రమణాశ్రమ లేఖలు. 136. మౌనముద్ర 3.9.4

రమణాశ్రమ లేఖలు. 136. మౌనముద్ర 3.9.4
https://bhagavanraman.blogspot.com/2019/04/136-394.html
     అన్నా ,
    ఈ మధ్యాహ్నం మూడింటికి భగవాన్ సన్నిధికి వెళ్లాను. ఇష్టాగోష్టిగా సంభాషణ జరుగుతున్నది. ప్రసంగవశంగా భగవాన్ "శంకరులు దక్షిణామూర్తి అష్టకం మూడు భాగాలుగా విభజించి వ్రాశారు" అని లోగడ చెప్పినట్లే చెప్పి, శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం చేయాలని సంకల్పించారు. మౌనాన్ని ఏమని స్తుతిస్తారు అందువల్ల సృష్టి , స్థితి , లయాలను విభజించి చెప్పి, వీటన్నిటికీ విలక్షణమైన దక్షిణామూర్తికి నమస్కరిస్తాను. అని చెప్పారు. అంతకంటే మౌనాన్ని స్తుతించేదెట్లా?" అన్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/421662671983053/?app=fbl
   ఒక భక్తుడందుకుని "పూర్వం,  ఒక శివరాత్రినాడు భక్తులంతా భగవానుని చుట్టూ చేరి ఈనాడు భగవాన్ దక్షిణామూర్తి అష్టకాన్ని అర్థం చెప్పాలి' అని కూర్చుంటే, భగవాన్ మందహాసంతో మాట్లాడకుండా ఊరుకున్నారనీ, వారంతా కొంతసేపు చూచి ఈమౌనమే మనకు కూడా బోధ కాబోలని అనుకుంటూ లేచి వెళ్లారని దండపాణి స్వామి చెప్పారు. నిజమేనా?"    అన్నారు. భగవాన్ చిరునవ్వుతో  "ఊ-నిజమే" అన్నారు. నాకు ఆశ్చర్యం కలిగి "భగవాన్ మౌనవ్యాఖ్యానం చేశారా?" అన్నాను. "ఔను మౌనవ్యాఖ్యానమే", అన్నారు భగవాన్. 
   https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
          ఇంకొకరు "మౌనం అంటే ఆత్మస్ఫూర్తియే గదా?" అన్నారు. "అవునండీ, ఆత్మస్ఫూర్తి లేనిదే మౌనమెలాగవుతుంది?" అన్నారు భగవాన్. "అదే నేనడుగుతూ వున్నాను.ఆ ఆత్మస్పూర్తిని చెందక నోరు మూసుకుని మాట్లాడకుండా ఉన్నంతమాత్రాన మౌనం అవుతుందా?" అన్నారు వారు. "అదెట్లా పొసగుతుంది. కొందరు, మౌనం,మౌనం అంటూ కాగితం మీద వ్రాసి చూపుతారు. 'అదంతా వ్యవహారం కాదా ఏమి?' అన్నారు భగవాన్. "అయితే,వాజ్ఞ్మౌనం వల్ల ప్రయోజనమే లేదా?" అని ప్రశ్నించారు మరొకరు. "బాహ్య ప్రతిబంధక నివారణార్ధం వాజ్ఞ్మౌనం అవలంబించినా అదే యథార్థమౌనమని అనరాదు . మౌనమంటే ఎడతెగని భాషన్నమాట. దాన్ని పొందడం అనేది లేదు. సదా ఉండేదే, మరుగుపరిచే విషయవృత్తులను తోసివేయాలి గాని, దాన్ని పొందటానికి ప్రయత్నం అనవసరం" అని సెలవిచ్చారు భగవాన్.

          ఇంతలో భగవాన్ మాట్లాడే ధ్వని రికార్డు చేసుకోవాలని ఒక రేడియో కంపెనీవారు యోచిస్తున్నారన్న  గాలి వార్త వచ్చింది . భగవాన్  నవ్వుతూ "ఓహో!అట్లాగా,నా మాట మౌనమేకదా. మౌనాన్ని ఏ విధంగా రికార్డు చేస్తారబ్బా?  ఉన్నది మౌనమేనాయె . దాన్ని  రికార్డు చేయటం ఎవరి వశం?" అన్నారు. సభ్యులంతా ఒకరి వంక ఒకరు చూచుకుంటూ ఊరుకున్నారు . హాలంతా నిశ్శబ్దమైయింది.  దక్షిణామూర్తి స్వరూపులైన భగవాన్ దక్షిణాభిముఖంగా కూర్చుని, మౌనముద్ర ధరించారు. ఆత్మజ్యోతి ప్రకాశం వెల్లివిరిసిందా అన్నట్లు దేదీప్యమానమైన కాంతితో విరాజిల్లుతూ ఉన్నది, ఆ మూర్తి. 'స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే'. నేడెంత సుదినమో!           
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ