రమణాశ్రమ లేఖలు 139 ఉన్నచోటనే ఉండమను 10.9.47
రమణాశ్రమ లేఖలు 139 ఉన్నచోటనే ఉండమను 10.9.47
https://bhagavanraman.blogspot.com/2019/04/139-10947.html
ఈ ఉదయం తొమ్మిదీ ముప్పావుకు భగవాన్ బయటికి వెళ్లే నిమిత్తం లేవబోతుంటే కొత్తగా వచ్చిన ఒక ఆంధ్ర యువకుడు సోఫాదగ్గరకు వెళ్లి "స్వామి నేను తపస్సు చేసుకోవాలని వచ్చాను.ఏ స్థలం అందుకు యోగ్యంగా ఉంటుందో లేదో నాకు తెలియదు.ఏ స్థలంలో ఉండమని తాము సెలవిస్తారో ఆ స్థలంలోనే ఉంటాను" అన్నాడు. భగవాన్ ఏమీ చెప్పలేదు. అతడు అట్లాగే నిలబడ్డాడు. భగవాన్ కాళ్ళు సర్దుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ఏదో అంటారని ఎదురుచూస్తూ ఉన్నాం. కర్ర పట్టుకుని లేస్తూ,అనుచరుని చూచి"ఏ స్థలంలో ఉండమంటారు అంటే ఏం చెప్పేది? ఏ స్థలంలో తాను ఉన్నాడు ఆ స్థలం లోనే ఉండటం మంచిది ఉన్న చోటనే ఉండమను" అంటూ లేచి నవ్వుతూ వెళ్లారు.
https://www.facebook.com/359807631501891/posts/420011932148127/?app=fbl
ఆ యువకుడు చిన్న పుచ్చుకొని "ఇదేమిటండీ ఉన్న చోటనే ఉండమంటారు ఏదో పెద్దలు గదా, యోగ్యస్థలం నిర్ణయిస్తారు అని అడిగితే "ఏ స్థలంలో తాను ఉన్నాడో ఆ స్థలంలోనే ఉండమను అంటారే! ఇప్పుడు ఈ సోఫా దగ్గర ఉన్నాను. ఇక్కడే ఉండమనా అర్థం?ఇందుకా అడిగింది. ఇది చెర్లాటలా ఏమి?"అని కటకటపడ్డాడు. ఒక భక్తుడు అతన్ని బయటకు తీసుకుని వెళ్లి "అయ్యా భగవాన్ చలోక్తిగా చెప్పినా,చెర్లాటగా మాట్లాడిన ఆ వాక్కులో యదార్థమే వస్తుంది. 'నేను' - అనే అహంవృత్తి ఏ స్థలంలో పుడుతుందో ఆ స్థలమే తాను. ఆ తానుండే స్థానం తెలుసుకుని తాను తానుగా నిలుచుటే తపస్సు. అందువల్ల తానెవరో తెలసుకోవాలిగాని ఏ స్థలంలో ఉంటే ఏమి? అని ఆ మాటలకు అర్థం" అని చెప్పి సమాధానపరచి పంపాడు.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
నిన్ననొకరు ఇట్లాగే "స్వామీ, ఆత్మను ఏ విధముగా తెలుసుకోగలం?" అని అడిగారు.'ఆత్మలోనే నీవున్నావే తెలియకేమి?'అన్నారు భగవాన్.ఆత్మలోనే నీ వున్నా వంటున్నారు. అసలు ఆత్మ ఎక్కడ ఉన్నది?" అన్నారా పృచ్ఛకులు."నీ హృదయంలోనే ఉన్నది నీవు అందులో నిలకడగా ఉండి చూస్తే తెలుస్తుంది" అన్నారు భగవాన్."నా హృదయంలోనే నేను నిలకడగా ఉండేందుకుస్థలం లేదే" అన్నారు.
భగవాన్ మందహాసంతో సమీపంలో కూర్చున్న రామచంద్రయ్యరును చూచి "ఇదిగోనోయ్ చూడూ - ఆత్మ ఎక్కడ ఉన్నదీ, ఎక్కడ ఉన్నదీ అంటూ ఆందోళన పడతారు. ఏం చెప్పేది. ఉన్నదే ఆత్మ; అది సర్వత్రా నిండి ఉన్నది; దాన్నే హృదయం అంటారయ్యా. అంటే 'నా హృదయంలో నేను నిలకడగా ఉండేందుకు స్థలం లేదే ఏం జేసేది?' అంటారు. లేనిపోని వాసనలతో తన హృదయం (మనస్సు) నింపుకుని స్థలం లేదు, స్థలం లేదు అనటం లంకంత ఇల్లుంచుకుని కూర్చునేందుకు స్థలం లేదని గునిసినట్లుంటుంది. సామానంతా తీసి బయట వేస్తే స్థలం ఎందుకు ఉండదు? తనకు శరీరమే ఒక సామాను.ఆ శరీరాన్ని అంటని కానిపోని సామానుతో గదులన్నీ నింపి శరీరాన్ని పడవేయడానికి స్థలం లేదట.వీరనేది అంతే. తనవికాని నానావిధ వాసనాసామాగ్రితో హృదయం (మనస్సు) అంతా నింపి 'తాను' ఉండేందుకు స్థలం లేదట. వాసనలన్నీ ఊడ్చి పారవేస్తే అంతా స్థలమే. అంతా ఆత్మేగదా. అప్పుడు తానంటు వేరుగా ఉండనే ఉండడు. ఇక స్థలం ఎక్కడ? ఉండేది ఎవరు? అది విచారించక కళ్ళు మూసుకొని సూర్యుడు లేడు అన్నట్లు స్థలం లేదే?స్థలం లేదే?అంటారు. ఏం జేస్తాం" అని సెలవిచ్చారు.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment