రమణాశ్రమ లేఖలు 133 అక్షయలోకం 18.7.47.


రమణాశ్రమ లేఖలు 133 అక్షయలోకం 18.7.47. https://bhagavanraman.blogspot.com/2019/04/133-18747.html
       మొన్న మధ్యాహ్నం తమిళ యువకుడొకడు శ్రీవారిని సమీపించి "స్వామీ, నేను ధ్యానం చేసుకుంటూ పడుకుంటే నిద్రపట్టింది. ఎవరైదనదీ ఇప్పుడు గుర్తురాదుగానీ, కలలో ఒకరు కనిపించారు.వారు నన్ను చూచి దృఢస్వరంతో 'భగవంతుడు పదనారు తలలతో కల్క్యావతారం ఎత్తాడు. ఒకచోట పెరుగుతున్నాడు' అని చెప్పి మాయమైనారు.ఆ కల్కి మూర్తి ఎక్కడున్నాడో, భగవాన్ సెలవీయగలరని వచ్చా" నన్నాడు. "సరి సరి. ఆ కలలో కనుపడిన వారినే అడక్కపోయినారా? అప్పుడే అడగవలసింది. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? వారే తిరిగివచ్చి చెప్పేవరకు ధ్యానం చేయండి" అన్నారు భగవాన్. ఆ యువకుడది చలోక్తిగా గ్రహించలేక "ధ్యానం చేస్తూ ఉంటే,వారు తిరిగి కనపడి,యదార్ధంగా వారు ఎక్కడుండేది చెబుతారా?"అన్నాడు."ఆ అవతార పురుషుడు ఎక్కడుండేది చెప్పనీ,చెప్పకపోనీ, ధ్యానం మాత్రం విడవకుండా చేస్తూంటే యదార్ధమేదో గోచరిస్తుంది. అప్పుడు ఏ సందేహాలకు తావుఉండదు" అన్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/423315565151097/?app=fbl
       ఇదే సందని మరొకరందుకుని "భగవంతుడు అక్షయ లోకంలో ఉంటా డంటారే, నిజమేనా?" అన్నారు. "మనము క్షయమయ్యే లోకంలో ఉంటే, ఆయన అక్షయలోకంలో ఉంటాడు. క్షయమయ్యే లోకంలో మనమున్నామా? లేదా? ఇది నిజమైతే అది నిజమే. మనం లేనిది లోకమేది? కాలమేది?" అన్నారు భగవాన్. 
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
       ఇంతలో నాలుగేండ్ల కుర్రాడొకడు ఆడుకునే చిన్న మోటారుకారొకటి చేత్తో పట్టుకొని హాల్లో ప్రవేశించాడు. భగవాన్ చూచి "అరే, మోటార్ మనల్ని మోసే బదులు, మనమే మోటారును మోస్తుంన్నామే.భలే బాగుంది రా" అని నవ్వి. ఆ వెనక అందరినీ కలియచూచి "ఇదిగో చూడండి ఇది కూడా ఒక ఉపమానంగా తీసుకోవచ్చును. మోటారులో మనం కూర్చున్నామని,మోటారు మనల్ని మోస్తున్నదని,తలచి, మేము కారులో వచ్చాం, కారు మమ్మ తీసుకునివచ్చింది అంటాం. మనం నడపకుంటే జడమైన కారు నడుస్తుందా? లేదు. నడిపేదెవరు? మనమే. అట్లాగే ఈ లోకమున్నూ. మనం లేని లోకం ఎక్కడున్నది? చూచేవాడుంటే ఆ సృష్టివైచిత్ర్యం గోచరించేది? చూచే దెవరు? తానే, తానో, సర్వత్రా నిండి ఉన్నాడు. ఇక క్షయమేది? అక్షయమేది?  తానెవరో విచారించి తెలుసుకుంటే ఏ గొడవలు ఉండవు" అన్నారు. సద్విద్య (ఉన్నది నలుబది) లో ఇదే భావం సూత్రప్రాయంగా భగవాన్ వ్రాసే ఉన్నారు.
                
                   సద్విద్య (ఉన్నది నలువది)
                
16 మనము లేక కాల మేది? దేశ మేది! మనము దేహ మనినచో కాలదేశములకు లోబడగలము. మనము దేహమా? మనమి ఇప్పు డప్పు డెప్పుడు నొకరము. ఇక్కడక్కడెక్కడ నేకమే. కనుక, కాల దేశము లేని మనమే యున్నారము.
T.Me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ