రమణాశ్రమ లేఖలు 140. అంతా ఒకే నేను. 11-9 -47

రమణాశ్రమ లేఖలు  140. అంతా ఒకే  నేను. 11-9 -47
https://bhagavanraman.blogspot.com/2019/04/140-11-9-47.html
            నిన్న ఒక సాధువు వచ్చి హాల్లో కూర్చున్నాడు .  వాలకం చూస్తే ఏదో అడిగేటట్లు ఉన్నది. మధ్యాహ్నం మూడు గంటలు దాటిన వెనక, చల్లగా శ్రీవారిని సమీపించి "స్వామి ఆత్మ అంతటా ఉన్నదంటారే?  చచ్చిన శవం లో కూడా ఉంటుందా?" అని ప్రశ్నించాడు." ఓహో !అదా కావలసింది . ఈ ప్రశ్న చచ్చిన శరీరానికి వచ్చిందా ? మీకు వచ్చిందా?" అన్నారు భగవాన్ . "నాకే" అన్నాడతడు.
https://www.facebook.com/359807631501891/posts/418425075640146/?app=fbl
         " సుషుప్తిలో నేనున్నానా?  లేదా ? అన్న సందేహం నీకు వస్తుందా? లేచిన వెనుక గదా నేనున్నానంటావు? అదేవిధంగా శవంలోనూ ఆత్మ ఉండనే ఉంటుంది. యథార్థం విచారిస్తే చచ్చిన శరీరం లేదు. బ్రతికిన శరీరం లేదు .చలనం లేని శరీరం చచ్చిందంటాము చలనంతో ఉన్నది బ్రతికిందంటాము, అంతే. స్వప్నంలో చచ్చిన శరీరాలు, బ్రతికిన శరీరాలు ఎన్నెన్నో చూస్తున్నాం. జాగ్రత్త కలిగిన వెనక అవి అన్ని లేనివే . అదేవిధంగా ఈ చరాచర ప్రపంచం లేనే లేదు. చావంటే అహంవృత్తి  ఉపశమించుటయే. తిరిగి పుట్టడం అంటే అహంవృత్తి పుట్టడమే. ఈ జనన మరణములు  అహంకారానికేగానీ నీకేమీ లేవు. ఆ అహంవృత్తి ఉన్నప్పుడూ  నీవున్నావు. లేనప్పుడు నీ వున్నావు. వృత్తికి మూలం నీవు గాని .వృత్తి నీవు కావు .ముక్తి అంటే పైన చెప్పిన చావు పుట్టుకల మూలం తెలుసుకుని  ఆ అహంవృత్తిని సమూలంగా నాశనం చేయాలి . అదే ముక్తి . అంటే తెలివితో చావాలన్నమాట  అట్లా చేస్తే 'అహమహ' మనే  ఆత్మస్పురణగా అక్కడే పుడతాడు . ఆ పుట్టుక కన్నవారికి వారికి ఏ సందేహాలూ  వుండవు" అని సెలవిచ్చారు భగవాన్.

              నాలుగైదు రోజుల క్రితం వచ్చిన ఒక ఐరోపియన్ యువకుడు నిన్న సాయంత్రం ఊరికి వెళ్ళే నిమిత్తం మూటాముల్లె కట్టిపెట్టి వేద పారాయణానంతరం భగవానుని ఎన్నో విధాల ప్రశ్నించాడు. శ్రీవారు యధాప్రకారం "నీవుఎవరు? ఈ ప్రశ్నించేదెవరు ?"అనే ప్రశ్నలతోనే జవాబిచ్చారు . చివరకు ఆ యువకుడు "భగవానునకు గీతలో ఏ శ్లోకం  ప్రియం?" అని అడిగితే, "అన్నీ ప్రియమే" అన్నారు భగవాన్. "అందులో ముఖ్యమైనది ఏది ?" అని విడవకుండా అడిగాడతడు . భగవాన్ కొంచెం నిదానించి "అహమాత్మా గుడాకేశ" (అ-10 -శ్లో-20 ) అన్న శ్లోకం సూచించారు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
    ఆ యువకుడు ఆనందించి సెలవు పుచ్చు , కుంటూ "స్వామి!ఈ అసత్యమైన నేను ఉన్నదే , ఇది కార్యాంతరాలవల్ల  ప్రయాణం చేయవలసి ఉన్నది . తాము అనుగ్రహించి , ఈ అసత్యమైన నేను, ఆ సత్యమైన నేనులో ఐక్యమయ్యేట్లు  శిఫార్సు చేయాలని ప్రార్థన " అన్నాడు.  భగవాన్ చిరునవ్వుతో "ఇన్ని నేనులు ఉంటే కదా సిఫార్సుకు. అంతా ఒక్కటే నేను. సిఫార్సు చేసేందుకు చెప్పమనే  నేనొకటి , చెప్పే నేనొకటి వినే నేనొకటి ఉండాలి . ఇన్ని  నేనులు లేవే? అంతా ఒకేె నేనుగా ఉన్నదే. చెప్పేదివరితో ? వినేదెవరు ?" అన్నారు.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ