భగవాన్ , ఇవన్నీ మాత్రం స్వంతం కాదా?"  అన్నారు .

          భగవాన్ నవ్వుతూ "అది కాదండీ . ఇది మీరిచ్చారు ఇచ్చారు, అవి బోసు తెచ్చాడు. ఇవన్నీ ఖరీదు గలవి. ఏమరుపాటుగా వుంటే, ఎవరైనా ఎత్తుకు పోతారు. స్వామి అందరికీ ఉమ్మడియే గదా భగవన్ కు అని అంత ఖరీదు పెట్టి తెచ్చామే , పోయిందే  అని మీరు అనుకోవచ్చు . అదంతా ఎందుకు? మన సొంత పెన్సిలైతే ఎలా పెట్టుకున్నా బాధ లేదు. దాని వెల అర్థణా. ఐదీ కొన్నది  కాదు . ఎక్కడో దొరికిందని వీరెవరో తెచ్చి ఇచ్చారు. అది మనకు సొంతం. వీటన్నిటికి జవాబుదారీ చెప్పాలి. అది ఏమైంది అని ఎవరు అడగరు . అందుకనే అదే కావాలంటున్నాను. ఇవన్నీ గొప్పవారు వాడేవి. మనకెందుకు ? మనమేమీ పరీక్షలు ప్యాసు కావాలా?  ఉద్యోగాలు చేయాలా ? మన వ్రాతకు అది చాలును"  అని చెప్పి కడకు అది వెతికించి తెప్పించుకున్నారు భగవాన్ .

      కొంతకాలం క్రితం క్రిందట ఇటువంటిదే ఒక సంభవం జరిగింది. అది ఏమిటంటే ధనికులెవరో వెండిది కప్పు , సాసరూ, చెంచాతో సహా ఆఫీసు ద్వారా శ్రీవారి సన్నిధికి తెచ్చి "భగవాన్ ద్రవపదార్థం ఏదైనా పుచ్చుకునేటప్పుడు ఇవి ఉపయోగించవలసింది" అని సమర్పించారు. భగవాన్ అవి చూచి పరిచారకులకు  చేతికి ఇచ్చారు. ఆ వచ్చిన వారు వెళ్ళన వెనక , పరచారికడు అవి అక్కడ బీరువాలో పెట్టబోతూ  ఉంటే  భగవాన్ వారించి " అక్కడెందుకోయ్ ,ఆఫీసులోనే వుంచుకోమను " అన్నారు." భగవాన్ వాడుకొనేందుకని గదా వారిచ్చింది ?"  అన్నారొక భక్తులు. "సరిపోయింది ఇవన్నీ  ధనవంతులు  వాడేవి  . మనకెందుకు ? కావాలంటే మన సొంత కప్పులు చెంచాలు ఉన్నవి గదా అవి వాడుకోవచ్చును . ఇవెందుకు?"  అని ఆ పరిచారకునికి చూచి "ఏమోయ్ రేపటినుండి సొంత కప్పు వాడుకుందాం .తీసి ఇవ్వు"  అన్నారు భగవాన్ .సొంత కప్పేమిటి భగవాన్ ?" అన్నాడు ఆ భక్తుడు         

       
           " అదా. టెంకాయ చిప్పలు అరగదీసి నునుపు చేసి పెట్టుకున్నాం. నునుపు చేసి పెట్టుకున్నాం . అవే నాకు కప్పులూ చెంచాలూను . అవి మనకు సొంతం . అవి వాడుకుంటే సరిపోతుంది . ఇవి భద్రం చేయమనండి ” అన్నారు భగవాన్ . “ ఇవి మాత్రం భగవానుని కాదా ? ” అన్నాడా భక్తుడు . భగవాన్ నవ్వుతూ “ అది సరేనండీ . ఆ ఆడంబరమంతా మనకెందుకు చెప్పండి ? అవి ఖరీదైనవి . ఏమరితిమా ఎవరైనా ఎత్తుకొనిపోతారు . కాపలా కాయాలి . స్వామికి అదేనా పని ? అదేగాక స్వామికదా అడిగితే ఇవ్వడా ? అని ఎవరైనా అడగవచ్చు . కాదనేందుకు లేదు . ఇచ్చామా , స్వామికని తెస్తే ఎవరికో ఇచ్చారే అని వారనుకోవచ్చును . ఎందుకది ? మన సొంత కప్పులైతే ఎలా వాడుకున్నా , ఏం చేసినా ఫరవాలేదు ” అని చెప్పి ఆ వెండివి పంపి , సొంత కప్పులు తీయించి అందరికీ చూపించారు .

   ఆ రోజుల్లోనే ఉద్యోగస్తుడుగా వున్న ఒక భక్తుడు ఊరినుంచి భగవాన్ సన్నిధికి వస్తూ వెండి పొన్నులు వేసిన చక్కని చేతికట్టి ఒకటి తెచ్చి శ్రీవారికి సమర్పించాడు . భగవాన్ అటూ యిటూ తిప్పి చూచి " భేష్ , చాలా బాగున్నదండీ , భద్రంగా వాడుకోండి ” అని సెలవిచ్చారు . “ అయ్యో , నాకని కాదు , భగవాన్ వాడుకుంటారనే తెచ్చాను . ఉపయోగించాలి ” అన్నాడా భక్తుడు . “ సరిపోయింది . వెండి పొన్నులు వేసిన నాజూకు కట్టలు మీవంటి ఉద్యోగస్థులు వాడాలికాని నాకెందుకు ? అదుగో నా సొంత కఱ్ఱ వున్నది . అది చాలును ” అన్నారు భగవాన్ .        
         
       "అది శిధిలమైనప్పుడు ఇది వాడ వచ్చును గదా" అన్నారింకో  భక్తులు . ఈ అలంకారాలన్నీ మనకెందుకండోయ్ . కట్టెపేడు చెక్కితే క్షణంలో కర్ర అమరుతుంది . అది మనకు  మూడో కాలు. ఈ కట్టెకు ఆ కట్టె సహాయం . కొండ మీద ఉండగా ఎన్నో కట్టెలు కర్రలు గా చెక్కి  నునుపు చేసి ఉంచేవాణ్ణి . కానీ కూడా ఖర్చు లేదు. ఆ కర్రలు ఎందరో పట్టుకొని వెళ్లారు . మనకవి సొంతం.ఈ ఆడంబరాలన్నీ  మనకెందుకు ? మనం ఉద్యోగాలు చేయవలెనా? ఊళ్ళేలవలెనా ?  మనకది చాలును " అని చెప్పి వారి కర్ర  వారికిప్పించారు భగవాన్.

భగవాన్ నిరాడంబర వస్తువులు తప్ప తదితరములు వాడరు. కానీ కూడా ఖర్చుకాని వస్తువులు అంటే వారికి ప్రీతి.  
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ