రమణాశ్రమ లేఖలు 135 శ్రవణ మననాదులు19.7.47

రమణాశ్రమ లేఖలు 135 శ్రవణ మననాదులు19.7.47
https://bhagavanraman.blogspot.com/2019/04/135-19747.html
         నిన్న కుంభకోణం నుంచి ఇద్దరు పండితులు వచ్చారు. వారీ ఉదయం తొమ్మిది గంటలప్పుడు శ్రీవారిని సమీపించి "స్వామి సెలవు పుచ్చుకుంటాం. మనస్సు  శాంతిలో అణగునట్లు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం" అన్నారు. భగవాన్ సెలవు చిహ్నంగా తల ఊపారు.  వారటు పోగానే  సమీపంలో ఉన్న రామచంద్రయ్యరును చూచి "శాంతియే స్వరూపం. పైన వచ్చేదంతా తోసివేస్తే, ఉండేది శాంతే. ఇక అణిగేందుకు కేమున్నది? పైన వచ్చేది తోసివేయాలి. పక్వచిత్తులైతే శాంతియే స్వరూపంరా అంటే చాలు, జ్ఞానం కలుగుతుంది. అపక్వచిత్తులకే శ్రవణమననాదులు చెప్పారుగాని, పక్వచిత్తులకు పని లేదు. దూరంలో ఉన్న వారు రమణ మహర్షి వద్దకు ఎట్లావెళ్లాలని అడిగితే ఆరైలెక్కి, ఈరైలెక్కి, అదీ దోవ అని చెప్పాలిగాని, తిరువణ్ణామలకు వచ్చి రమణాశ్రమం చేరి హాలులో అడుగుపెట్టిన వెనక ఇదిగో వీరే వారు అంటే చాలును. మరి కదలవలసిన పనిలేదు" అన్నారు భగవాన్. 
https://www.facebook.com/359807631501891/posts/422240048591982/?app=fbl
            "శ్రవణ మననాదులంటే వేదాంత గురువాక్య శ్రవణాదులేనా?" అన్నా రొకరు. "అవును అయితే ఒకటి. ఈ బాహ్య శ్రవణ మననాదులేగాక అంతర శ్రవణ మననాదులున్నవి. అవి మనఃపరిపాక వశంగా స్ఫురించాలి. ఆ అంతర శ్రవణం చేసిన వారికి సందేహాలు ఉండవు" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
           "అంతర శ్రవణాదులంటే యేమి?" అని అప్పుడప్పుడు కొందరు ప్రశ్నిస్తే "సదా హృదయకుహరమందు అహమహమని భాసించే ఆత్మస్పురణ నెరుగటే అంతర శ్రవణమనీీి, దానియందు నిలకడగా నలవరుచుకొనుట మననమనీ, అది తానుగా నిలుచుట నిదిధ్యాసమనీ" భగవాన్ సెలవిస్తూ ఉంటారు. 
 
     భగవద్రచితమైన "హృదయ కుహరమధ్యే" అన్న శ్లోకం, తాత్పర్యం జ్ఞప్తి ఉన్నదో లేదో దిగువన రాస్తాను అందులో ఆత్మస్ఫురణ ప్రకాశమును గురించేగాక పొందే విధానం కూడా విశదంగా ఉన్నది పొందుటనగా తానుగా  నిలుచటయే కదా?

*హృదయకుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం*
*హ్యహ మహమితి సాక్షా దాత్మరూపేనణ భాతి.*
*హృది విశ మనసా స్వం చిన్వతా మజ్జతావా*
*పవన చలన రోధా దాత్మనిష్ఠో భవ త్వమ్.*

           తా:  హృదయగుహమద్యమం దేకమైన బ్రహ్మము మాత్రమే "నేను నే"నని యాత్మరూపముగా భాసించుచున్నది. తన్నుదా  వెదకి మునుగు మనస్సుచేతనో, ప్రాణరోధమువలన మునుగు మనస్సు చేతనో, హృదయమునంది ఆత్మనిష్ఠుడవు కమ్ము.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ