రమణాశ్రమ లేఖలు137- స్వప్నాత్యంత నివృత్తి 6.9.47.
రమణాశ్రమ లేఖలు137- స్వప్నాత్యంత నివృత్తి 6.9.47
https://bhagavanraman.blogspot.com/2019/04/137-6947.html
గత మాసంలో వదిన ఇక్కడ ఉండగా తెలుగు విచార మణిమాల ప్రూవ్ వచ్చింది భగవాన్ దిద్ధి మధ్యాహ్నం మూడింటికి నాకు ఇచ్చారు వదిన ప్రూఫ్ చదివి అందులో 'స్వప్నాత్యంత నివృత్తి' అనే పదానికి అర్థం నన్ను అడిగింది నాకు సరిగ్గా తెలియక ఏమో చెబితే ఆమెకు నచ్చలేదు. భగవాన్ అది చూచి "తప్పులు ఏమైనా ఉన్నవా ఏమి?" అన్నారు. "లేదు 'స్వప్నాత్యంత నివృతి' అంటే అర్థం ఏమిటని అడుగుతున్నది," అన్నాను. కరుణతో స్వప్నాత్యంత నివృత్తి అంటే స్వప్నమే లేని స్థితి అన్న మాట' అన్నారు భగవాన్. "అదా అర్థం. జ్ఞానులకు అసలు స్వప్నమే లేదంటారా?" అన్నాను. "అవును" అన్నారు భగవాన్ వదినకు ఇంకా సందేహం తీరలేదు. వేరే ప్రసంగం రావటం వల్ల ఈ ప్రశ్న అంతటితో ఆపాము. " వాసిస్ఠం లో జ్జాని గమనాగమనాలు చేస్తున్నట్లు ఇతరులకు తోస్తుందే గాని, వారికి ఏమీ అంటవని చెప్పి ఉన్నదే దాని భావం కూడా శ్రీవారిని అడిగితే బాగుండేది" అని రాత్రి నాతో అన్నది వదిన. "భగవాన్ కరుణామయుడు కదా ఏదో విధంగా అవకాశం కల్పించి నీ సందేహం తీర్చగలరు" అని సమాధాన పరిచాను.
https://www.facebook.com/359807631501891/posts/421125555370098/?app=fbl
మరునాడు ఉదయం 8గంటలకు మేమిద్దరం వెళ్ళాం సుందరేశయ్యర్ ఈ స్వప్నాంత్యంత నివృత్తిని గురించే అడగటం భగవాన్ బదులీయడం జరుగుతున్నది. సందు దొరికిందే చాలని " స్వప్నాత్యంత నివృత్తి అంటే స్వప్నమే లేని స్థితి అని భగవాన్ సెలవిస్తున్నారే , జ్జానికి అసలు స్వప్నమే రాదా? " అన్నది వదిన. "అవును స్వప్నమే కాదు, జాగృత స్వప్న సుషుప్తులు మూడూ లేవన్నమాటే. మూడవస్థలూ లేని స్థితి ఏదో అదే జ్జాని యొక్క యథార్థ స్థితి "అని సెలవిచ్చారు భగవాన్. "జాగ్రదావస్థ కూడా సప్న తుల్యమే కదా "అన్నాను నేను." ఆ-- స్వప్న తుల్యమే అది క్షణిక స్వప్నం ఇది దీర్ఘకాల స్వప్నం అంతే " అన్నారు భగవాన్. " సుషుప్తినీ స్వప్నమంటారా?" అన్నాను. " లేదు. అది విషయమే, తోపకపమే (దృశ్యమే) లేనప్పుడు స్వప్న మనడం ఎట్లా? అయితే అది ఏమీ తెలియని స్థితి గనుక అవిద్య ఉన్నది. అందువల్ల అది తోసివేయవలసిందే" అన్నారు భగవాన్. " సుషుప్తిని కారణస్వప్నం అనటం కద్ధా " అన్నాను. " ఏదో పరిభాషకు కొందరు ఆ విధంగా చెప్పవలసిన చెప్పారే కానీ వేరే ఏమీ లేదు. క్షణికం దీర్ఘం, స్వప్న జాగ్రదవస్థలకే. అయితే ఇన్నేళ్లు బ్రతికామే,ఇళ్ళూ వాకిళ్ళు ఇవన్నీ ఇంత స్పష్టంగా కళ్ళకు కనబడుతున్నవే, ఇదెలా స్వప్నమౌతుంది అంటే , నిదురలో స్వప్నం కూడా దీర్ఘంగా ఉన్నట్లే తోస్తుంది లేచిన తరువాత కదా క్షణికమని తెలియటం ? అదే రీతిగా జ్ఞానం కలిగితే, ఇదీ క్షణికంగానే తోస్తుంది. అందువల్ల అందువల్ల 'స్వప్నాత్యంత నివృత్తి 'అంటే అవిద్య పూర్తిగా రాకుండా పోవాలన్న మాట. అత్యంత నివృత్తి, రవ్వంత కూడా స్వప్నం రాని స్థితి " అని సెలవిచ్చారు భగవాన్ .
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
" సుషుప్తిలో ఉన్న అందమే సమాధిలో పొందాలని, సుషుప్తిలోనూ అవిద్య ఉండనే ఉన్నది కదా, అది ఎలా పొసగుతుంది?" అన్నది వదిన. అందుకే సుషుప్తిని కూడా తోసి వేయాలన్నారు. సుషుప్తిలో తాను ఆనందమయుడిగా ఉన్నప్పటికీ ఉన్నానన్న తెలివి లేదు కనుక దాన్నీ తోసి వేయాలి. అయితే ఆ ఆనందం ఎలా తెలుసుకోవడం అంటే 'నేను సుఖంగా నిద్ర పోయాను, ఆనందంగా ఉన్నది' అని లేచిన తర్వాత అంటారు గదా. ఆ ఆనందమే జాగ్రత్తలో అనుభవించాలి అదే సమాధి" అన్నారు భగవాన్. "జాగ్రత్తతో నిద్రపోవాలి అన్నమాట"అన్నాను నేను. "అవును అంతే " అన్నారు భగవాన్.
" జ్జాని గమనాగమనాదులు చేస్తున్నట్లు ఇతరులకు తోస్తుందేగాని వారికి ఏమీ లేవని వాసిస్ఠంలో చెప్పారే దృష్టి భేదం వల్ల ఇతరులకు ఆ విధంగా తోస్తుందా? నిజంగా వారికి అంటవా?" అన్నది వదిన. "చూసే వారి దృష్టిని అనుసరించి ఆ విధంగా తోస్తుంది. వాస్తవంగా వారిని అంటనే అంటవు" అన్నారు భగవాన్.
" స్వప్న దర్శనాలు, సాక్షాత్కారాలు అంటారే, అవన్నీ ఏమిటి ?"అన్నది. " జ్ఞాని దృష్టికి అవన్నీ ఒకటిగానే తోస్తవి." అన్నారు భగవాన్. "గణపతి మునికి తిరువత్తూరులో భగవాన్ దర్శనమిచ్చి అనుగ్రహించిన విషయమై భగవానుకున్నూ అదే వేళకు అక్కడికి వెళ్లి అనుగ్రహించినట్లు తోచిందని చరిత్రలో రాసారే ? అదేమిటి?" అన్నది మళ్ళీ. "అటువంటివే దివ్యదర్శనాలని లోగడ చెప్పి ఉన్నా" అంటూ మౌనం వహించారు భగవాన్.
Comments
Post a Comment