రమణాశ్రమ లేఖలు 134 జ్ఞానదృష్టి 20.7.47
రమణాశ్రమ లేఖలు 134 జ్ఞానదృష్టి 20.7.47
https://bhagavanraman.blogspot.com/2019/04/134.html
భగవాన్ తమకు అప్పుడప్పుడు స్ఫురించి కానీ, ఎవరైనా అడిగినప్పుడు కానీ పద్యశ్లోకగద్యాదులు ఎందుకూ పనికిరాని చిన్ని చిన్ని చిత్తు కాగితాలలో వ్రాసేవారు. పోయినవి పోగా మిగిలినవన్నీ ఈ మధ్య ఏరి ఉంచాం. చిన్ని పుస్తకం ఒకటి కుట్టి అవన్నీ అతికించి ఉంచాలని నా ఉబలాటం. అప్పుడప్పుడు భగవానునితో మనవిచేస్తూ వచ్చాను. "ఊ ఎందుకదీ?" అంటూ వచ్చారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/422759395206714/?app=fbl
నిన్న మధ్యాహ్నం తప్పక అతికించుదామని వచ్చి మనవి చేస్తే "ఎందుకూ అన్నీ ఒక్కదానిలోనే ఉంటే స్వామి వ్రాసిందిగా ఉందే అని ఎవరో ఒకరు పట్టుకొని
పోతామంటారు. మనమేమి చెప్పేందుకు లేదు. స్వామి అందరికీ ఉమ్మడి కదూ. విడిగా ఉంటేనే మంచిది" అన్నారు భగవాన్. ఈ సూక్ష్మం ఉండుటవల్లనే భగవాన్ అంగీకరించలేదు కాబోలని అంతటితో విరమించాను.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
ఇంతలో దడబిడలుగా వచ్చిన యువకుడొకడు "స్వామి! జ్ఞానికిి ఈ భాహ్యదృష్టిగాక జ్ఞానదృష్టి వేరే ఉంటుందట. ఆ దృష్టి నాకు అలవడునట్ల అనుగ్రహిస్తారా? లేక అలా అనుగ్రహించే వారున్న స్థలం చూపిస్తారా?" అన్నాడు. "ఆ జ్ఞానదృష్టి ఎవరంతట వారు సంపాదించుకోవలసిందే కానీ, ఒకరిచ్చేది కాదండీ" అన్నారు భగవాన్. "గురువే అన్నీ అనుగ్రహిస్తాడంటారు కదా" అన్నారా భక్తులు. "ఈ మార్గము ననుసరించి పోతే జ్ఞానదృష్టి కలుగుతుందనీ చెపుతారు. పోతే కదా. జ్ఞానయైన గురువు మార్గదర్శకుడేగాని నడవటం మనమే నడవాలి " అన్నారు భగవాన్ . ఆ యువకుడు తెల్లబోయి"అంతేనా?" అంటూ లేచి వెళ్ళాడు.
మరి కాస్సేపటికి రమణపురనివాసిగా నున్న ఒక భక్తుని బిడ్డ అయిదా రేండ్లది తమ తోటలోనివి పచ్చి జామ పండ్లు రెండు తెచ్చి భగవానుని కిచ్చింది . ఆ పిల్ల అప్పుడప్పుడు భక్ష్యాలూ,పండ్లూ తెచ్చి భగవానునికిస్తూ ఉంటుంది. తెచ్చినప్పుడల్లా "ఎందుకమ్మా ఇవన్నీను" అంటూనే తినేవారు భగవాన్. నిన్న ఈ పండ్లు తినక ఇది భగవానుకు , ఇది భగవానుకు ' అంటూ అందరికీ పెట్టి నీవు తినమ్మా. అందరిలోనూ భగవానున్నారు. నిత్యం తెస్తావెందుకు? వద్దని చెప్పాను కదూ ? అందరకీ అక్కడే పెట్టు. అందరిలోను భగవానున్నారు పో అమ్మా" అని చెప్పి పంపారు. ఆ పిల్ల చిన్నబుచ్చుకుని వెళ్ళింది. భగవాన్ నావైపు చూచి "పిల్లలకు అదొక సరదా. స్వామికి ఇస్తానంటే తమకూ వస్తుందని ఆశ. నేను కొండ మీద ఉండగా సెలవు వచ్చిందంటే సరి,ఆడపిల్లలు మగపిల్లలు నా వద్దకు వచ్చేవారు. ఇంట్లో వాళ్ళను డబ్బడిగి మిఠాయిపొట్లాలు బిస్కట్లూ లు మొదలైనవన్నీ తెచ్చేవారు. నేనుఅందరితో కలిసి కూర్చునేవాణ్ణి. అన్నిటిలోనూ నాకొక భాగం వచ్చేది" అన్నారు భగవాన్.
"బాలగోపాలుని వలె భగవాన్ వారితో విందారగించే వారన్నమాట" అన్నాను నేను. భగవాన్ నవ్వుతూ "స్వామికి తీసుకుని పోతామంటే తమకు వస్తుందని వాళ్ళ ఆశ. ఎప్పుడో ఒకసారైతే సరిగాని రోజూ ఎందుకు? వాళ్ళంతా తింటే నేను తిన్నట్టు కాదా ఏమి?" అన్నారు. అందరిలోనూ నేనున్నానని భగవాన్ ఎంత స్పష్టంగా నిరూపిస్తున్నారో అని నాకు హర్షామోదములు కలిగినవి.
వారం పది రోజుల క్రిందట ఏమైందనుకున్నావ్. ఉదయం ఫలహారం సమయంలో వడ్డన చేసేవారిలో ఒకరు బత్తాయి తొనలు భగవాన్ విస్తట్లో ఎక్కువగానూ ఇతరులకు కొంచెం తక్కువగాను వడ్డించారట. భగవాన్ అది చూచి "నేనిక బత్తాయి తొనలు తిననే తిన" నని మానివేశారు. నాలుగైదు రోజుల క్రిందట భక్తులంతా మళ్లీ గ్రహించవలసిందని బ్రతిమలాడితే "మీరంతా తింటే చాలదా. నాకెందుకు?" అన్నారు భగవాన్."మేమంతా తింటూ భగవాన్ తినకుంటే మాకు బాధ కాదా. అందుకే ప్రార్థిస్తున్నాం. క్షమించి అనుగ్రహించాలి" అన్నారు భక్తులు. "క్షమించేందుకేమున్నదయ్యా. అవి నాకు అంతగా ఇష్టం లేదు" అన్నారు భగవాన్. "భగవాన్ శరీర ఆరోగ్యానికి మంచిది. మా నిమిత్తం తినం"డని వారంటే భగవాన్, "ఇదిగో చూడండి. ఇప్పుడిక్కడ ఫలహారం చేసేవారు వందకుపైగా ఉన్నారుకదా. ఇన్ని ముఖాలతో తింటున్నాను చాలదూ? ఈ ముఖంతో తింటేనే తిన్నట్టా యేమి?" అన్నారు.
అది కదా జ్ఞానదృష్టి. అది ఎవరిస్తే వస్తుంది చెప్పు.
T.Me/BhagavanRaman
Comments
Post a Comment